భారతదేశంలోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అందించని విధంగా మీ టీవీఎస్ బైక్‌కు డిజిట్ ఇన్సూరెన్స్ పాలసీని అందజేస్తుంది. ఈ పాలసీలో భాగంగా మీకు అనేక ప్రయోజనాలు అందుతాయి.
వాటిలో కొన్ని:
1. ఎక్కువ సంఖ్యలో ఉన్న నెట్వర్క్ గ్యారేజీలు – డిజిట్ ఇన్సూరెన్స్ మీకు టీవీఎస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా క్యాష్‌లెస్ రిపేర్ ఫెసిలిటీని అందజేస్తుంది. దీని ద్వారా మీ టూ వీలర్ రిపేర్ అయినపుడు మా నెట్వర్క్ గ్యారేజీలకు వెళ్లి ఎటువంటి డబ్బులు చెల్లించకుండా క్యాష్‌లెస్ రిపేర్లు చేయించుకోవచ్చు. డిజిట్ కంపెనీకి దేశవ్యాప్తంగా 2900 కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. మీరు క్యాష్‌లెస్ రిపేర్లు చేయించుకునేందుకు ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి.
2. టూవీలర్ ఇన్సూరెన్స్ పాలసీల కొరకు ఆప్షన్స్ – డిజిట్ ఇన్సూరెన్స్ ద్వారా మీ టీవీఎస్ బైక్‌ను కింది విధాలుగా ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.
థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ - ఈ పాలసీ మీకు థర్డ్ పార్టీ ద్వారా సంభవించే లయబిలిటీలను కవర్ చేస్తుంది. థర్డ్ పార్టీ వ్యక్తులకు, వాహనాలకు, ప్రాపర్టీలకు ఏదైనా నష్టం కలిగితే ఈ పాలసీ ద్వారా కవర్ చేయబడుతుంది.
కాంప్రహెన్సివ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ – ఈ ఇన్సూరెన్స్ పాలసీ కేవలం థర్డ్ పార్టీ లయబిలిటీలను మాత్రమే కాకుండా ప్రమాదం, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వంటి కారణాల వలన మీ సొంత వాహనానికి జరిగే డ్యామేజీల ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
మీరు 2018 సెప్టెంబర్ తర్వాత టీవీఎస్ టూ వీలర్‌ను కొనుగోలు చేసినట్లయితే మీరు ఓన్ డ్యామేజ్ కవర్‌ను కూడా ఎంచుకోవచ్చు. దీనివలన మీకు అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి. థర్డ్ పార్టీ లయబిలిటీలతో పాటుగా కాంప్రహెన్సివ్ కవరేజీని కూడా అందిస్తుంది. మీకు అంతకు ముందు థర్డ్ పార్టీ పాలసీ ఉన్నా కూడా దీనిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.
3. అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు – సాధారణంగా మీరు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఓ వ్యక్తి వచ్చి డ్యామేజ్ అయిన మీ బైక్‌ను తనిఖీ చేస్తాడు. కానీ డిజిట్ ఇన్సూరెన్స్‌లో ఆ విధంగా ఉండదు. మీరు స్మార్ట్ ఫోన్ సాయంతో మీ డ్యామేజ్ అయిన బండిని ఫొటో తీసి మాకు పంపితే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్‌తోనే తనిఖీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పద్ధతి ద్వారా మీ క్లెయిమ్ చాలా వేగంగా, త్వరగా సెటిల్ అవుతుంది. ఎటువంటి పేపర్ వర్క్‌కు ఆస్కారం ఉండదు. డిజిట్ క్లెయిమ్స్‌ను ఆన్లైన్లోనే సెటిల్ చేస్తుంది. ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి కేవలం కొన్ని రోజులు పడుతుంది.
డిజిట్ కంపెనీ అన్ని కంపెనీలలా కాకుండా క్లెయిమ్ ప్రక్రియను సులభతరం చేసింది. డిజిట్ ఆన్లైన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీ క్లెయిమ్‌ను సెటిల్ చేసేందుకు కొన్ని రోజుల సమయం మాత్రమే తీసుకుంటుంది. వేరే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్ సెటిల్ చేసేందుకు తీసుకునే సమయం కంటే ఇది చాలా చాలా తక్కువ.
డిజిట్ కంపెనీ అధిక క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోను కలిగి ఉంది. కాబట్టి మీ క్లెయిమ్ తిరస్కరణకు గురి కావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది.
4. సులభమైన ఇన్సూరెన్స్ కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియ – మీరు మీ టీవీఎస్ టూ వీలర్ లేదా టీవీఎస్ స్కూటీ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో రెన్యువల్ చేయాలని చూస్తుంటే, మీకు డిజిట్‌ను మించిన సులభమైన ప్రాసెస్ అందించే కంపెనీ దొరకదు. మీ ఇన్సూరెన్స్‌ను రిన్యూ చేసుకునేందుకు ఇక్కడ మీకు సులభమైన పద్ధతి ఉంటుంది. అంతేకాకుండా మీకు గత కంపెనీలో ఉన్న నో క్లెయిమ్ బోనస్ కూడా దీనిలో కలపబడుతుంది. ప్రీమియం మీద మీకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
5. ఎక్కువ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ – వాహన ఐడీవీ గురించి ముందుగానే చర్చించాం. మీ టీవీఎస్ బైక్ ఇన్సూరెన్స్‌ను రిన్యూ చేసే ముందు ఎక్కువ ఐడీవీని అందించే కంపెనీ కోసం చూడండి. మీరు కనుక ఎక్కువ ఐడీవీ ఉన్న పాలసీని తీసుకుంటే మీ బండికి డ్యామేజ్ కానీ, నష్టం కానీ జరిగినపుడు మీకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. మీ ఐడీవీని కస్టమైజ్ చేసుకునేందుకు డిజిట్ మీకు అవకాశం కల్పిస్తుంది. డిజిట్ పాలసీలో మీ అవసరాలకు తగిన విధంగా ఐడీవీని మార్చుకోండి.
6. ఎన్నో రకాల యాడ్–ఆన్ కవర్స్ – డిజిట్ అందించే టీవీఎస్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో మీకు వివిధ రకాలైన యాడ్-ఆన్స్ లభిస్తాయి. దీని ద్వారా మీ బైక్‌కు అదనపు రక్షణ లభిస్తుంది. టీవీఎస్ బైక్ ఇన్సూరెన్స్‌లో మీకు లభించే కొన్ని యాడ్-ఆన్స్.
జీరో డిప్రిషియేషన్ కవర్
ఇంజన్, గేర్ ప్రొటెక్షన్ కవర్
రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్
బ్రేక్‌డౌన్ అసిస్టెన్స్
కంజూమబుల్ కవర్
పైన పేర్కొన్న యాడ్–ఆన్స్ చాలా ముఖ్యం. ఇవి మీ బండి లేదా స్కూటీని సంరక్షించేందుకు చాలా ఉపయోగపడతాయి.
7. 24x7 కస్టమర్ సర్వీస్ – మీకు మెరుగైన సేవలను అందించేందుకు డిజిట్ టీమ్ అవిశ్రాంతంగా పని చేస్తుంది. మీరు జాతీయ సెలవు దినాల్లో కాల్ చేసినా కూడా మా కస్టమర్ సపోర్ట్ నిపుణులు మీకు అందుబాటులో ఉంటారు.
అందుకే డిజిట్ అత్యుత్తమ ఎంపిక.
తక్కువ ధరలో ప్రీమియంలు, ఉపయోగకరమైన యాడ్–ఆన్‌లతో డిజిట్ ఇన్సూరెన్స్ కంపెనీ మీ టీవీఎస్ బైక్ లేదా స్కూటర్ లేదా మోపెడ్‌ను ఎక్కువగా సంరక్షిస్తుంది.
ఇన్సూరెన్స్ పొందడం ఎలాగో ఇంకా సందేహంలో ఉన్నారా?
మీ టీవీఎస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలో మేము మీకు కొన్ని విషయాలను చెబుతాం.