హీరో మ్యాస్ట్రో టూ వీలర్స్ గురించి, అసలు అవి ఎందుకు అంత ప్రజాదరణ పొందాయనే విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ టూ వీలర్ కొనుగోలు చేసే ముందు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఆలోచించండి.
భారతదేశంలో అత్యుత్తమ టూ వీలర్లను హీరో అందిస్తోంది. హీరో కంపెనీ నుంచి వచ్చిన సరసమైన ధర, అధునాతన ఫీచర్లు ఉన్న బైక్ మ్యాస్ట్రో. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రజల కోసం రూపొందించబడింది. మ్యాస్ట్రో స్కూటర్లు ఆకర్షణీయమైన ధరలు, అత్యుత్తమ నాణ్యతతో వస్తాయి.
మీ హీరో మ్యాస్ట్రోను ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా?
మ్యాస్ట్రో బైక్ను సొంతం చేసుకోవడం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ మీ బైక్కు జరిగే అనుకోని ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు ఆర్థికంగా రక్షించుకోవడం చాలా ముఖ్యం. హీరో మ్యాస్ట్రో ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆర్థికపరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
మీ మ్యాస్ట్రో బైక్కు బీమా పొందడం ఏం ఆప్షనల్ కాదు. మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం వాహనానికి బీమా కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఉండాలి. మీరు ఏ విధమైన బీమా లేకుండా వాహనంతో రోడ్ల మీద తిరిగితే మీకు భారీ ట్రాఫిక్ ఫైన్ పడే ప్రమాదం ఉంటుంది. బీమా లేకుండా మొదటి సారి పట్టుబడితే రూ. 2,000, రెండో సారి పట్టుబడితే రూ. 4,000 జరిమానా చెల్లించాల్సి రావచ్చు.