స్కూటర్ కొనుగోలు చేయడానికి ముందు దాని ఫీచర్ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే దాని సంరక్షణ కోసం మీరు పొందే టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మీరు ఆస్వాదించగల ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ సుజుకీ యాక్సిస్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మీరు పొందగల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
మీరు తరచూ తిప్పే వాహనంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? సుజుకీ యాక్సిస్ మీకు సరిగ్గా సరిపోయే వాహనం కావచ్చు. సుజుకీ యాక్సిస్ అనేది భారతదేశంలోని టూ వీలర్ మార్కెట్లోని అత్యంత విశ్వసనీయమైన పేర్లలో ఒకటి. దాదాపు 13 సంవత్సరాల క్రితం 2007లో మార్కెట్లోకి వచ్చిన సుజుకీ యాక్సిస్ తదనంతర కాలంలో మంచి పేరు తెచ్చుకుంది.
దానిలాంటి వాహనాన్ని సొంతం చేసుకోవడం గర్వకారణం. అందువల్ల, ప్రమాదాలు లేదా స్కూటర్కు ఏదైనా ఇతర నష్టం సంభవిస్తే అది మీకు మానసిక, ఆర్థిక నష్టానికి దారి తీయవచ్చు.
సుజుకీ యాక్సిస్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది అటువంటి దురదృష్టకరమైన సందర్భాల్లో మీకు అవసరమైన రక్షణను అందిస్తుంది. అటువంటి ప్రమాదాలను ఈ పాలసీ నిరోధించలేనప్పటికీ, ప్రమాదం తర్వాత మీ స్కూటర్ రిపేర్ చేయించడంలో మీరు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను మాత్రం తగ్గిస్తుంది. అంతేగాక మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలకు బీమా పాలసీలు తప్పనిసరి కాబట్టి, ఈ పాలసీని కలిగి ఉండటం వల్ల మీరు జరిమానాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండకపోతే మీ టూ వీలర్ పై రూ. 2000 జరిమానా వరకు విధించవచ్చు. ఒకవేళ మరోసారి అదే తప్పు పునరావృతమైతే జరిమానా రూ. 4000 వరకు చేరుకుంటుంది.
అయితే, దాని గురించి తర్వాత చూద్దాం! ముందు భారతదేశ వ్యాప్తంగా సుజుకీ యాక్సిస్ ఎందుకు ప్రతిష్టాత్మకమైన స్కూటర్లలో ఒకటిగా మారిందో తెలుసుకుందాం.