డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)

ఇది ఏమిటి మరియు ఇది మీకు ఎలా సహాయపడుతుంది?

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన వంటి ప్రభుత్వ-మద్దతు గల పథకాల వలన, ప్రజలు ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత నష్టం సంభవించినప్పుడు ఆర్థిక కవరేజీని పొందవచ్చు. మీరు అలాంటి స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే, PMSBY గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) అంటే ఏమిటి?

నివేదికల ప్రకారం, భారతదేశం యొక్క మొత్తం GDPలో దాదాపు 1.4% ఆరోగ్యానికి కేటాయించబడింది (1) ఇది ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన ప్రజలకు సరైన చికిత్సను పొందడం ఖచ్చితంగా సవాలు గా మారుస్తుంది.

PMSBY అనేది భారతదేశపు 2015 బడ్జెట్‌లో ప్రకటించబడిన ఒక సామాజిక భద్రతా పథకం. భారతీయ జనాభాలో గణనీయమైన భాగం సరైన ఇన్సూరెన్స్ కవరేజీని కలిగి లేదనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ పథకం పాలసీదారుని కుటుంబ సభ్యులకు ద్రవ్య సహాయం అందించడానికి ఉద్దేశించబడింది. 

ఈ పథకం కింద మీరు ఎంత మొత్తం పొందవచ్చు అని ఆలోచిస్తున్నారా?

సరే, సంవత్సరానికి రూ.12 నామమాత్రపు ప్రీమియం మొత్తంతో, మీరు ప్రమాదవశాత్తూ మరణించడం మరియు శాశ్వత వైకల్యం కోసం రూ.2 లక్షల వరకు గణనీయమైన కవరేజీని పొందవచ్చు. ఈ పథకం మీకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ పధకం లక్షణాలు మరియు ప్రయోజనాలను చూడండి.

PMSBY యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన లేదా PMSBY కవరేజీని ప్రవేశపెట్టడం యొక్క ఏకైక ఉద్దేశ్యం ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సమాజంలోని తక్కువ-ఆదాయ వర్గానికి సహాయం చేయడం. మీరు దీన్ని ఎంచుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లయితే, ఈ పథకం అందించే క్రింది ప్రయోజనాలను గురించి తెలుసుకోండి:

  • పాలసీ ఫీచర్‌ల ప్రకారం, క్లయిమ్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు పొందవచ్చు మరియు నామినీ దాని ప్రయోజనాలన్నింటినీ పొందుతారు. 
  • మీరు అదనపు బాధ్యతలను తొలగించాలని నిర్ణయించుకుంటే, పాలసీని నిలిపివేయడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
  • అటువంటి పాలసీలతో, మీరు పన్నులను కూడా ఆదా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) కింద, మినహాయింపులు మరియు రూ.1 లక్ష బీమా మొత్తం రెండింటిపై పన్ను మినహాయింపులు మీకు లభిస్తాయి. 
  • ఇతర ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఈ పాలసీ భారీ మొత్తాన్ని ప్రీమియం కింద వసూలు చేయకుండా గణనీయమైన కవరేజీని అందిస్తుంది. 
  • ఆటో-డెబిట్ సదుపాయం మీరు ప్రీమియం చెల్లింపు పూర్తి చేయడానికి అదనపు గంటలు వెచ్చించాల్సిన అవసరం లేకుండా ప్రతి నెలా మొత్తం చెల్లింపబడుతుందని నిర్ధారిస్తుంది. 
  • రెండు కళ్లు కోల్పోవడం, కోలుకోలేని అవయవాలను కోల్పోవడం లేదా శాశ్వత నష్టం వంటి శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు ఈ పథకం రూ.2 లక్షల వరకు ద్రవ్య కవరేజీని అందిస్తుంది. మరియు పాక్షిక వైకల్యం ఉన్న సందర్భంలో, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన రిస్క్ కవరేజీగా రూ.1 లక్ష వరకు పొందవచ్చు.

PMSBY పథకం కింద ఏది కవర్ చేయబడదు?

ఈ పథకం ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన మెజారిటీ వ్యక్తులకు సహాయం చేయడంపై దృష్టి సారించినప్పటికీ, ఇది మరణానికి కారణానికి సంబంధించిన నిర్దిష్ట పరిమితులను కూడా కలిగి ఉంది. 

ఉదాహరణకు, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో, లబ్ధిదారుడు క్లయిమ్ ‌కు అర్హులు కాదు. అయితే, హత్యకు గురైన ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తుల లబ్ధిదారులు ఈ పథకం నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు అర్హులు.

వరదలు, భూకంపాలు మరియు మరిన్ని వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంభవించే మరణం లేదా వైకల్యం కూడా ఈ పథకం కింద కవర్ చేయబడుతుంది.

PMSBY కోసం అర్హత పారామితులు ఏమిటి?

ఇంతకు ముందు చెప్పినట్లుగా, కుటుంబంలో సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం చెందితే ఈ పథకం ఆర్థిక కవరేజీని అందిస్తుంది. ప్రభుత్వ-మద్దతు ఈ పధకం అందించే అద్భుతమైన ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి, మీరు PMSBY అర్హత ప్రమాణాలను మరియు మీకు ఆ అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి.

ఇక చదవండి:

  • PMSBY వయోపరిమితికి సంబంధించి నిర్దిష్ట సూచనలు ఉన్నాయి. 18-70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు ఈ నిర్దిష్ట పథకానికి అర్హులు. 
  • సాధారణంగా, వ్యక్తిగత బ్యాంక్ ఖాతాదారులందరూ (ఉమ్మడి మరియు వ్యక్తిగత ఖాతా) ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, అనేక బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నవారు ఒక ఖాతా ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • జాయింట్ అకౌంట్ హోల్డర్ల విషయంలో, ఖాతాదారులిద్దరూ ఈ పథకం ఫీచర్ల నుండి ప్రయోజనం పొందగలరు. 
  • భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులు కూడా ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు; అయితే, క్లయిమ్ ప్రక్రియ సమయంలో, నామినీ భారతీయ కరెన్సీలో మాత్రమే నిధులను అందుకుంటారు.

ప్రీమియం మొత్తం ఎంత?

ప్రతి పాలసీదారుడు సంవత్సరానికి రూ.12 చెల్లించాలి, ఇక్కడ మొత్తం లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి ఆటో-డెబిట్ చేయబడుతుంది. ఈ పథకాన్ని ఎంపిక చేసుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నామమాత్రపు మొత్తాన్ని కేటాయించింది.

PMSBY కోసం ఆవరసమైన డాక్యుమెంటేషన్ వివరాలు మరియు ఫారమ్ నింపే ప్రక్రియ

చాలా వరకు ప్రభుత్వ-మద్దతు గల పథకాలు సరళమైన డాక్యుమెంటేషన్ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, ఈ ప్రత్యేక పధకం కింద ప్రయోజనాల కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీరు ఇంకా ప్రాథమికమైన డాక్యుమెంటేషన్ ని పూర్తి చేయాలి. ఈ పథకాలకు అవసరమైన కొన్ని పత్రాలు క్రింది ఇవ్వబడ్డాయి - 

  • PMSBY దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి మరియు ఎంపిక చేసిన నామినీ గురించిన సవివరమైన సమాచారంతో సహా పేరు, ఆధార్ నంబర్, సంప్రదింపు వివరాలు వంటి అవసరమైన వివరాలు.అందించండి 
  • మీరు ఇప్పటికే దరఖాస్తు ఫారమ్‌తో పాటు మీ ఆధార్ వివరాలను సమర్పించినప్పటికీ, మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయనట్లయితే మీరు దాని కాపీని కూడా అందించాలి.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం నమోదు ప్రక్రియ ఏమిటి?

మీరు SMS మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉపయోగించడం ద్వారా ఈ నిర్దిష్ట పాలసీ కోసం నమోదు చేసుకోవచ్చు. మొదటిదాన్ని ఉపయోగించి మీరు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇక్కడ ఉంది: 

  • స్టెప్ 1: సదుపాయాన్ని యాక్టివేట్ చేయడానికి మీరు ఆన్-బోర్డింగ్ సంస్థ యొక్క టోల్-ఫ్రీ నంబర్‌కు కేవలం మెసేజ్ పంపవచ్చు. 
  • స్టెప్ 2: యాక్టివేషన్ SMS మీకు పంపబడుతుంది; ఆ వచనానికి 'PMSBY Y'తో జవాబు ఇవ్వండి. 
  • స్టెప్ 3: మీరు రసీదుని ధృవీకరిస్తూ మరొక సందేశాన్ని అందుకోవచ్చు మరియు ఆ విధంగా రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. 

SMS ద్వారా PMSBY నమోదు ప్రక్రియ కాకుండా, మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా ఉపయోగించి కొన్ని సెకన్లలో పూర్తి చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా:

  • స్టెప్ 1: మీరు ఎంచుకున్న ఆర్థిక సంస్థ యొక్క నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ చేసి, బీమా ఎంపికపై క్లిక్ చేయండి.
  • స్టెప్ 2: PMSBY ప్రీమియం కోసం చెల్లింపు చేయడానికి మీరు ఉపయోగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
  • స్టెప్ 3: నిర్ధారించే ముందు అన్ని వివరాలను తనిఖీ చేసి, ఆపై నిర్ధారణ రసీదుని డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఈ సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాకుండా, క్లయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియ కూడా అంతే సులభం మరియు సబ్‌స్క్రైబర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.

PMSBY పథకం కింద క్లయిమ్ ‌చేసే ప్రక్రియ ఏమిటి?

ఎలాంటి దురదృష్టకర సంఘటన అయినా సంభవించినట్లయితే, PMSBY స్కీమ్‌లో క్లయిమ్‌ను లేవనెత్తడానికి లబ్ధిదారుడు దిగువ పేర్కొన్న విధానాన్ని అనుసరించవచ్చు. 

  • స్టెప్ 1: ఈ పాలసీని ఎక్కడ నుండి కొనుగోలు చేశారో ఆ ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించడం ద్వారా ఈ ప్రక్రియ ను ప్రారంభించండి.
  • స్టెప్ 2: సాధారణంగా మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ పేరు, ఆసుపత్రి వివరాలు, కాంటాక్ట్ సమాచారం మొదలైన వివరాలను అందిస్తూ క్లయిమ్ ఫారమ్‌ను పూరించమని మిమ్మల్ని అడుగుతుంది. ఫారమ్ జన సురక్ష వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది; మీరు దానిని డౌన్‌లోడ్ చేసి పూరించవచ్చు.
  • స్టెప్ 3: ఫారమ్‌తో పాటు మీరు సమర్పించాల్సిన సహాయక పత్రాల జాబితాను గమనించండి. చాలా సందర్భాలలో, ఇన్సూరెన్స్ కంపెనీ వారు మరణ ధృవీకరణ పత్రం లేదా వైకల్య ధృవీకరణ పత్రం అడుగుతారు. 
  • స్టెప్ 4: వివరాలను నిర్ధారించిన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ క్లయిమ్ మొత్తాన్ని లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది మరియు క్లయిమ్ ‌ను సెటిల్ చేస్తుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) Vs ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY)

ఈ రెండు ప్రభుత్వ-మద్దతు పథకాలు ఆర్థికంగా సవాలుగా ఉన్న వ్యక్తులను ప్రత్యేకించి కుటుంబంలోని ఏకైక సంపాదన సభ్యుడు మరణించినప్పుడు ఆదుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, వీటిలో కొన్ని తేడాలు కూడా ఉన్నాయి, ఉదాహరణకు:

పరిగణించవలసిన అంశాలు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY)
పథకం రకం ఇది జీవిత బీమా పథకం ఇది ప్రమాద బీమా పథకం
వార్షిక ప్రీమియం మొత్తం రూ.330 సభ్యునికి ఒక్కొక్కరికి రూ. 12
కవరేజ్ రకం పాలసీదారునికి జీవిత బీమా కవరేజీని అందిస్తుంది పాలసీదారునికి ప్రమాదం జరిగినప్పుడు కవరేజీని అందిస్తుంది
వయోపరిమితి 18 మరియు 50 సంవత్సరాల మధ్య PMSBY వయోపరిమితి 18 మరియు 70 సంవత్సరాల మధ్య ఉంటుంది
గరిష్ట ప్రీమియం చెల్లింపు వయస్సు సాధారణంగా 50 సంవత్సరాల వరకు ఉంటుంది; అయితే, కొన్ని సందర్భాల్లో, దీనిని 55 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 70 ఏళ్లలోపు వ్యక్తులు ప్రీమియం చెల్లించాలి.
ప్రయోజనాలు ఈ పథకం యొక్క ఏకైక ప్రయోజనం ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి మరణిస్తే రూ.2 లక్షల వరకు ద్రవ్య కవరేజీని కలిగి ఉంటుంది. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే, నామినీ ఈ పాలసీ కింద రూ.2 లక్షల వరకు పొందుతాడు. అదేవిధంగా, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే, పథకం కింద రూ.2 లక్షలు పొందవచ్చు.,శాశ్వత పాక్షిక వైకల్యం జరిగిన సందర్భంలో, రూ.1 లక్ష పొందవచ్చు.

PMSBYలో పాల్గొనే బ్యాంకుల జాబితా

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకానికి అనుసంధానించబడిన అన్ని బ్యాంకుల పేర్లు ఇక్కడ ఇవ్వబడి ఉన్నాయి:

  • అలహాబాద్ బ్యాంకు
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
  • యాక్సిస్ బ్యాంకు 
  • భారతీయ మహిళా బ్యాంకు
  • కెనరా బ్యాంకు
  • ఫెడరల్ బ్యాంకు
  • కార్పొరేషన్ బ్యాంకు
  • సెంట్రల్ బ్యాంకు
  • దేనా బ్యాంక్
  • HDFC బ్యాంక్
  • IDBI బ్యాంక్
  • ఇండస్ఇండ్ బ్యాంక్
  • కేరళ గ్రామీణ బ్యాంక్
  • కోటక్ బ్యాంక్
  • ICICI బ్యాంక్
  • విజయా బ్యాంక్
  • పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్
  • ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • UCO బ్యాంక్
  • సౌత్ ఇండియన్ బ్యాంక్
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  •  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్
  • సిండికేట్ బ్యాంక్
  • యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ, అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో భారతదేశం ఇప్పటికీ కష్టపడుతోంది. సరైన పోషకాహారం, సురక్షితమైన నీరు, ప్రాథమిక పారిశుధ్యం మొదలైన ఆరోగ్య రంగానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలు తరచుగా విస్మరించబడుతున్నాయి. 

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం వంటి ప్రభుత్వ-అనుబంధ బీమా పథకాల రాకతో గణనీయమైన నష్టం తర్వాత అటువంటి పరిస్థితులను భరించడానికి ప్రజలకు సహాయపడింది.

తరచుగా అడుగు ప్రశ్నలు

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాన్ని ఎలా పునరుద్ధరించాలి?

పథకం యొక్క నిబంధనల ప్రకారం, జూన్ 1 నుండి మే 31 వరకు కేవలం ఒక సంవత్సర కాలానికి మాత్రమే ప్రయోజనాలు మరియు కవరేజీని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత, PMSBY ప్రయోజనాలను ఆస్వాదించడం కొనసాగించడానికి ప్రతి సంవత్సరం మే 31 లేదా అంతకు ముందు రెన్యువల్ తప్పనిసరి గా చేయించుకోవాలి. 

ఆటో-డెబిట్ సౌకర్యంతో, మీ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా చెల్లించబడుతుంది. అయితే, ఆటో-డెబిట్ సదుపాయాన్ని ప్రారంభించడానికి, స్కీమ్‌లో చేరడానికి ముందు కేటాయించిన సమయానికి మీ ఆటో-డెబిట్ సమ్మతిని అందించాలని నిర్ధారించుకోండి.

PMSBY పథకం చికిత్స లేదా ఆసుపత్రిలో చేరే ఛార్జీలకు ఆర్థిక కవరేజీని అందిస్తుందా?

లేదు. ఈ ప్రత్యేక పథకం కింద, ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యం సంభవించినప్పుడు మాత్రమే ఏకమొత్తం ప్రయోజనం అందించబడుతుంది.

నేను ఒక సంవత్సరం తర్వాత స్కీమ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చేరగలనా?

అవును, మీరు ఎప్పుడైనా తిరిగి చేరవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవు.

పాలసీ సర్టిఫికెట్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

మీరు PMSBY పథకం కోసం నమోదు చేసుకున్న పొదుపు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించండి. మీరు బ్యాంక్ ఆన్‌లైన్ పోర్టల్‌ని ఉపయోగించి పాలసీ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా మీకు మెయిల్ చేయమని నేరుగా వారిని అడగవచ్చు.

క్లయిమ్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు నేను ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించాలా?

ఇది పాలసీదారుడు ఎదుర్కొన్న ప్రమాదంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, కారు ప్రమాదం జరిగితే, పోలీసు ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించాలి. మరోవైపు, వ్యక్తి చెట్టుపై నుండి పడి శాశ్వత వైకల్యం పొందినట్లయితే అటువంటి పత్రాలు అవసరం లేదు. అయితే, ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రి రికార్డులు ఉపయోగపడతాయి.

PMSBY కస్టమర్ కేర్ నెంబర్ ఏమిటి?

1800-180-1111/1800-110-001 అనేది పాలసీని యాక్టివేట్ చేయడానికి మీరు ఉపయోగించగల టోల్-ఫ్రీ నంబర్. మీరు రాష్ట్రాల వారీగా కస్టమర్ కేర్ నంబర్ కోసం చూస్తున్నట్లయితే, జన సురక్ష వెబ్‌సైట్‌ను పరిశీలించండి.