యమహా అనేది 1955లో స్థాపించబడింది. ఇది జపాన్‌కు చెందిన టూ వీలర్ కంపెనీ. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం జపాన్‌లోని షిజుయోకాలో ఉంది. భారతదేశంలో యమహా 1985లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం మన దేశంలో యమహాకు హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో మూడు ఫ్యాక్టరీలు ఉన్నాయి.
యమహా కంపెనీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం అది తన కస్టమర్లను చూసుకునే విధానం. నేడు భారతదేశంలో యమహా కంపెనీకి 500 మంది కంటే ఎక్కువ మంది డీలర్లు ఉన్నారు. యమహా స్పోర్ట్స్ బైక్స్, సూపర్ బైక్స్, స్ట్రీట్ బైక్స్, స్కూటర్లను తయారు చేస్తుంది.
భారతదేశంలో అందుబాటులో ఉన్న యమహా యొక్క ప్రముఖ మోడళ్లు ఇక్కడ ఉన్నాయి.
యమహా YZF R15 V3 (Yamaha YZF R15 V3)
యమహా MT 15 (Yamaha MT 15)
యమహా FZ S V3 (Yamaha FZ S V3)
యమహా ఫసీనో (Yamaha Fascino)
యమహా FZ25 (Yamaha FZ25)
యమహాలో ప్రీమియం బైకులతో పాటుగా సరసమైన ధరలకు కూడా బైక్స్ లభిస్తాయి. బైక్ ధరతో సంబంధం లేకుండా మంచి యమహా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం చాలా ముఖ్యం.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భంలో మీ సొంత వాహనం లేదా థర్డ్ పార్టీ వాహనానికి ఏవైనా డ్యామేజీలు జరిగితే చట్టం నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి బైక్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది.
యమహా బైకులు భారతదేశంలో ఎందుకు అంత పాపులర్?
ప్రధానంగా చూసుకుంటే ఈ కింది కారణాల వలన యమహా బైకులు భారతదేశంలో చాలా ఫేమస్ అయ్యాయి.
విస్తృత శ్రేణి ఉత్పత్తులు – ఇతర ద్విచక్ర వాహన కంపెనీలతో పోల్చుకుంటే యమహా అకేషనల్, రెగ్యులర్ రైడర్ల కోసం వాహనాలను తయారు చేస్తుంది. కంపెనీ ఎన్నో రకాల వెరైటీ వాహనాలను అందజేస్తోంది. ధరలు కూడా సాధారణంగానే ఉంటాయి. మీకు ఆసక్తి ఉన్న, మీ బడ్జెట్‌కు సరిపోయే బైక్‌ను మీరు కొనుగోలు చేయొచ్చు.
పర్ఫామెన్స్ ఇచ్చే బైకులు – యమహా యొక్క ప్రతీ బైక్ అద్భుతమైన పర్ఫామెన్స్తో వస్తుంది. ఇంజిన్ క్యూబిక్ కెపాసిటీ, హ్యాండ్లింగ్, సస్పెన్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటీ చాలా నాణ్యతతో తయారు చేయబడతాయి. ఇవి మీకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందజేస్తాయి.
మంచి కస్టమర్ సర్వీస్ – యమహా అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కంపెనీ. ఇదో గ్లోబల్ బ్రాండ్. కంపెనీ మెరుగైన కస్టమర్ సర్వీసును అందజేస్తోంది. బైక్ గురించి ఏదైనా చిన్న సందేహం నుంచి యమహా బైకుల గురించి మరింత తెలుసుకోవడం వరకు యమహా కస్టమర్ కేర్ మీకు సాయం చేస్తుంది. ఈ విధానం మిమ్మల్నియమహా ఫ్యామిలీలో చేరేందుకు ప్రేరేపిస్తుంది.
భారతీయులకు యమహా బైక్స్ ఎంత ప్రీతిపాత్రమో మీకు తెలుసు. కావున అటువంటి బైక్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మీబైక్ (అందులో మీరు పెట్టిన పెట్టుబడి) మీరు బండికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినపుడు మాత్రమే ఇది సేఫ్‌గా ఉంటుంది.