బైక్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB)

ఎన్​సీబీ (NCB) డిస్కౌంట్​తో బైక్​ ఇన్సూరెన్స్​ కోట్​ పొందండి

Third-party premium has changed from 1st June. Renew now

బైక్​ ఇన్సూరెన్స్​లో నో క్లెయిమ్​ బోనస్​ (NCB)

మీ చిన్నతనం గనుక మీకు గుర్తుంటే.. మీరు ఐదారు సంవత్సరాల వయసు ఉన్నపుడు మీ నాన్న గారు మీతో చెప్పిన విషయాలను ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు వినయంగా ఉండి, బుద్దిగా చదువుకుంటే, మంచి మార్కులతో పాస్​ అయితే మీకు మంచి ట్రీట్​ ఇస్తారని చెప్పి ఉంటారు కదా. అలాగే ఎన్​సీబీ (NCB) పాలసీ కూడా. మీరు మంచి బైకర్​గా ఉంటే వచ్చే ట్రీట్‌ వంటిదే ఈ నో క్లెయిమ్​ బోనస్​ (No Claim Bonus).

మంచి బైక్​ రైడర్​గా ఉన్నందుకు నాకేం బోనస్ వచ్చిందని మీరు అడగొచ్చు. మీరు bike insurance  ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసినప్పటికీ, బైక్‌ను జాగ్రత్తగా నడిపి, సరిగా మెయింటేన్‌ చేస్తే మీ బైక్​ ఇన్సూరెన్స్​ను క్లెయిమ్​ చేసుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే అక్కడ క్లెయిమ్‌ చేసుకోవడానికి మీ బండికి ఏ డ్యామేజ్‌ లేదు కనుక.

బైక్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB) అంటే ఏమిటి?

మీరు బైక్​ ఇన్సూరెన్స్​ తీసుకునేటపుడు సంవత్సరం పాటు మీ బైక్​ను జాగ్రత్తగా నడిపి, ఎటువంటి క్లెయిమ్స్​ చేయకపోతే, తర్వాతి సంవత్సరం కట్టాల్సిన ప్రీమియంలో డిస్కౌంట్​ ఇస్తామని ఇన్సూరెన్స్​ కంపెనీలు చెబుతాయి. ఆ డిస్కౌంట్​నే నో క్లెయిమ్​ బోనస్​ (No Claim Bonus) (NCB) అంటారు.

ఎన్​సీబీ (NCB) ని బైక్​ ప్రీమియం మీద అందించే డిస్కౌంట్​గా వ్యవహరిస్తారు. పాలసీ సంవత్సరం​లో ఎటువంటి క్లెయిమ్స్​ చేయకుండా ఉండటం వలన ప్రీమియం మీద ఈ డిస్కౌంట్​ ఆఫర్​ చేయబడుతుంది. (కానీ, మేము క్లెయిమ్స్​ను పరిష్కరిస్తూ మా కస్టమర్లకు సహాయం చేయడాన్నే ఇష్టపడతాం.)

మీరు ఏళ్ల తరబడి మీ బైక్​కు ఎటువంటి నష్టం జరగకుండా, క్లెయిమ్​ చేయకుండా ఉంటే మీ ఎన్​సీబీ (NCB) పెరుగుతూ పోతుంది. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు ఎక్కువ డబ్బును ఆదా చేస్తుంది.

కొత్త బైక్​ను కొన్నపుడు ఎన్​సీబీ (NCB)ని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చా?

అవును, ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. ఎన్​సీబీ (NCB) ని పాత వాహనం నుంచి కొత్త వాహనానికి ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. ఎన్​సీబీ (NCB) అనేది పాలసీ హోల్డర్​కు ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్​ చేయించిన బండికి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి.

బైక్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB)ని ఎలా లెక్కిస్తారు?

మీ ఎన్​సీబీ (NCB) అనేది మీ comprehensive two wheeler insurance  పాలసీ మొదటి రెన్యువల్​ తర్వాతే మీకు వర్తిస్తుంది. (ఈ కింది విషయాలను గుర్తుంచుకోండి. ఎన్​సీబీ (NCB) ఓన్​ డ్యామేజ్​ కాంపోనెంట్ ప్రీమియంకు వర్తిస్తుంది. కాంపోనెంట్ ప్రీమియాన్ని ఐడీవీ (IDV) మీద ఆధారపడి లెక్కిస్తారు. బోనస్​ అనేది థర్డ్​ పార్టీ కవర్​ ప్రీమియంకు వర్తించదు).

మీరు క్లెయిమ్​ చేయకుండా ఉన్న మొదటి సంవత్సరం తర్వాత 20% డిస్కౌంట్​ను పొందుతారు. ప్రతి సంవత్సరం మీరు క్లెయిమ్​ చేయకుండా ఉంటే డిస్కౌంట్​ అనేది 5-10% శాతం చొప్పున పెరుగుతూ పోతుంది. మీరు క్లెయిమ్​ చేయని ప్రతి సంవత్సరానికి ఈ డిస్కౌంట్​ పెరుగుతూ ఉంటుంది.

మీరు మొదటి సంవత్సరం 20% డిస్కౌంట్​ కనుక పొందితే, అది తర్వాతి సంవత్సరం వరకు 25-30% అవుతుంది. తర్వాతి సంవత్సరానికి ఈ డిస్కౌంట్ 30-35% అవుతుంది. ఇలాగే ఉంటే ఐదేళ్లలో మీ బోనస్​ దాదాపు 50% వరకు అవుతుంది.

Check: Bike Insurance Calculator ని ఉపయోగించి ఎన్​సీబీ (NCB) డిస్కౌంట్​తో మీ బైక్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం ఎంత ఉంటుందో చెక్​ చేసుకోండి.

క్లెయిమ్​ చేయని సంవత్సరాలు నో క్లెయిమ్​ బోనస్
సంవత్సరం తర్వాత 20%
2 సంవత్సరాల తర్వాత 25%
3 సంవత్సరాల తర్వాత 35%
4 సంవత్సరాల తర్వాత 45%
5 సంవత్సరాల తర్వాత 50%

అత్యాశ వద్దు. మంచి ఎన్​సీబీ (NCB) కలిగి ఉంటే అత్యధిక డిస్కౌంట్​ లభిస్తుందని కొంత మంది అత్యాశకు పోతారు. కానీ ఐదు సంవత్సరాల తర్వాత మీ డిస్కౌంట్​ అనేది పెరగకుండా అలాగే ఉంటుంది. మీరు క్లెయిమ్​ చేయకపోయినా సరే డిస్కౌంట్​ అనేది పెరగదు.

ఉదాహరణకు, 2010వ సంవత్సరంలో ఒక వ్యక్తి బైక్​ తీసుకున్నాడని అనుకుందాం. అతడు మంచి ఎన్​సీబీ (NCB)ని కలిగి ఉండి ఐదు సంవత్సరాల వరకు ఎటువంటి క్లెయిమ్స్​ చేయలేదు. కానీ అతడు ఇప్పుడు కొత్త వాహనాన్ని కొని పాత బైక్​ ఎన్​సీబీ (NCB)ని కొత్త బండికి బదిలీ చేస్తే అతడికి ఇన్సూరెన్స్​ అమౌంట్​లో కేవలం 50 శాతం మాత్రమే తగ్గుతుంది.

నేను ఎన్​సీబీ (NCB)ని ఎప్పుడు కోల్పోతాను?

మీరు ఒక్కసారి క్లెయిమ్​ చేసినా మీ ఎన్​సీబీ (NCB) సున్నాకు పడిపోతుంది. మీరు ఏ సంవత్సరంలో బైక్​ పాలసీ తీసుకున్నా గానీ ఎన్​సీబీ (NCB) జీరో అవుతుంది. ఈ నియమం నుంచి తప్పించుకునే అవకాశం​ ఉందా? అని ప్రతి ఒక్కరూ చూస్తారు. ఉంది. మీరు కనుక మీ పాలసీలో ఎన్​సీబీ (NCB) ప్రొటెక్షన్​ ఫీచర్​ కలిగి ఉంటే మీకు ఈ నియమం వర్తించదు.

నేను ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసిన తర్వాత కూడా నా ఎన్​సీబీ (NCB)ని అలాగే ఉంచుకునే అవకాశం ఉందా?

ఉంది. కానీ అది మీ ఇన్సూరెన్స్​ కంపెనీ ఆ బెనిఫిట్​ ప్రొవైడ్​ చేసిందా? లేదా అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. దానికి మీ ఇన్సూరెన్స్​ కంపెనీ అనుమతిస్తే మీకు ఎన్​సీబీ (NCB) ప్రొటెక్ట్ యాడ్–ఆన్ అనేది మీ ఇన్సూరెన్స్​లో భాగంగా ఉంటుంది. ఈ ఫీచర్​ గనుక ఉంటే మీరు మీ ఎన్​సీబీ (NCB)ని కోల్పోకుండా ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్​కు కొన్ని ఇన్సూరెన్స్​ కంపెనీలు కొన్ని నిబంధనలను కూడా విధిస్తాయి. కావున మీ ఇన్సూరెన్స్​ కంపెనీ విధించిన నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి.

కావున, మీరు ఎప్పుడైనా సరే బైక్​ రేస్​కి వెళ్లే సమయంలో ఎన్​సీబీ (NCB) గురించి ఒక్కసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే అనవసరంగా ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేయడం వలన మీరు మీ ఎన్​సీబీ (NCB)ని కోల్పోవాల్సి వస్తుంది. ఎన్​సీబీ (NCB)ని కొత్త వాహనానికి కూడా ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. కావున బండిని జాగ్రత్తగా నడిపి మీ ఎన్​సీబీ (NCB)ని రక్షించుకోండి.

టూ వీలర్​ ఇన్సూరెన్స్​లో ఎన్​సీబీ (NCB) గురించి FAQs

నేను కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్​ ప్రొవైడర్​ను మార్చినట్లయితే?

మీరు కొత్త వాహనాన్ని కొని ఇన్సూరెన్స్​ కంపెనీని మార్చినపుడు కూడా మీ పాత ఎన్​సీబీ (NCB)ని ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. మీ పాత వాహనం ఎన్​సీబీ (NCB)యే కొత్త వాహనానికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పాత ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి క్లియరెన్స్​ సర్టిఫికెట్​ తెచ్చుకుంటే మీ ఎన్​సీబీ (NCB) కొత్త insurance company కి బదిలీ అయిపోతుంది.

ఎన్​సీబీ (NCB)ని నేను నా స్నేహితులకు​ లేదా కుటుంబ సభ్యులకు బదిలీ చేయొచ్చా?

స్నేహితుడికి బదిలీ చేయలేరు. కానీ, నామినీకి బదిలీ చేయొచ్చు. ఎన్​సీబీ (NCB) అనేది పాలసీ హోల్డర్​కు మాత్రమే చెందినదై ఉంటుంది. ఒకవేళ మీరు మీ బైక్​ను వేరే వాళ్లకు విక్రయించినా కూడా ఎన్​సీబీ (NCB)ని బదిలీ చేయలేరు. కానీ పాలసీ హోల్డర్​ మరణించినపుడు మాత్రం ఎన్​సీబీ (NCB) నామినీకి బదిలీ చేయబడుతుంది.

ప్రో టిప్​! మీ ఎన్​సీబీ (NCB) ని అలాగే కాపాడుకోండి. ఒక వేళ మీరు కనుక క్లెయిమ్​ చేస్తే మీ ఎన్​సీబీ (NCB) జీరోకి పడిపోతుంది. అప్పుడు మీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కావున మీ బండికి ఏవైనా మైనర్​ రిపేర్స్​ అయితే ఎటువంటి క్లెయిమ్​ చేయకుండా ఉండండి. ఇది మీ ప్రీమియం మొత్తాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.