టీవీఎస్​ ఇన్సూరెన్స్

సులభమైన స్టెప్పుల్లో టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు/రిన్యూ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

టీవీఎస్​ బైక్​లు, వాటి పాపులారిటీకి కారణం, టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీలు, మీరు గరిష్ట ప్రయోజనాలు పొందడానికి వాటిలో ఒకదాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. మీ TVS టూ వీలర్​ వాహనానికి ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే బెనిఫిట్లు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. భారతదేశం టూ వీలర్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాప్​ ప్లేస్​లో ఉంది. 2018-19వ సంవత్సరంలో 2.45 కోట్ల టూ వీలర్లను ఉత్పత్తి చేశాయి. మోటార్​ వాహనాల మార్కెట్​ దినాదినాభివృద్ధి చెందుతుంది. దేశంలోని 22 బైక్​ కంపెనీలు కలిసి 2018లో సగటున 2.18 కోట్ల యూనిట్లను అమ్మాయి. (1)

దేశీయంగా ఉన్న మోటార్​ కంపెనీలలో టీవీఎస్​ మోటార్​ కంపెనీ విశ్వసనీయతకు మారు పేరుగా ఉంది. దేశంలో మూడో అతిపెద్ద టూ వీలర్​ ​కంపెనీగా టీవీఎస్​ ఉంది. ఈ కంపెనీ వార్షికాదాయం రూ. 20,185.43 కోట్లు. ఈ గణాంకాలతోనే టీవీఎస్​ కంపెనీ గొప్పదనం అర్థమవుతుంది.

టీవీఎస్​ టూ వీలర్స్​​ ఇన్సూరెన్స్​ గురించి తెలుసుకుందాం. టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ అనేది అద్భుతమైనది. మీ టీవీఎస్​ టూ వీలర్ల​కు ఇది చాలా ఉత్తమమైనది. మీరు మీ వాహనాన్ని రోడ్డుపై నడుపుతున్నపుడు ఇది మీకు అత్యుత్తమ సంరక్షణను అందిస్తుంది.

మోటార్​ వాహనాల చట్టం–1988 ప్రకారం భారతదేశంలోని రోడ్ల మీద తిరిగేందుకు ఇన్సూరెన్స్ (కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​) ​తప్పనిసరి. ఇది మిమ్మల్ని ఆర్థికపరమైన నష్టాల నుంచి కాపాడుతుంది. మీ టూ వీలర్​ ఏదైనా ప్రమాదానికి గురైతే మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకుంటుంది.

టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్​ అవుతాయి?

ఏమేం కవర్​ కావంటే..

మీ టూ వీలర్ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ చేయబడదనే విషయాన్ని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేయాలని అనుకున్నపుడు కవర్ చేయబడని విషయాల గురించి మీకు ఆశ్చర్యంగా అనిపించొద్దు కదా.

 

థర్డ్ పార్టీ పాలసీ దారుడికి అయిన సొంత డ్యామేజీలు

థర్డ్ పార్టీ లేదా లబయబులిటీ ఓన్లీ బైక్ పాలసీ తీసుకున్నపుడు సొంత డ్యామేజీలు కవర్ చేయబడవు.

 

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా

మీరు మద్యం సేవించి వాహనం నడిపినా లేదా సరైన టూ వీలర్ లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినా మీ ఇన్సూరెన్స్ కవర్ చేయబడదు.

 

సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా వాహనం నడిపితే

ఒక వేళ మీరు లెర్నర్ లైసెన్స్​ను కలిగి ఉంటే.. వెనుక సీట్​లో కూర్చున్న వ్యక్తి లైసెన్స్ కలిగి ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే మీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది.

 

పర్యవసాన నష్టాలు

ప్రమాదం జరిగిన తర్వాత మీ టూ వీలర్​ను తప్పుగా వాడి దాని వలన ఏదైనా డ్యామేజ్ జరిగితే అది కవర్ చేయబడదు.

 

స్వీయ నిర్లక్ష్యం

స్వీయ నిర్లక్ష్యం చేసిన సందర్భంలో మీ ఇన్సూరెన్స్ వర్తించదు. ఉదా.. మీ నగరంలో వరదలు వచ్చినపుడు మీరు ఆ వరదల్లో డ్రైవ్ చేయకూడదని డ్రైవర్స్ మ్యాన్యువల్​లో క్లియర్​గా ఉంటుంది. ఒక వేళ మీరు వాహనం వేసుకుని వెళ్తే.. జరిగే నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు.

 

యాడ్-ఆన్స్ కొనుగోలు చేయకపోతే

కొన్ని డ్యామేజీ​ను యాడ్–ఆన్స్ మాత్రమే కవర్ చేస్తాయి. అటువంటి డ్యామేజీలు జరిగినపుడు మీకు సంబంధిత యాడ్–ఆన్ లేకపోతే ఇన్సూరెన్స్‌ కవర్ కాదు.

 

డిజిట్ జావా బైక్ ఇన్సూరెన్స్​నే ఎందుకు కొనుగోలు చేయాలి

మీ అవసరాలకు సరిపోయే బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్​ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం కారణంగా సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు

×

అగ్నిప్రమాదం జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు

×

ప్రక-తి వైపరీత్యాలు జరిగినప్పుడు సొంత టూవీలర్ బైక్ కు జరిగే డ్యామేజీ /నష్టాలు

×

థర్డ్ పార్టీ వెహికిల్ కు జరిగే డ్యామేజీలు

×

థర్డ్ పార్టీ ప్రాపర్టీకి జరిగే డ్యామేజీలు

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి గాయాలు లేదా మరణం సంభవిస్తే

×

స్కూటర్ లేదా బైక్ దొంగతనానికి గురైతే

×

మీ ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోగలగడం

×

కస్టమైజ్డ్ యాడ్–ఆన్ లతో మరింత సురక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్, థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా కానీ రెన్యూవల్ చేసినా కానీ చింత లేకుండా ఉండండి. 3 సులభమైన స్టెప్స్​లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్ 1

1800-258-5956 నంబర్ మీద కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్​ మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్​ ఫోన్​తో ఫొటో తీయండి. ఎలా చేయాలో మేము దశలవారీ ప్రక్రియను మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

ఏ పద్ధతిలో మీకు రిపేర్ కావాలో ఎంచుకోండి. రీయింబర్స్​మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత ప్రక్రియను ఎంచుకుంటే మా నెట్​వర్క్​ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? ఎవరైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు ప్రతి ఒక్కరికి మదిలో మెదిలే ప్రశ్న ఇది. పర్లేదు మీరు సరైన దారిలోనే వెళ్తున్నారు. డిజిట్ క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి

టీవీఎస్​ మోటార్​ కంపెనీ – సంక్షిప్త చరిత్ర

టీవీఎస్​ మోటార్ గ్రూప్​ భారతదేశంలోని మోటార్​ కంపెనీల్లో ఒకటి. ఇది టీవీఎస్​ గ్రూప్​కు ఎక్కువ ఆదాయం సమకూర్చే విభాగం. ఈ కంపెనీని పరిమాణంలో చూసినా లేదా ఆదాయంపరంగా చూసినా చాలా పెద్దది. టీవీఎస్​ కంపెనీ ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. ఇది సుందరం క్లేటన్​ కంపెనీ ద్వారా 1972లో ప్రారంభమైంది. జపాన్​కు చెందిన సుజుకీ కంపెనీ సాంకేతిక సాయం అందించడంతో టూ వీలర్స్​ను తయారు చేయడం ప్రారంభించింది. సుజుకి అనేది జపాన్​లో ఓ పెద్ద మోటార్​ తయారీదారి సంస్థ.

2001వ సంవత్సరంలో టీవీఎస్​ మోటార్స్​, సుజుకి విడిపోయాయి. సుజుకితో కాంట్రాక్ట్​ ముగిసిపోవడంతో వీరి బంధానికి పుల్​ స్టాప్​ పడింది. అప్పటివరకు ఆ కంపెనీ అనేక అవార్డులు, రివార్డులను అందుకుంది. భారతదేశపు టూ వీలర్​ తయారీ పరిశ్రమలో టీవీఎస్​ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ఇటీవల కంపెనీ ప్రవేశపెట్టిన కొన్ని వాహనాలు:

  • టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​–200

  • టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​–310

  • టీవీఎస్​ ఎక్స్​ఎల్​-100

  • టీవీఎస్​ విక్టర్​

నాణ్యమైన ఉత్పత్తులతో టీవీఎస్​ కంపెనీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న కంపెనీలలో టీవీఎస్​ కంపెనీకి ఒక ప్రత్యేక పేరు ఉంది. అందువల్లనే టీవీఎస్​ బైక్​లతో పాటు టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్ అన్నా కూడా అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు.

టీవీఎస్​ మోటార్​ కంపెనీ ఎందుకు అంత పాపులర్​​ అయింది?

ఈ కంపెనీ పాపులర్​ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలను కింద వివరించాము.

  • మొట్టమొదటి స్వదేశీ బైక్​ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది టీవీఎస్ కంపెనీ వారు –  దాని పేరు విక్టర్.

  • సాధారణ వ్యక్తికి రోజువారీ అవసరాలు తీర్చే విధంగా టీవీఎస్​ కంపెనీ ఉత్పత్తి చేసే బైక్​లు ఉంటాయి. ఈ బైక్​ల ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఫ్యాన్సీ బైక్​లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సాధారణ బైక్​లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సాధారణ ప్రజలకు ఇవి చాలా ఉపయోగపడతాయి.

  • 2019లో టీవీఎస్​ కంపెనీ మొదటి ఇథనాల్​ ఆధారిత మోటార్​ సైకిల్​ను ఉత్పత్తి చేసింది. శిలాజ ఇంధనాలకు బదులుగా ఇథనాల్​ను వాడటం వలన కాలుష్యం తగ్గుతుంది. ప్రస్తుత రోజుల్లో ఇది చాలా అవసరం.

  • టీవీఎస్​ కంపెనీ తయారు చేసే టూ వీలర్లు అధునాతన సాంకేతికతతో తయారవుతున్నాయి. వీటి డిజైన్​ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పనితనం చాలా ముచ్చటేసేలా ఉంటుంది.

భారతదేశంలో టీవీఎస్​ బైకులు ఇంతలా ఫేమస్​ అయిపోవడానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. రోజువారి ప్రయాణాల కోసం మోటార్​ సైకిళ్లపై ఆధారపడే వారికి టీవీఎస్​ బైకులు ఎక్కువగా నచ్చుతాయి.

టీవీఎస్​ టూ వీలర్ల ఫీచర్లు – అవి చూడగానే ఎందుకు నచ్చుతాయి?

భారతీయ​ తయారీదారు​లచే తయారు చేయబడిన బైకు​ల విషయానికి వస్తే.. టీవీఎస్​ కంపెనీ అనేది ఎవరికీ రెండో ఎంపికలా ఉండదు.

మమల్మి అడగడం దేనికి? మీరే ఓ లుక్కేయండి.

  • మన్నిక – బైకు​ల మన్నిక (డ్యూరబిలిటీ) అనేది మీరు బండిని ఎలా వాడుతున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. టీవీఎస్​ టూ వీలర్లు ఎక్కువ రోజులు మన్నుతాయి. మనకు మార్కెట్లో లభించే నమ్మకమైన ఉత్పత్తులలో ఇవి ఒకటి. తక్కువ నిర్వహణ వ్యయంతో ఇవి లభిస్తాయి. కమ్యూటర్​ బైకు​ల విషయానికి వస్తే టీవీఎస్​ మోడల్స్​ చాలా బెస్ట్.

  • విశ్వసనీయత - మార్కెట్​లో విశ్వసనీయతకు మారుపేరు టీవీఎస్​. అలా ఉంటాయి ఆ కంపెనీ ద్విచక్రవాహనాలు. ప్రయాణాల కోసం అత్యుత్తమ బైక్స్​ కావాలంటే టీవీఎస్​ కంపెనీయే మంచి ఎంపిక. ఎక్కువ మంది భారతీయులు టీవీఎస్​ కంపెనీనే తమ తొలి ఎంపికగా ఎన్నుకుంటున్నారు. స్పోర్ట్​ మోడల్స్​ ఇష్టపడే వారిని టీవీఎస్​ కంపెనీ తన హై-ఎండ్​ మోడల్​ అయిన అపాచీతో సంతృప్తి పరిచింది. టీవీఎస్​ బైకులు మంచి మైలేజీని కూడా అందిస్తాయి.

  • స్థోమత – ఎన్నో రకాల ఫీచర్లు ఉన్నప్పటికి కూడా టీవీఎస్​ ద్విచక్రవాహనాల ఖరీదు చాలా తక్కువగానే ఉంటుంది. ఇవి సరసమైన ధరల్లో లభిస్తాయి. టీవీఎస్​ కంపెనీలో స్పోర్ట్స్​ బైక్​ అయిన టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​–310 ధర రూ. 2.28 లక్షలు మాత్రమే. మరోవైపు, ఎన్నో ఫీచర్లున్న టీవీఎస్​ స్పోర్ట్​ ధర కేవలం రూ. 40,000 వేలు మాత్రమే.

  • ఉత్పత్తుల్లో వైవిధ్యం - టీవీఎస్​ కంపెనీ ప్రతి సంవత్సరం విడుదల చేసే వెరైటీ ఉత్పత్తులతో మార్కెట్లో తన సమీప పోటీదారులకు పోటీనిస్తుంది. “ప్రతి ఒక్కరికి ఒక వాహనం (A vehicle for everyone)”, అనేది టీవీఎస్​ కంపెనీ ట్యాగ్​లైన్. ఈ కంపెనీ వివిధ రేంజ్​లు​ కల మోటార్​ సైకిల్స్, మోపెడ్స్​ తదితరాలను తయారు చేస్తుంది.

  • అధునాతన సాంకేతికత  – బీఎస్​-VI (BS-VI) ప్రమాణాలతో మన దేశంలో టూ వీలర్​ వాహనాన్ని ఉత్పత్తి చేసిన మొదటి కంపెనీ టీవీఎస్​. అంతేకాకుండా టీవీఎస్​ వాహనాలు మార్కెట్లో లభించే బైక్​లకన్నా ఎక్కువ శక్తి సామర్థ్యాలు కల ఇంజన్లను కలిగి ఉంటాయి.

అయితే, మార్కెట్లో నెంబర్​ వన్​గా ఉన్నా కూడా టీవీఎస్​ వాహనాలు రోడ్డు మీద ప్రమాదాలకు గురవుతాయి. దొంగతనాల బారిన పడతాయి. మీరు మీ వాహనాన్ని రోడ్డుపై నడుపుతుంటే దురదృష్టవశాత్తు ప్రమాదం జరగడం అనేది ఏమీ వింత కాదు.

అటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని ఆర్థికంగా రక్షించడం కోసం భారతదేశంలో అనేక రకాల ఇన్సూరెన్స్​ కంపెనీలు టీవీఎస్​ టూవీలర్ల కోసం పాలసీలను అందిస్తున్నాయి.

టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవడం ఎందుకు ముఖ్యమో ఓ సారి  లుక్కేయండి.

మీరు టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఎందుకు కొనుగోలు చేయాలి

మోటార్​ వాహనాల చట్టం–1988 ప్రకారం మీ టీవీఎస్​ బండికి కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండాలి. చట్టప్రకారం ఇది తప్పనిసరి. కానీ మీ టూ వీలర్​ వాహనానికి ఎక్కువ రక్షణ  అందించేందుకు కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​ను తీసుకోవడం ఉత్తమం.

మీరు ఇన్సూరెన్స్​ కవర్​ను ఎందుకు కొనుగోలు చేయాలి. టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు రెన్యువల్​ చేయించాలి?

ప్రయోజనాలపై ఓ సారి లుక్కేయండి.

  • మీ సొంత వాహనానికి జరిగిన నష్టం, డ్యామేజీల రికవరీ -  టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలో అత్యంత ముఖ్య విషయం అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, దొంగతనాల వలన మీ సొంత వాహనానికి ఏదైనా డ్యామేజ్​ లేదా నష్టం జరిగినపుడు మీకు నష్టపరిహారం వచ్చేలా చేస్తుంది. కొన్నిసార్లు ఎంత భద్రమైన ప్రదేశంలో మీరు మీ టీవీఎస్​ బండిని పార్క్​ చేసినా అది దొంగిలించబడుతుంది. ఈ సందర్భంలో మిమ్మల్ని ఆర్థికంగా రక్షించేందుకు ఈ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ మిమ్మల్ని కవర్​ చేస్తుంది.

  • థర్డ్​ పార్టీ వాహనాలకు జరిగిన నష్టాల​కు రీయింబర్స్​మెంట్  - మీకు ఈ కవర్​ను థర్డ్​ పార్టీ లయబిలిటీల పాలసీ,​ కాంప్రహెన్సివ్​ పాలసీ రెండూ అందిస్తాయి. ఈ ప్రయోజనం వలన మీరు ఇన్సూరెన్స్​ చేయించిన మీ వాహనం ద్వారా థర్డ్​ పార్టీ ఆస్తులు లేదా వ్యక్తులకు ఏదైనా నష్టాన్ని కలిగించినపుడు ఇన్సూరెన్స్​ అందించబడుతుంది. థర్డ్​ పార్టీ వ్యక్తి మీరు చేసిన ప్రమాదం వలన మృతి చెందినా కూడా ఈ పాలసీ మిమ్మల్ని సంరక్షిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నా కూడా ఈ పాలసీ రీయింబర్స్​ చేస్తుంది.

  • వ్యక్తిగత గాయాలైతే కవరేజ్​ - దీని వలన మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మీకు ప్రమాదంలో అంగవైకల్యం సంభవించినా కూడా ఈ పాలసీ నష్టపరిహారాన్ని అందజేస్తుంది. అనుకోని పరిస్థితుల్లో మీకు మరణం సంభవించినా కూడా ఈ ప్లాన్​ కింద మీ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం అందజేయబడుతుంది.

  • ఎక్కువ మొత్తంలో ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (ఐడీవీ)– టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ వలన మరో ప్రయోజనం ఏమిటంటే.. మీ బైక్​/స్కూటీ దొంగతనానికి గురై డ్యామేజ్​ అయినా లేదా పూర్తిగా పాడైపోయినా మీ ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వ్యాల్యూ (ఐడీవీ) మిమ్మల్ని కాపాడుతుంది. మీ ఐడీవీ ప్రకారం మీకు డబ్బులు అందించబడతాయి. టీవీఎస్​ పాలసీలో ఇందుకు అందించే మొత్తం విలువ మీ వాహన విలువ–దాని డిప్రిషియేషన్​ ఖర్చు​.

  • మీరు మీ ఇన్సూరెన్స్​ పాలసీ నుంచి అధిక ప్రయోజనాల​ను పొందేందుకు ఎక్కువ, మార్చుకోగల ఐడీవీ ఉన్న పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని అందజేస్తున్న కంపెనీని మార్చేందుకు మీరు చూస్తుంటే అధిక ప్రయోజనాలు ఉన్న పాలసీని అందించే కంపెనీని ఎంచుకోవాలి. యాడ్​–ఆన్స్​, రైడర్లు​ అందుబాటులో ఉన్న పాలసీని తీసుకోవాలి.

టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీలు ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. మంచి కంపెనీని ఎంచుకునేందుకు ఇదే సరైన సమయం​.

మీరు డిజిట్​ ఇన్సూరెన్స్​ గురించి ఆలోచించారా?

మీ టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ కోసం డిజిట్​నే ఎందుకు ఎంచుకోవాలి?

భారతదేశంలోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అందించని విధంగా మీ టీవీఎస్​ బైక్​కు డిజిట్​ ఇన్సూరెన్స్​ పాలసీని అందజేస్తుంది. ఈ పాలసీలో భాగంగా మీకు అనేక ప్రయోజనాలు అందుతాయి.

వాటిలో కొన్ని:

1. ఎక్కువ సంఖ్యలో ఉన్న నెట్​వర్క్​ గ్యారేజీలు – డిజిట్​ ఇన్సూరెన్స్​ మీకు టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ ద్వారా క్యాష్​లెస్​ రిపేర్​ ఫెసిలిటీని అందజేస్తుంది. దీని ద్వారా మీ టూ వీలర్​ రిపేర్​ అయినపుడు మా నెట్​వర్క్​ గ్యారేజీలకు వెళ్లి ఎటువంటి డబ్బులు చెల్లించకుండా క్యాష్​లెస్​ రిపేర్లు చేయించుకోవచ్చు. డిజిట్​ కంపెనీకి దేశవ్యాప్తంగా 2900 కంటే ఎక్కువ నెట్​వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. మీరు క్యాష్​లెస్​ రిపేర్లు చేయించుకునేందుకు ఇవి చాలా సహాయపడుతూ ఉంటాయి.

2. టూవీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీల కొరకు ఆప్షన్స్​ – డిజిట్​ ఇన్సూరెన్స్​ ద్వారా మీ టీవీఎస్​ బైక్​ను కింది విధాలుగా ఇన్సూరెన్స్​ చేయించుకోవచ్చు.

  • థర్డ్​ పార్టీ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ - ఈ పాలసీ మీకు థర్డ్​ పార్టీ ద్వారా సంభవించే లయబిలిటీలను కవర్​ చేస్తుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులకు, వాహనాలకు, ప్రాపర్టీలకు ఏదైనా నష్టం కలిగితే ఈ పాలసీ ద్వారా కవర్​ చేయబడుతుంది.

  • కాంప్రహెన్సివ్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ – ఈ ఇన్సూరెన్స్​ పాలసీ కేవలం థర్డ్​ పార్టీ లయబిలిటీల​ను మాత్రమే కాకుండా ప్రమాదం, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల వంటి కారణాల వలన మీ సొంత వాహనానికి జరిగే డ్యామేజీల​ ఖర్చులను కూడా కవర్​ చేస్తుంది.

మీరు 2018 సెప్టెంబర్​ తర్వాత టీవీఎస్​ టూ వీలర్​ను కొనుగోలు చేసినట్లయితే మీరు ఓన్​ డ్యామేజ్​ కవర్​ను కూడా ఎంచుకోవచ్చు. దీనివలన మీకు అనేక రకాల ప్రయోజనాలు అందుతాయి. థర్డ్​ పార్టీ లయబిలిటీల​తో పాటుగా కాంప్రహెన్సివ్​ కవరేజీని కూడా అందిస్తుంది. మీకు అంతకు ముందు థర్డ్​ పార్టీ పాలసీ ఉన్నా కూడా దీనిని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

3. అధిక క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోతో వేగవంతమైన క్లెయిమ్​ సెటిల్​మెంట్లు – సాధారణంగా మీరు క్లెయిమ్​ కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి ఓ వ్యక్తి వచ్చి డ్యామేజ్​ అయిన మీ బైక్​ను తనిఖీ చేస్తాడు. కానీ డిజిట్​ ఇన్సూరెన్స్​లో ఆ విధంగా ఉండదు. మీరు స్మార్ట్​ ఫోన్​ సాయంతో మీ డ్యామేజ్​ అయిన బండిని ఫొటో తీసి మాకు పంపితే సరిపోతుంది. స్మార్ట్​ ఫోన్​తోనే తనిఖీ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పద్ధతి ద్వారా మీ క్లెయిమ్​ చాలా వేగంగా, త్వర​గా సెటిల్​ అవుతుంది. ఎటువంటి పేపర్​ వర్క్​కు ఆస్కారం ఉండదు. డిజిట్​ క్లెయిమ్స్​ను ఆన్​లైన్​లోనే సెటిల్​ చేస్తుంది. ఈ ప్రాసెస్​ పూర్తి కావడానికి కేవలం కొన్ని రోజులు పడుతుంది.

డిజిట్​ కంపెనీ అన్ని కంపెనీలలా కాకుండా క్లెయిమ్​ ప్రక్రియను సులభతరం చేసింది. డిజిట్​ ఆన్​లైన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. మీ క్లెయిమ్​ను సెటిల్​ చేసేందుకు కొన్ని  రోజుల సమయం మాత్రమే తీసుకుంటుంది. వేరే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్​ సెటిల్​ చేసేందుకు తీసుకునే సమయం కంటే ఇది చాలా చాలా తక్కువ.

డిజిట్​ కంపెనీ అధిక క్లెయిమ్​ సెటిల్​మెంట్​ రేషియోను కలిగి ఉంది. కాబట్టి మీ క్లెయిమ్​ తిరస్కరణకు గురి​ కావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది.

4. సులభమైన ఇన్సూరెన్స్​ కొనుగోలు, రెన్యువల్ ప్రక్రియ – మీరు మీ టీవీఎస్​ టూ వీలర్​ లేదా టీవీఎస్​ స్కూటీ ఇన్సూరెన్స్​ను ఆన్​లైన్​లో రెన్యువల్​ చేయాలని చూస్తుంటే, మీకు డిజిట్​ను మించిన సులభమైన ప్రాసెస్​ అందించే కంపెనీ దొరకదు. మీ ఇన్సూరెన్స్​ను రిన్యూ చేసుకునేందుకు ఇక్కడ మీకు సులభమైన పద్ధతి ఉంటుంది. అంతేకాకుండా మీకు గత కంపెనీలో ఉన్న నో క్లెయిమ్​ బోనస్ కూడా దీనిలో కలపబడుతుంది. ప్రీమియం మీద మీకు డిస్కౌంట్​ కూడా లభిస్తుంది.

5. ఎక్కువ ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ  – వాహన ఐడీవీ గురించి ముందుగానే చర్చించాం. మీ టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ను రిన్యూ చేసే ముందు ఎక్కువ ఐడీవీని అందించే కంపెనీ కోసం చూడండి. మీరు కనుక ఎక్కువ ఐడీవీ ఉన్న పాలసీని తీసుకుంటే మీ బండికి డ్యామేజ్​ కానీ, నష్టం కానీ జరిగినపుడు మీకు ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. మీ ఐడీవీని కస్టమైజ్ చేసుకునేందుకు డిజిట్ మీకు అవకాశం కల్పిస్తుంది. డిజిట్​ పాలసీలో మీ అవసరాలకు తగిన విధంగా ఐడీవీని మార్చుకోండి.

6. ఎన్నో రకాల యాడ్​–ఆన్​ కవర్స్​  – డిజిట్​ అందించే టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో మీకు వివిధ రకాలైన యాడ్​-ఆన్స్​ లభిస్తాయి. దీని ద్వారా మీ బైక్​కు అదనపు రక్షణ లభిస్తుంది. టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​లో మీకు లభించే కొన్ని యాడ్​-ఆన్స్​.

  • జీరో డిప్రిషియేషన్​ కవర్​

  • ఇంజన్,​ గేర్​ ప్రొటెక్షన్​ కవర్​

  • రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్​

  • బ్రేక్​డౌన్​ అసిస్టెన్స్​

  • కంజూమబుల్​ కవర్​

పైన పేర్కొన్న యాడ్​–ఆన్స్​ చాలా ముఖ్యం. ఇవి మీ బండి లేదా స్కూటీని సంరక్షించేందుకు చాలా ఉపయోగపడతాయి.

7. 24x7 కస్టమర్​ సర్వీస్​ – మీకు మెరుగైన సేవలను అందించేందుకు డిజిట్​ టీమ్​ అవిశ్రాంతంగా పని చేస్తుంది. మీరు జాతీయ సెలవు దినాల్లో కాల్​ చేసినా కూడా మా కస్టమర్​ సపోర్ట్​ నిపుణులు మీకు అందుబాటులో ఉంటారు.

అందుకే డిజిట్​ అత్యుత్తమ ఎంపిక.

తక్కువ ధరలో ప్రీమియంలు, ఉపయోగకరమైన యాడ్​–ఆన్​లతో డిజిట్​ ఇన్సూరెన్స్​ కంపెనీ మీ టీవీఎస్​ బైక్​ లేదా స్కూటర్​ లేదా మోపెడ్​ను ఎక్కువగా సంరక్షిస్తుంది.

ఇన్సూరెన్స్​ పొందడం ఎలాగో ఇంకా సందేహంలో ఉన్నారా?

మీ టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలో మేము మీకు కొన్ని విషయాలను చెబుతాం.

మీ టీవీఎస్​ ఇన్సూరెన్స్​ పాలసీ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి?

మీ టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం తగ్గించుకోవడం కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఉదాహరణకు:

  • వాలంటరీ డిడక్టబుల్స్​ను ఎంచుకోవడం వలన మీరు మీ నెలవారీ ప్రీమియంను తగ్గించుకోవచ్చు. (క్లెయిమ్​ చేసుకునే సమయంలో మీకు వచ్చే మొత్తం కోసం మీరు కొంత మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్నే వాలంటరీ డిడక్టబుల్స్​ అంటారు)

  • యాడ్​–ఆన్స్​ను ఎంచుకునే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంచుకునే ప్రతి యాడ్​–ఆన్​కు ఎక్కువ ప్రీమియం మొత్తం కట్టాల్సి ఉంటుంది.

  • నో క్లెయిమ్​ బోనస్​ను తనిఖీ చేసుకుని మీరు దాని నుంచి గరిష్ట ప్రయోజనం పొందగలరో చూసుకోండి.

  • మీరు ఇన్సూరెన్స్​ పాలసీని నేరుగా కంపెనీ నుంచి  కొనుగోలు చేయండి. అలాకాకుండా ఏజెంట్​ లేదా బ్రోకర్​ ద్వారా పాలసీని కొనుగోలు చేసినట్లయితే, మీరు వారికి కూడా అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అందువలన మీరు ఇన్సూరెన్స్​ పాలసీకి ఖర్చు చేసే మొత్తం పెరిగిపోతుంది.

మీరు ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా ఇన్సూరెన్స్​ పాలసీ ప్రీమియంను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

మీరు ఇన్సూరెన్స్ పాలసీల గురించి మొత్తం తెలుసుకున్నారు. కాబట్టి, ఈ రోజే మీ టీవీఎస్​ బైక్​కు ఇన్సూరెన్స్​ చేయించండి.

నేను నా టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఆన్​లైన్​లో రిన్యూ చేసుకోవచ్చా?

నేను నా టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఆన్​లైన్​లో రిన్యూ

అవును. మీ టీవీఎస్​ టూ వీలర్​ పాలసీని ఆన్​లైన్​లో రిన్యూ చేసుకోవచ్చు. మీ పాలసీ గడువు ముగిసే సమయం కంటే ముందు మీ పాలసీని రిన్యూ చేసుకుని నో క్లెయిమ్​ బోనస్​ను పొందండి.

నేను టీవీఎస్​ ఇన్సూరెన్స్​ పాలసీని వేరే కంపెనీకి మార్చుకున్నపుడు నో క్లెయిమ్​ బోనస్​ను పొందొచ్చా?

మీరు టీవీఎస్​ టూ వీలర్​ ఇన్సూరెన్స్​ పాలసీ కంపెనీ మార్చినప్పటికి కూడా మీ నో క్లెయిమ్​ బోనస్​ అలానే ఉంటుంది.

నేను టీవీఎస్ ఇన్సూరెన్స్ పాలసీని రిన్యూ చేసుకున్నపుడు ఏ వివరాలను అందించాలి?

మీ టీవీఎస్​ బైక్​ ఇన్సూరెన్స్​ పాలసీని రిన్యూ చేసుకున్నపుడు మీరు కింది వివరాల​ను అందించాల్సి ఉంటుంది.

  • వాహనం రిజిస్ట్రేషన్​ నెంబర్

  • వాహనం కొనుగోలు సమయం,​ తేదీ

  • మీ పేరు

  • మీ చిరునామా, కాంటాక్టు వివరాలు

  • మీ టీవీఎస్​ టూ వీలర్​ మోడల్​, దాన్ని తయారు చేసిన తేదీ​.