ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్

తక్కువగా నడిపి.. తక్కువగా చెల్లించండి. ప్రీమియం మీద 25 శాతం వరకు తగ్గింపు

Third-party premium has changed from 1st June. Renew now

ડિજીટ કાર ઇન્સ્યોરન્સ સાથે ડ્રાઇવ લેસ, પે લેસનો પાવર મેળવો- તમારી ડ્રાઇવિંગની આદતોને ટ્રૅક કરીને અને વ્યાજબી દરને અનલૉક કરીને મોટી બચત કરો!

డిజిట్ డ్రైవ్‌ లెస్, పే లెస్ ను పరిచయం చేస్తున్నాము! కార్ ఇన్సూరెన్స్‌లో ఆదా చేయడానికి తెలివైన మార్గాన్ని కనుగొనండి.

డ్రైవ్‌ లెస్, పే లెస్ శక్తిని కనుగొనండి, డిజిట్ కార్ ఇన్సూరెన్స్‌తో తక్కువ చెల్లించండి - మీ డ్రైవింగ్ అలవాట్లను ట్రాక్ చేయడం ద్వారా మరియు సరసమైన ధరలను అన్‌లాక్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోండి!

కార్ ఇన్సూరెన్స్: తక్షణమే ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/ రెన్యువల్ చేయండి

కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

కార్​ ఇన్సూరెన్స్​ అనేది ఒక రకమైన మోటార్ ఇన్సూరెన్స్​. ఇదో రకమైన వాహన ఇన్సూరెన్స్​. ఇది మీ కారు​ను డ్యామేజీల నుంచి కాపాడుతుంది. ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి విపత్తుల వంటి విపత్తుల నుంచి సంరక్షిస్తుంది. అనుకోని సందర్భాల్లో వచ్చే విపత్తుల వలన మీరు ఆర్థికంగా కాపాడబడతారు. థర్డ్​ పార్టీ లయబిలిటీల​ నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.

మీరు కేవలం థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ మాత్రమే తీసుకుని చట్టబద్ధంగా ఉండాలనుకున్నా లేదా కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ తీసుకుని కారుకు ఎక్కువ ప్రొటెక్షన్​ అందించాలనుకున్నా మీ కోసం డిజిట్​ రెండు రకాల పాలసీలను అందిస్తుంది. అంతేకాకుండా ఓన్​ డ్యామేజ్​ కార్​ ఇన్సూరెన్స్​ను కూడా డిజిట్​ అందిస్తుంది. ఈ పాలసీలన్నింటినీ తక్కువ ప్రీమియం రేట్లకే ఆన్​లైన్​లో డిజిట్​ అందిస్తుంది.

కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​లో గొప్ప విషయం ఏంటంటే మీరు మీ ఐడీవీని కస్టమైజ్​ చేసుకోగలగడం. అంతేకాకుండా మీ కారు కోసం ఉపయోగకరమైన 7 రకాల యాడ్​–ఆన్లను కూడా మీరు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కావున మీరు డిజిట్​లో ఇన్సూరెన్స్​ కొనుగోలు చేయాలనుకున్నా లేదా రెన్యువల్​ చేయాలనుకున్నా, క్లెయిమ్​ చేయాలనుకున్నా కూడా స్మార్ట్​ ఫోన్​ ఆధారిత ప్రక్రియ​తో అన్నీ ఆన్​లైన్​లోనే సులభం​గా పూర్తవుతాయి.

డిజిట్ కార్ ఇన్సూరెన్స్లో ఏమేం కవర్ అవుతాయి.

డిజిట్ కార్ ఇన్సూరెన్స్తో యాడ్ ఆన్స్

మీరు మీ కార్ ఇన్సూరెన్స్​తో పాటు కొనుగోలు చేయగలిగే కార్ ఇన్సూరెన్స్ యాడ్ ఆన్లు Car insurance add-ons 

జీరో డెప్రిసియేషన్ కవర్

5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కార్లకు జీరో డెప్రిసియేషన్ కవర్ అనువైనది. మీ కారు మరియు దాని భాగాలపై విధించే తరుగుదలను జీరో డెప్రిసియేషన్ కవర్ zero depreciation cover తగ్గిస్తుంది. మరమ్మతులు, ఖర్చులు, రీప్లేస్​మెంట్ల యొక్క పూర్తి విలువను క్లెయిమ్ సమయంలో మీకు అందిస్తుంది. 

రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్

ఒకవేళ మీ కారు దొంగతనం జరిగినా లేదా రిపేర్ చేయలేని విధంగా పాడైపోతే అప్పుడు మీకు రిటర్న్ టూ ఇన్​వాయిస్ యాడ్ ఆన్ return to invoice add-on కనుక మీకు ఉన్నట్లయితే అది మీకు మీ వాహనం ఇన్​వాయిస్​ విలువ యొక్క మొత్తాన్ని అందిస్తుంది. అంతే కాకుండా మీ వాహన రిజిస్ట్రేషన్​కు అయ్యే ఖర్చు మరియు రోడ్​ ట్యాక్స్​ కూడా కవర్ అవుతాయి. 

టైర్ ప్రొటెక్ట్ కవర్

ప్రమాద సమయంలో నష్టం జరిగితే తప్ప సాధారణ సమయాల్లో టైర్​కు జరిగే నష్టాలు స్టాండర్డ్ ఇన్సూరెన్స్​లో కవర్ కావు. అందుకోసమే ఈ టైర్ ప్రొటెక్ట్ యాడ్ ఆన్ tyre protect add-on మీకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. టైర్ పేలడం, ఉబ్బడం లేదా టైర్ కట్స్ వంటి అన్ని సమస్యలకు ఈ యాడ్ ఆన్ మీకు పరిష్కారం చూపెడుతుంది. దీని ద్వారా మీ టైర్లు రక్షించబడతాయి. 

బ్రేక్ డౌన్ అసిస్టెన్స్

మనకు కార్​ గురించి ఎంత తెలిసినా కానీ కొన్ని, కొన్ని సార్లు సహాయం అవసరం పడుతుంది. డిజిట్ అందిస్తున్న బ్రేక్ డౌన్ అసిస్టెన్స్ యాడ్ ఆన్ Breakdown Assistance Add-On మీకు అవసరమైన సమయంలో సహాయాన్ని అందిస్తుంది. ఉదాహరణకు ఎటువంటి సమయంలోనైనా మీ కార్ బ్రేక్ డౌన్ అయినపుడు.. మీకు నచ్చిన విధంగా సహాయం అందిస్తుంది. ఇందులో మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇది క్లెయిమ్​గా కూడా పరిగణించబడదు. 

కన్స్యూమబుల్ కవర్

కన్స్యూమబుల్ కవర్ consumable cover మీ కారుకు అదనపు రక్షణ కవచాన్ని అందిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు కారు యొక్క ఇంజిన్ ఆయిల్స, స్క్రూలు, నట్స్ మరియు బోల్ట్స్, గ్రీస్ మొదలయిన మీ కారు అన్ని వస్తువులకు అయ్యే ఖర్చును ఇది కవర్ చేస్తుంది. 

ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్

మీ ఇంజిన్​ను మార్చేందుకు అయ్యే ఖర్చు కారుకు అయ్యే ఖర్చులో దాదాపు 40 శాతం అని మీకు తెలుసా? స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కేవలం ప్రమాద సమయంలో సంభవించే నష్టాలకు మాత్రమే పరిహారం లభిస్తుంది. కానీ ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్ కవర్​తో engine and gear-box protection cover ప్రమాదం తర్వాత మీ కారుకు సంభవించే (ఇంజిన్ మరియు గేర్​బాక్స్​) పర్యవసాన నష్టాల నుంచి మీ వాహనాన్ని రక్షించుకోవచ్చు. 

రోజూవారీ రవాణా ప్రయోజనం

ఒక వేళ మీ కారు చెడిపోయి గ్యారేజ్​లో ఉంటే.. డైలీ కన్వేయన్స్ బెనిఫిట్ Daily Conveyance Benefit యాడ్ ఆన్​ కనుక మీకు ఉంటే… కారు గ్యారేజ్​లో ఉన్న సమయంలో మీ రోజూ వారి ప్రయాణం కోసం అయ్యే ఖర్చును ఇది అందిస్తుంది. లేదా మీకు మరో వాహనాన్ని కానీ ఏర్పాటు చేస్తుంది. 

కీ మరియు లాక్ ప్రొటెక్ట్

దొంగతనం లేదా డ్యామేజ్ లేదా నష్టం జరిగినపుడు అందులోని లాక్​సెట్ రిపేర్​కు అయ్యే ఖర్చును కీ మరియు లాక్​ ప్రొటెక్ట్ Key and Lock Protect యాడ్ ఆన్​ కవర్ ఉంటే బీమాదారు మీకు చెల్లిస్తారు. 

వ్యక్తిగత వస్తువులకు నష్టం

బీమా చేయబడిన వాహనంలో పాలసీదారుని లేదా అతని కుటుంబసభ్యులకు చెందిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు పోతే loss of personal belongings వాటికి ఇన్సరెన్స్ కంపెనీ నష్టపరిహారం అందజేస్తుంది. 

పే ఆస్ యూ డ్రైవ్ కవర్

Pay as you drive పే ఆస్ యూ డ్రైవర్ కవర్ వలన ఎంచుకున్న ప్లాన్ ఆధారంగా బేస్ పాలసీ యొక్క ఓన్ డ్యామేజ్ కవర్  ప్రీమియం మీద డిస్కౌంట్ పొందేందుకు పాలసీదారుడు అర్హత పొందుతాడు. అదనపు ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా బేస్​ పాలసీ కింద కిలోమీటర్లను టాప్ అప్(రీచార్జ్) చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. 

ఏమేం కవర్ కావంటే

మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీలో ఏమేం కవర్​ కావనే విషయం గురించి కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. కవర్​ కాని విషయాలను మీరు ముందుగా తెలుసుకుంటేనే క్లెయిమ్​ చేసే విషయంలో ఆశ్చర్యానికి గురి కాకుండా ఉంటారు. కవర్​ కాని విషయాల గురించి ఇక్కడ పేర్కొన్నాం.

థర్డ్ పార్టీ పాలసీ దారుడి సొంత వాహనానికి అయిన డ్యామేజీలు

మీరు థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకున్నపుడు సొంత వాహనానికి అయిన డ్యామేజీలు​ ఇందులో కవర్​ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా నడిపినా..

ప్రమాదం జరిగినపుడు మీరు మద్యం సేవించి ఉన్నా లేదా సరైన డ్రైవింగ్​ లైసెన్స్​ లేకుండా వాహనం నడిపినపుడు పాలసీ కవర్​ కాదు.

సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా వాహనం నడిపితే

ఒకవేళ మీకు లెర్నర్స్ లైసెన్స్​ ఉంటే, సరైన లైసెన్స్​ ఉన్న వ్యక్తి మీ పక్కన ఉండాలి. అలా లేకుండా మీరు వాహనం నడిపితే ఇన్సూరెన్స్​ వర్తించదు.

పర్యావసాన నష్టాలు

ప్రమాదానికి సంబంధించినవి కాకుండా మిగతా డ్యామేజీలు​ అయినపుడు కవర్​ కాదు. (ఉదా.. ఒక ప్రమాదం తర్వాత మీ కారును ఎవరైనా సరే సరిగ్గా నడపకుండా దాని ఇంజన్​ డ్యామేజ్​ అయితే అది కవర్​ కాదు)

కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్

ఏదైనా కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ (ఉదా., తయారీదారు డ్రైవింగ్ మాన్యువల్ ప్రకారం సిఫార్సు చేయని వరదలో కారును నడపడం వల్ల జరిగిన డ్యామేజ్, కవర్ చేయబడదు)

అవసరమైన యాడ్ ఆన్స్ కొనుగోలు చేయనపుడు

కొన్ని డ్యామేజీలు​ యాడ్–ఆన్స్​లో మాత్రమే కవర్​ అవుతాయి. మీరు అలాంటి యాడ్​–ఆన్స్​ కొనుగోలు చేయకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో కవర్​ అయ్యే విషయాలు కవర్​ కావు.

మీరు డిజిట్ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

డిజిట్ అందించే కార్ ఇన్సూరెన్స్ యొక్క కీ ఫీచర్స్ (ముఖ్య లక్షణాలు)

కీ ఫీచర్స్ డిజిట్ ద్వారా ప్రయోజనం
ప్రీమియం రూ. 2094 నుంచి ప్రారంభం
నో క్లెయిమ్ బోనస్(NCB) 50శాతం వరకు డిస్కౌంట్
మీకు నచ్చిన యాడ్ ఆన్స్ 10 రకాల యాడ్ ఆన్స్ అందుబాటులో ఉన్నాయి.
క్యాష్లెస్ రిపేర్లు డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సేవలు 6000+ కంటే ఎక్కువ గ్యారేజీల్లో అందుబాటులో ఉన్నాయి.
క్లెయిమ్ ప్రాసెస్ స్మార్ట్ ఫోన్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. 7 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఆన్లైన్లో పూర్తవుతుంది.
ఓన్ డ్యామేజ్ కవర్ లభిస్తుంది.
థర్డ్ పార్టీ డ్యామేజెస్ పర్సనల్ డ్యామేజెస్ కొరకు అపరిమిత బాధ్యత మరియు ఆస్తులు లేదా వాహనాలకు డ్యామేజ్ జరిగితే 7.5 లక్షల వరకు నష్టపరిహారం

మీ అవసరాలకు సరిపోయే కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదం వల్ల సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

ఒకవేళ ఏదైనా ప్రమాదం లేదా ఢీకొట్టడం లాంటివి జరిగితే మీ సొంత కారుకు జరిగే డ్యామేజీలు కవర్ అవుతాయి.

×

అగ్ని ప్రమాదం వలన సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

అగ్నిప్రమాదం, మంటల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది.

×

ప్రకృతి విపత్తుల వలన మీ సొంత కారుకు అయ్యే డ్యామేజీలు/నష్టాలు

వరదలు, భూకంపాలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా మీ సొంత కారుకు కలిగే డ్యామేజీలు, నష్టాలను కవర్ చేస్తుంది.

×

థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజీలకు

మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది.

×

థర్డ్ పార్టీ ఆస్తుల డ్యామేజీలకు

మీ కారు వల్ల ఏదైనా థర్డ్ పార్టీ వాహనానికి కలిగే డ్యామేజీలు, నష్టాలకు రూ. 7.5 లక్షల వరకు కవరేజీ వర్తిస్తుంది.

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

యజమాని–డ్రైవర్ యొక్క శరీర గాయాలు లేదా మరణానికి కవర్ అవుతుంది. (చట్టపరంగా తప్పనిసరి, ఒకవేళ ముందు నుంచి లేనట్లు అయితే దీనిని ఎంచుకోవచ్చు)

×

థర్డ్ పార్టీ వ్యక్తి గాయాలపాలైనా/చనిపోయినా

మీ కారు వల్ల ఎవరైనా థర్డ్ పార్టీ వ్యక్తికి శరీర గాయాలు లేదా మరణం సంభవిస్తే, అపరిమిత లయబులిటీకి కవరేజీ వర్తిస్తుంది.

×

మీ కారు దొంగిలించబడితే

ఒకవేళ మీ కారు దొంగతనానికి గురైతే కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.

×

మీ ఐడీవీ (IDV) కస్టమైజ్ చేసుకోండి

మీ కారు యొక్క ఐడీవీ (IDV)ని మీకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోండి, తదనుగుణంగా మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి.

×

కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్తో అదనపు రక్షణ

టైర్ ప్రొటెక్ట్ కవర్, ఇంజిన్ అండ్ గేర్బాక్స్ ప్రొటెక్షన్, జీరో డిప్రిషియేషన్ యాడ్–ఆన్ వంటి కస్టమైజ్డ్ యాడ్–ఆన్స్తో మీ కారుకు అదనపు సంరక్షణను అందించండి.

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్​, థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి.

ఫోర్-వీలర్స్ కు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు

థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ మీ కారు ఇంజన్ సిసిపై ఆధారపడి ఉంటుంది మరియు సంబంధిత ప్రీమియం రేట్ లు కూడా ఐఆర్‌డిఎఐ (IRDAI) చే ముందుగా నిర్ణయించబడతాయి, ఇవి క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజిన్ సామర్థ్యంతో ప్రైవేట్ కార్లు 2019-20 ప్రీమియం INRలో ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలులోకి వస్తుంది)
1000cc మించకూడదు ₹2072 ₹2094
1000cc దాటినా 1500ccకి మించకూడదు ₹3221 ₹3416
1500cc మించిపోయింది ₹7890 ₹7897

భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ మార్కెట్ పరిమాణం, ప్రాంతాల వారీగా, 2015 నుండి 2025 వరకు విలువ ప్రకారం

2015-2025 నుండి 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి మరియు ట్రెండ్‌లపై అంతర్దృష్టులను పొందండి. మార్కెట్ ఉత్తర, దక్షిణ, తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో పంపిణీ చేయబడింది.

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ను కొనుగోలు/ రెన్యువల్ చేసిన తర్వాత చాలా నిశ్చింతగా ఉండండి. మీరు క్లెయిమ్ చేసేందుకు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా 3 స్టెప్పుల క్లెయిమ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. పైగా, ఇది పూర్తిగా డిజిటల్ ప్రక్రియ.

స్టెప్1

1800-258-5956 అనే నంబర్పై కాల్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఫారాలు కూడా నింపాల్సిన అవసరం ఉండదు.

స్టెప్2

అప్పడు మేము మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక స్వీయ తనిఖీ లింక్ను పంపిస్తాం. అప్పడు మీరు మీ వాహనానికి జరిగిన డ్యామేజీలను ఫొటో తీసి మాకు పంపిస్తే సరిపోతుంది. ఎలా పంపాలి అనేది మేము దశలవారీగా వివరిస్తాం.

స్టెప్ 3

రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కానీ, క్యాష్లెస్ క్లెయిమ్ కానీ ఎంచుకుంటే సరిపోతుంది. క్యాష్లెస్ క్లెయిమ్ అనేది కేవలం మా నెట్వర్క్ గ్యారేజీల్లోనే లభిస్తుంది.

డిజిట్ కార్ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిములు చేయడం మరింత సులభం

మేము ప్రతీసారి చెప్పేది ఒక్కటే. మేము ఇన్సూరెన్స్​ పాలసీలను మరింత సులభతరం చేశామని. కార్​ ఇన్సూరెన్స్​ విషయంలో కూడా మేము పాలసీలను మరింత సులభం చేశాం. మీరు కారు కోసం ఇప్పటికే చాలా ఖర్చు చేశారని మాకు తెలుసు. కాబట్టి మేము కార్​ ఇన్సూరెన్స్​ క్లెయిములను చాలా సులభంగా పూర్తి చేస్తాం. ఇవి చాలా సమర్థవంతమైనవిగా కూడా ఉంటాయి.

  • ఎక్కువ మంది ప్రజలు కోపగించుకునే విషయం ఎదురుచూడటం. మీరు ఏదైనా ప్రమాదం జరిగిందని క్లెయిమ్ చేస్తే అందుకోసం ఒక వ్యక్తి వచ్చి మీ కారును తనిఖీ చేయాల్సి రావడం. ఇందుకోసం మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. కానీ, డిజిట్​లో మేము స్మార్ట్​ ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియను ప్రారంభించాం. ఈ విధానం ద్వారా మీ కారుకు అయిన డ్యామేజీల​ను మీరే తనిఖీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కేవలం 7 నిమిషాల్లో మీ క్లెయిమ్​ ప్రాసెస్​ చేయబడుతుంది.
  • ప్రమాదం, ప్రకృతి విపత్తుల సందర్భంగా మీ కారు డ్యామేజ్​కు గురయినపుడు ఆ కారును బాగు చేయించేందుకు అయ్యే ఖర్చును గురించి చాలా మంది భయపడతారు. అందుకోసమే మేము క్యాష్​లెస్​ గ్యారేజీలను తీసుకొచ్చాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 5,800 కంటే ఎక్కువ క్యాష్​లెస్​ గ్యారేజీల్లో మీరు డబ్బు చెల్లించకుండానే మీ కారును రిపేర్​ చేయించుకోవచ్చు.
  • మేము ప్రతీ దానిని డిజిటలైజ్​ చేసేందుకు ప్రయత్నిస్తాం. మా వద్ద అన్ని ఆన్​లైన్​లోనే పూర్తవుతాయి. కావున మీకు ఎటువంటి హార్డ్​ కాపీలు​ అవసరం పడవు. ప్రతీది మా వెబ్​సైట్​​లో అప్​లోడ్​ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా యాప్​లో కూడా మీరు ఈ వివరాలను చూసుకోవచ్చు.

డిజిట్ యొక్క క్యాష్లెస్ గ్యారేజీలు

క్యాష్లెస్ గ్యారేజీల లిస్టు (List of 6000+ Network Garages) >
డిజిట్ క్లెయిమ్స్ ఎంత త్వరగా సెటిల్ అవుతాయి? ఎవరైనా కానీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చే ముందు వారి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇది. డిజిట్ యొక్క క్లెయిముల రిపోర్టు కార్డును చదవండి

మా గురించి మా కస్టమర్లు ఏమని అనుకుంటున్నారంటే..

విశాల్ మోడీ
★★★★★

డిజిట్​లో క్లెయిమ్​ ప్రక్రియ చాలా సింపుల్​గా ఉంటుంది. ఇందులో ఉన్న కస్టమర్​ టీమ్​ కూడా చాలా సాయం చేస్తూ ఉంటుంది. సర్వేయర్లు కూడా చాలా నిబద్ధతతో ఉంటారు. (నా విషయంలో మిస్టర్​ సతీష్​ కుమార్​). నేను కేవలం ఫొటోలను అప్​లోడ్​ చేయగానే క్లెయిమ్​ ప్రాసెస్​ అయింది. రీయింబర్స్​మెంట్​ కూడా చాలా త్వర​గా వచ్చింది. గో డిజిట్​ చాలా గ్రేట్​.

సులభ్ సిన్హా
★★★★★

నా అనుభవాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. డిజిట్​లో నాకు ఎదురైన విషయాలను నేను మీకు చెబుతాను. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇన్సూరెన్స్​ కంపెనీల్లో డిజిట్​ ఉత్తమ ఇన్సూరెన్స్​ కంపెనీ అని నేను చెబుతాను. క్లెయిమ్​ సెటిల్​మెంట్​ విషయంలోనైనా, లేదా కస్టమర్​ సపోర్ట్​ విషయంలోనైనా డిజిట్​ ఉత్తమం. నేను మిస్టర్​ రత్న (సర్వేయర్​) కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతడే నా క్లెయిమ్​కు సంబంధించిన కేసును పరిష్కరించాడు. అతడు సరైన సమయంలో నాకు ఇచ్చిన సలహా ఇచ్చాడు. ఎవరైనా సరే ఇన్సూరెన్స్​ కంపెనీ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తారు. డిజిట్​ కంపెనీ తన సర్వీసును ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాను.

సిద్ధాంత్ గాంధీ
★★★★★

డిజిట్​ ఇన్సూరెన్స్​లో పాలసీ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మొత్తం ప్రాసెస్​ డిజిటల్​గా, కస్టమర్​ ఫ్రెండ్లీగా ఉంటుంది. వర్క్​షాప్​లో నా కారు రిపేర్​ చేయించినపుడు నేను ఎటువంటి కంగారుకు గురికాలేదు. మీ కారుకు ఏదైనా ప్రమాదం అయిందని మీరు చెబితే వారు మీ ఫోన్​ నంబర్​కు ఒక లింక్​ పంపిస్తారు. ఆ లింక్​ ద్వారా మీ డ్యామేజ్​ అయిన కారు ఫొటోలను పంపిస్తే సరిపోతుంది. తర్వాత మీ క్లెయిమ్​కు సంబంధించిన పూర్తి విషయాన్ని సర్వేయర్​ చూసుకుంటాడు. నా విషయంలో మిస్టర్​ మాత్రే చాలా సహాయం చేశారు. అన్ని విషయాలకు అతడు స్పందించిన తీరు అద్భుతం. నా ముందటి ఇన్సూరెన్స్​ కంపెనీ కంటే డిజిట్​ ఖచ్చితంగా మెరుగ్గా ఉంది.

Show all Reviews

కార్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రయోజనాలు

మిమ్మల్ని ఆర్థిక నష్టాల నుంచి కవర్ చేస్తుంది

మీరు థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ ఎంచుకున్నా లేదా కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ఎంచుకున్నా ప్రమాదాల వలన కలిగే నష్టాల నుంచి ఆర్థికంగా కాపాడబడతారు. కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​లో ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వంటి అనుకోని సందర్భాల్లో ఎదురయ్యే నష్టాలు కూడా కవర్​ చేయబడతాయి. అంతే కాకుండా మీరు ట్రాఫిక్​ జరిమానాల నుంచి కూడా కాపాడబడతారు.

థర్డ్ పార్టీ డ్యామేజీల వలన ఏర్పడే సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది

ప్రమాదాలు సర్వసాధారణం. ఏదైనా సందర్భంలో మీ వాహనానికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం వలన థర్డ్​ పార్టీ వ్యక్తులు, ప్రాపర్టీలకు జరిగే డ్యామేజ్ నుంచి మిమ్మల్ని సంరక్షిస్తుంది. గంటల తరబడి మీరు పోరాడాల్సిన అవసరం ఉండదు.

యాడ్ ఆన్స్ వలన మంచి కవరేజ్ మరియు బెనిఫిట్లు అందుతాయి...

మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను కనుక ఎన్నుకుంటే మీకారుకు మరింత సంరక్షణ అందించే యాడ్​–ఆన్స్​ను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. జీరో డిప్రిషియేషన్ కవర్​, రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్, బ్రేక్​ డౌన్​  అసిస్టెన్స్​ వంటి యాడ్​–ఆన్లతో మీరు ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు.

చట్టం దృష్టిలో మంచి వ్యక్తులుగా ఉండండి

మోటార్​ వాహన చట్టం ప్రకారం భారతదేశంలో కార్ల​కు కనీసం థర్డ్​  పార్టీ ఇన్సూరెన్స్​ అయినా సరే తప్పకుండా ఉండాలి. ఎటువంటి ఇన్సూరెన్స్​ లేకుండా మీరు బయట తిరిగితే మీకు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ లేకుండా మొదటి సారి దొరికినపుడు రూ. 2,000, రెండో సారి దొరికినపుడు రూ. 4,000 వరకు ఫైన్ పడుతుంది.

డోర్ స్టెప్ పికప్, డ్రాప్

మీరు డిజిట్​ అందించే కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ ను తీసుకుంటే మీకు మరో ప్రయోజనం కూడా లభిస్తుంది. అదే డోర్​ స్టెప్​ పికప్, డ్రాప్​. మీ కారు ఎప్పుడైనా రిపేర్ చేయాల్సిన అవసరం వస్తే ఇది ఉపయోగపడుతుంది.

సమయాన్ని ఆదా చేసుకోండి!

ప్రస్తుతం టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. మీ కార్​ ఇన్సూరెన్స్​ కు సంబంధించిన అన్ని విషయాలు ఆన్​లైన్​లో చిటికెలో పూర్తవుతాయి. దీని వలన మీ డబ్బుతో పాటు విలువైన సమయం కూడా ఆదా​ అవుతుంది.

ఏ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఉత్తమమైనది?

కేస్ 1: మీరు కొత్త లగ్జరీ కార్ కొనుగోలు చేసినట్లయితే - విలాసవంతమైన కార్ ను కొనుగోలు చేయడం అనేది చాలా మంది యజమానులకు ఒక-పర్యాయ ఒప్పందం, కాబట్టి, మూడవ పక్షం లయబిలిటీ మరియు సొంత డ్యామేజ్ రెండింటినీ కవర్ చేయడానికి మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తో దాన్ని తప్పనిసరిగా కవర్ చేయాలి. విలాసవంతమైన కార్ ల కోసం తగిన యాడ్-ఆన్‌లు కూడా అవసరం.

దాని ఖరీదైన భాగాలను మరమ్మతు చేయడం/భర్తీ చేయడం యొక్క పూర్తి విలువను క్లయిమ్ చేయడానికి మీరు జీరో డిప్రెసియేషన్ కవర్‌ని పొందవచ్చు. ఇన్వాయిస్ కవర్‌కు రిటర్న్ అనేది విలాసవంతమైన కార్లకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే దొంగతనం లేదా మొత్తం నష్టపోయినప్పుడు మీ కారు యొక్క అసలు ఇన్వాయిస్ విలువను మీరు స్వీకరిస్తారని నిర్ధారిస్తుంది.

లగ్జరీ కారుకు ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ తప్పనిసరి, ఎందుకంటే ఇది కారులో ఖరీదైన భాగం, మరియు ఈ కవర్ మిమ్మల్ని అన్ని ఇంజిన్ మరియు గేర్‌ బాక్స్ మరమ్మతుల నుండి రక్షిస్తుంది. అలాగే, లూబ్రికెంట్లు, ఆయిల్స్, నట్స్, బోల్ట్‌లు, స్క్రూలు, వాషర్లు, గ్రీజు మొదలైన వాటి రీప్లేస్మెంట్ ఖర్చును కవర్ చేయడానికి కన్జూమబుల్ కవర్ ను పొందడం మంచిది.

కేస్ 2: మీరు రోజూ డ్రైవ్ చేసే 7 ఏళ్ల కారుని కలిగి ఉంటే - మీకు 7 ఏళ్ల కారు ఉన్నట్లయితే చాలా మంది కారు యజమానులు కార్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యతను విస్మరిస్తారు; అయినప్పటికీ, చట్టపరమైన దృక్కోణం నుండి కనీసం మూడవ పక్ష ఇన్సూరెన్స్ ను కలిగి ఉండటం మ్యాండేటరీ. మీ కారు ఇప్పటికే 7 సంవత్సరాల వయస్సులో ఉన్నందున, ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన సందర్భాల్లో మీ కారు మరమ్మతులు లేదా రీప్లేస్మెంట్ కోసం కవరేజీని పొందడానికి సొంత-డ్యామేజ్ కవర్‌ను కలిగి ఉండటం మంచిది.

అలాగే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ వంటి యాడ్-ఆన్‌లతో కూడిన కాంప్రహెన్సివ్ కవర్‌ను పొందడం వల్ల మీ కారు చెడిపోయినా, టైర్ పగిలినా లేదా టోయింగ్ అవసరమైతే సుదీర్ఘ రహదారి ప్రయాణాల్లో మిమ్మల్ని రక్షిస్తుంది.

కేస్ 3: మీరు మీ తాతగారి కారును భద్రపరిచి ఉంటే, అది అరుదుగా రోడ్లపైకి  తీసుకువస్తే - వ్యక్తులు తరతరాలుగా మీ కుటుంబంలో ఆ కారు వంటి భావోద్వేగ విలువల కోసం మాత్రమే కొన్ని వస్తువులను ఉంచుకుంటారు, ఇది చాలా అరుదుగా నడపబడుతుంది, అయితే చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా కనీసం థర్డ్-పార్టీ కవరేజ్ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ చేయవలసి ఉంటుంది. మీరు ఆ కార్ ను ఎక్కువగా నడపడం లేదు కాబట్టి, మీరు ఇతర యాడ్-ఆన్‌లను కొనుగోలు చేయడాన్ని దాటవేయవచ్చు.

 

సరైన కార్ ఇన్సూరెన్స్ను ఎలా ఎంచుకోవాలి.

మీ కారు కోసం సరైన ఇన్సూరెన్స్​ను ఎలా ఎంచుకోవాలో ఇక్కడ ఉంది.

కొనుగోలు ప్రక్రియ..

ప్రతి ఒక్కరూ సమయం కోసమే చూస్తారు. ఎల్లప్పుడూ గజిబిజిగా లేని కార్​ ఇన్సూరెన్స్​ కోసం ప్రయత్నించండి. తొందరగా పూర్తయ్యే దాని కోసం చూడండి. డిజిట్​ అందించే కార్​ ఇన్సూరెన్స్​ నిమిషాల్లో పూర్తవుతుంది. దీని మొత్తం ప్రక్రియ ఆన్​లైన్​లోనే ఉంటుంది.

సరైన ఐడీవీ

మీ ఐడీవీ (మీ వాహన ప్రస్తుత మార్కెట్​ విలువ) అనేది చాలా ముఖ్యం. కార్​ ఇన్సూరెన్స్​లో ఇది ప్రధానమైన విషయం. ఈ విలువ మీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియంను నేరుగా ప్రభావితం చేస్తుంది. క్లెయిమ్​ సెటిల్​మెంట్​ సమయంలో కూడా ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. డిజిట్​లో మీ ఐడీవీని మీరు ఇష్టం వచ్చిన విధంగా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది.

సర్వీస్ ప్రయోజనాలు

అదనపు ప్రయోజనాలను మనమందరం ఇష్టపడతాం. మీ కార్​ ఇన్సూరెన్స్​ను తీసుకునే సమయంలో ఇది కూడా చాలా ముఖ్యం. కావున ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకునేటపుడు కంపెనీ ఎటువంటి సర్వీసులను అందిస్తుందనేది ఓ సారి చూసుకోవాలి. ఉదా. డిజిట్​లో డోర్​ స్టెప్​ పికప్, డ్రాప్​ సౌలభ్యం ఉంది.

క్లెయిమ్ ప్రక్రియ

కార్​ ఇన్సూరెన్స్​లో క్లెయిములకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఎంచుకునే కార్​ ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ ప్రాసెస్​ చాలా ఈజీగా ఉండేలా చూసుకోండి. అది ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా జాగ్రత్త పడండి. మీరు ఇబ్బందుల్లో ఉన్నపుడు మీ క్లెయిమ్​ తొందరగా రావాలని కోరుకుంటారు కదా.. ఎంతో కష్టపడి క్లెయిమ్​ ఫైల్​ చేసిన తర్వాత అది రిజెక్ట్​ అయితే చాలా సమయం వృథా అవుతుంది.

క్లెయిమ్ సెటిల్మెంట్లు

క్లెయిమ్​ సెటిల్​మెంట్లు అనేవి చాలా ముఖ్యం. మీరు ఒక క్లెయిమ్​ చేసినపుడు అది ఆమోదించబడుతుందా లేదా రిజెక్ట్​ అవుతుందా అనేది క్లెయిమ్​ సెటిల్​మెంట్​ నిష్పత్తిలోనే తెలుస్తుంది. అందుకోసమే మనం పాలసీ తీసుకునే ముందు తప్పనిసరిగా క్లెయిమ్​ సెటిల్​మెంట్​ నిష్పత్తిని సరిగ్గా చూసుకోవాలి.

కస్టమర్ సపోర్ట్

కార్​ ఇన్సూరెన్స్​లో కస్టమర్​ సపోర్ట్​ అనేది చాలా విలువైనది. కాబట్టే 24x7 కస్టమర్​ సపోర్ట్​ అందించే కార్​ ఇన్సూరెన్స్​ కంపెనీనే ఎంచుకోండి.

మీరు తెలుసుకోవాల్సిన కార్ ఇన్సూరెన్స్ పదజాలం

కార్ ఇన్సూరెన్స్లో ఐడీవీ (IDV) అంటే ఏమిటి ?

మీ కారు పూర్తిగా డ్యామేజ్​ అయినపుడు మీరు పొందే పూర్తి ఇన్సూరెన్స్​ విలువను ఐడీవీ అంటారు.

మీ కారు ఐడీవీ విలువ మీ కారు ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మీ ఐడీవీ విలువ పెరిగితే మీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం పెరుగుతుంది. అలా కాకుండా మీ కారు​ ఐడీవీ విలువ కనుక తగ్గితే మీ ఇన్సూరెన్స్​ ప్రీమియం విలువ తగ్గుతుంది. మీ కారుకు వయసు​ పెరిగే కొద్ది డిప్రిషియేషన్​ వలన మీ కారు ఐడీవీ విలువ ఆటోమేటిక్​గా తగ్గుతుంది. తర్వాత మీ ప్రీమియం విలువ కూడా తగ్గుతూ ఉంటుంది.

మీరు మీ కారు​ను అమ్మాలని భావించినపుడు ఎక్కువ ఐడీవీ విలువ అంటే ఎక్కువ మార్కెట్​ ధర. కానీ ఈ ధర కొన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది. వాడకం, పాత కార్​ ఇన్సూరెన్స్​ క్లెయిముల​ అనుభవం వంటి వివిధ కారణాల మీద ఆధారపడుతుంది.

కావున మీరు మీ కారు​ కోసం మంచి ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవాలని అనుకున్నపుడు కేవలం ప్రీమియం మాత్రమే కాకుండా అది అందించే ఐడీవీని కూడా పరిగణనలోకి తీసుకోండి.

తక్కువ ప్రీమియంకు లభించే ఇన్సూరెన్స్​ పాలసీలు ఉంటాయి. కానీ వాటిల్లో మీ కారు ఐడీవీ విలువ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీ కారు పూర్తి డ్యామేజ్​ అయినపుడు ఐడీవీని బట్టే ఇన్సూరెన్స్​ కంపెనీ మీకు నష్టపరిహారం చెల్లిస్తుంది.

ఐడీవీ అనేది మీ కారు మార్కెట్​ విలువని సూచిస్తుంది. మీ కారును మీరు బాగా మెయింటెన్​ చేసి దానిని ఎప్పుడూ శుభ్రపరుస్తూ తళతళా మెరిసేలా ఉంచితే మీ కారు ఐడీవీ అందించే విలువ కన్నా మీరు ఎక్కువగా ధరను పొందే అవకాశం ఉంటుంది.

కార్​ ఇన్సూరెన్స్​లో ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ గురించి మరింతగా తెలుసుకోండి.

కార్ ఇన్సూరెన్స్లో నో క్లెయిమ్ బోనస్ (NCB) అంటే ఏమిటి?

నో క్లెయిమ్​ బోనస్​ (ఎన్​సీబీ NCB) నిర్వచనం– మీరు సంవత్సరం మొత్తంలో ఎటువంటి క్లెయిమ్​ చేయకుండా ఉన్నందుకు పాలసీ రెన్యువల్​ సమయం​లో ఇన్సూరెన్స్​ కంపెనీ మీకు అందించే డిస్కౌంట్​నే ఎన్​సీబీ అంటారు.

మీరు మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ సమయంలో ఎటువంటి క్లెయిములు చేయకుండా ఉంటే పాలసీ పూర్తయ్యే సమయంలో మీకు 20 శాతం నుంచి 50 శాతం వరకు నో క్లెయిమ్​ బోనస్ వస్తుంది.

మీరు మొదటి సారి (నూతన) కార్​ ఇన్సూరెన్స్​ ను కొనుగోలు చేసినపుడు నో క్లెయిమ్​ బోనస్ పొందలేరు. కేవలం రెన్యువల్ సమయంలో మాత్రమే మీకు నో క్లెయిమ్​ బోనస్ లభిస్తుంది. మీరు మీ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యువల్​ చేసే ప్రతి సంవత్సరం క్లెయిములు చేయని సంవత్సరమైతే మీ నో క్లెయిమ్​ బోనస్​ పెరుగుతూ పోతుంది.

మీరు క్లెయిమ్​ చేయకుండా ఉన్న మొదటి సంవత్సరానికి 20 శాతం ఎన్​సీబీని పొందుతారు. ఇది క్లెయిమ్​ చేయని ప్రతి సంవత్సరానికి ఇది పెరుగుకుంటూ పోతుంది. 5 సంవత్సరాలు అయిన తర్వాత అది 50 శాతానికి చేరుతుంది. కానీ మీరు మధ్యలో క్లెయిములు చేస్తే మీ ఎన్​సీబీని కోల్పోతారు.

మీ నో క్లెయిమ్​ బోనస్ అనేది క్లెయిమ్​ చేయకుండా ఉన్న 5వ సంవత్సరానికి 50 శాతానికి చేరుతుంది. తర్వాత మీ ఎన్​సీబీ విలువ పెరగదు. ఇక అక్కడి నుంచి మీ నో క్లెయిమ్​ బోనస్ పెరగదు అలాగే ఉంటుంది. దీనినే నో క్లెయిమ్​ బోనస్ సన్​సెట్​ క్లాజ్​ అని అంటారు.

నో క్లెయిమ్​ బోనస్​ అనే దానికి కారుతో ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి మీరు కారును మార్చినా కూడా నో క్లెయిమ్​ బోనస్ అలాగే ఉంటుంది.

మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని భావిస్తే మీకు కొత్త కార్​ ఇన్సూరెన్స్​ జారీ చేయబడుతుంది. కానీ మీరు ఇప్పటికీ పాత కారు లేదా పాలసీ మీద ఉన్న నో క్లెయిమ్​ బోనస్​ను పొందే అవకాశం ఉంటుంది.

కార్​ ఇన్సూరెన్స్​లో నో క్లెయిమ్​ బోనస్ గురించి మరింత తెలుసుకోండి.

కార్ ఇన్సూరెన్స్లో జీరో డిప్రిషియేషన్ కవర్

బంపర్​ టు బంపర్ లేదా జీరో డిప్రిషియేషన్ కవర్​ లేదా పార్ట్స్​ డిప్రిషియేషన్​ కవర్​ అనేది మీ కారు విలువను తగ్గకుండా చూస్తుంది. ఈ కవర్​ మీరు కారును కొనుగోలు చేసి ఐదు సంవత్సరాల కంటే తక్కువ రోజులు అయితే మాత్రమే వర్తిస్తుంది. మన జీవితంలో ప్రతి విషయం లాగానే కారు భాగాల్లో కూడా వయసు పెరిగే కొద్ది తరుగుదల (డిప్రిషియేషన్​) అనేది ఉంటుంది.

మీరు క్లెయిమ్​ చేసినపుడు రిపేర్​ చేయించిన భాగాల​కు తరుగుదలను తీసేస్తారు. అందువల్ల మీకు రిపేర్​కు అయిన పూర్తి డబ్బులు రావు. కానీ జీరో డిప్రిషియేషన్​ కవర్​ యాడ్​–ఆన్​ ఉండటం వలన మీకు పూర్తిగా క్లెయిమ్​ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ వాహన భాగాల తరుగుదలను భరిస్తుంది.

మీ కారు డ్యామేజ్​ అయితే దాని తరుగుదల కోసం లెక్కించబడిన మొత్తాన్ని మీరు భరించాల్సిన అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ ​కంపెనీయే మొత్తం చూసుకుంటుంది.

మరింత తెలుసుకోండి.

కార్ ఇన్సూరెన్స్లో క్యాష్లెస్ క్లెయిమ్స్ అంటే ఏమిటి?

మీరు డిజిట్​ అధీకృత రిపేర్ సెంటర్​లో మీ కారును రిపేర్​ చేయిస్తే ఆమోదించబడిన క్లెయిమ్​ అమౌంట్​ను మేము నేరుగా రిపేర్​ సెంటర్​కే పంపుతాం. దీనినే క్యాష్​లెస్​ క్లెయిమ్ అంటారు.

మీ పాలసీలో ఏవైనా డిడక్టబుల్స్​ ఉంటే వాటిని మీ జేబు నుంచి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే మీ క్లెయిమ్​ సెటిల్​ అవుతుంది.

క్యాష్​లెస్​ కార్​ ఇన్సూరెన్స్​ గురించి మరింత తెలుసుకోండి.

సరైన కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా ఎంచుకోవాలి?

కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్ను ఉపయోగించి ఆన్లైన్లో ప్రీమియంను లెక్కించండి

మీరు సరైన కార్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడానికి కార్​ ఇన్సూరెన్స్​ క్యాలుక్యులేటర్​ సాయంతో మీ ప్రీమియంను లెక్కించుకోండి. దీని వలన మీరు మంచి కార్​ ఇన్సూరెన్స్​ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ కార్​ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎటువంటి విషయాలు ప్రభావితం చేస్తాయనేది ఇక్కడ తెలుసుకోండి. ఈ కింది కారకాలను బట్టే మీ కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం విలువ మారుతూ ఉంటుంది:

  • కార్ ఇన్సూరెన్స్ పాలసీ రకం - మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అందించే కవరేజ్ మరియు ప్రయోజనాలు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, మీరు థర్డ్-పార్టీ పాలసీ కంటే కాంప్రహెన్సివ్ పాలసీని ఎంచుకుంటే, మీ ప్రీమియం, తరువాతి దాని కంటే చాలా ఎక్కువ కవరేజీని అందిస్తుంది.
  • మీ కార్ ఐడివి (IDV) - ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐడివి) (IDV) అనేది తరుగుదల ఛార్జీలను తీసివేసిన తర్వాత మీ కార్ ప్రస్తుత మార్కెట్ విలువ. మీ ఐడివి (IDV) పెరిగితే, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరుగుతుంది.
  • ఎంచుకోబడ్డ యాడ్-ఆన్‌లు - మీ కీలకమైన ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్స్ తీర్చడానికి మరియు మీ కార్ ను అన్ని పరిస్థితులలో రక్షించుకోవడానికి వివిధ యాడ్-ఆన్ కవర్‌లతో కూడిన అనుకూలీకరించిన ఇన్సూరెన్స్ పాలసీ మీకు అధిక ప్రీమియంను పొందుతుంది.
  • డిడక్టబుల్స్ - కార్ ఇన్సూరెన్స్‌లో మినహాయించదగినది అంటే బీమా సంస్థలు మిగిలిన క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించే ముందు పాలసీదారు వారి జేబు నుండి చెల్లించాల్సిన ముందుగా నిర్ణయించిన మొత్తం. కాబట్టి, మీరు తక్కువ ప్రీమియం కోసం అధిక వాలంటరీ డిడక్టబుల్ ఎంచుకోవచ్చు ఎందుకంటే క్లయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో బీమా సంస్థలు తక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
  • నో క్లయిమ్ బోనస్ - మీరు పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లయిమ్‌ను చేయకపోతే, బీమా సంస్థ నో క్లెయిమ్ బోనస్ రూపంలో మీ తదుపరి పాలసీ రెన్యూవల్ ప్రీమియంపై మీకు తగ్గింపును అందజేస్తుంది.
  • మీ కార్ తయారీ & మోడల్ - మీ కార్ తయారీదారు మరియు మోడల్ ఆధారంగా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మారవచ్చు. విలాసవంతమైన సెడాన్‌కు ఇన్సూరెన్స్ చేయడం ప్రామాణిక హ్యాచ్‌బ్యాక్ కంటే అధిక ప్రీమియాన్ని ఆకర్షిస్తుంది. ఇంకా, కార్ ఇంజిన్ యొక్క క్యూబిక్ కెపాసిటీ మరియు దాని ఇంధన సామర్థ్యం కూడా నేరుగా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.
  • మీ కార్ వయస్సు - మీ కార్ భాగాలు సాధారణ అరిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం దాని విలువ తగ్గుతుంది కాబట్టి, ఐడివి (IDV) కూడా పడిపోతుంది మరియు అందువల్ల పాలసీ ప్రీమియం కూడా తగ్గుతుంది. బ్రాండ్-న్యూ కార్ కు ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువ మరియు పాత కార్ కు తక్కువ అని ఇది సూచిస్తుంది.

మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించుకోవడానికి చిట్కాలు

  • వాలంటరీ డిడక్టబుల్​ను పెంచుకోండి – గడిచిన 4 లేదా 5 సంవత్సరాల నుంచి మీరు ఎటువంటి క్లెయిములు చేయకపోతే, క్లెయిములు​ చేసినా కానీ ఆ సమయంలో మీరు జేబు నుంచి డబ్బులు పెట్టుకుంటామని భావిస్తే వాలంటరీ డిడక్టబుల్స్​ను పెంచుకోవడం ద్వారా మీ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని తగ్గించుకోవచ్చు.
  • మంచి డ్రైవింగ్ రికార్డును కలిగి ఉండండి – ఇది చాలా ముఖ్యం. మంచి డ్రైవింగ్​ రికార్డును కలిగి ఉండటం వలన మీరు భద్రం​గా వెళ్లడమే కాకుండా మీ కారుకు జరిగే ప్రమాదాలను కూడా కవర్​ చేయొచ్చు. మీరు ఎటువంటి క్లెయిములు​ చేయని ప్రతీ సంవత్సరానికి మీకు నో క్లెయిమ్​ బోనస్ వస్తుంది.
  • అవసరమైన యాడ్​–ఆన్స్​నే ఎంచుకోండి – అదనపు కవర్స్​ ఎప్పుడూ మీకు అదనపు ప్రయోజనాలకు కలిగిస్తాయి. అడిషనల్​ కవర్స్​ను మీరు ఎంచుకునే ముందే అవసరమైన వాటినే ఎంచుకోవాలి. అన్ని రకాల యాడ్​-ఆన్స్​ను ఎంచుకోకండి. మీకు మీ కారుకు అవసరమనిపించే యాడ్​–ఆన్స్​ను మాత్రమే ఎంచుకోండి.

కార్​ ఇన్సూరెన్స్​ ప్రీమియాన్ని ఎలా లెక్కించాలో మరింత తెలుసుకోండి.

ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ కోట్స్ను పోల్చి చూడండి

మీ కార్​ ఇన్సూరెన్స్​ కంపెనీ మీకు కింది విషయాల గురించి సరైన సమాచారాన్నే ఇస్తోందా అనే విషయం నిర్ధారించుకోండి.

  • మీ ఐడీవీ (IDV) ని చెక్​ చేసుకోండి  – మార్కెట్​లో తక్కువ మొత్తం ఉన్న కార్​ ఇన్సూరెన్స్​ పాలసీలు అనేకం ఉన్నాయి. ఇవి మీ ఐడీవీ (ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ – మీ వాహనం ప్రస్తుత మార్కెట్​ విలువ)ని తక్కువ చేసి తక్కువ ప్రీమియంతో మీకు పాలసీని అందిస్తాయి. మీరు ఏదైనా సమయంలో క్లెయిమ్​ చేసినా కానీ మీకు తక్కువగానే డబ్బులు వస్తాయి. అది చూసి మీరు షాక్​కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కావున ముందే మీ కారు ఐడీవీని సరిగా సెట్​ చేసుకోండి. అప్పుడు మీరు క్లెయిమ్​ చేసే సమయంలో ఎటువంటి షాక్​ కు గురికాకుండా ఉంటారు. ఆన్​లైన్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీలో మీ కారు ఐడీవీని సెట్​ చేసుకునే సౌలభ్యం ఉంటుంది.
  • సర్వీస్​ ప్రయోజనాలను సరిచూసుకోండి– మీకు సరైన సర్వీసు అందించే కంపెనీలో ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకోండి. డిజిట్​ కంపెనీ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు​ అందించడంలో ముందు వరుసలో ఉంటుంది. డోర్​ స్టెప్​ పికప్, డ్రాప్​, ఆరు నెలల సర్వీస్​ వారంటీ, 24*7 కస్టమర్​ కేర్​ సపోర్ట్​, 5,800 కంటే ఎక్కువ క్యాష్​లెస్​ గ్యారేజీలు తదితర మరెన్నో సేవలు డిజిట్​ అందిస్తుంది.
  • ఇన్సూరెన్స్​ కంపెనీ క్లెయిమ్​ వేగాన్ని తనిఖీ చేయండి  – మీరు కంపెనీ మారే ముందు ఆ కంపెనీలో క్లెయిములు ఎంత త్వరగా సెటిల్​ చేయబడతాయనే విషయాన్ని తనిఖీ చేయండి. డిజిట్​లో 90.4 శాతం క్లెయిములు​ కేవలం 30 రోజుల్లోపే సెటిల్​ చేయబడ్డాయి. మా క్లెయిములు​ చాలా వేగం​గా, సులభంగా ఉంటాయని ఇది చూస్తేనే అర్థం అవుతుంది. అంతేకాకుండా మావద్ద క్లెయిముల కొరకు ఎటువంటి హార్డ్​ కాపీలు కూడా అవసరం లేదు. అంటే మేము క్లెయిముల కొరకు ఎటువంటి హార్డ్​ కాపీలను అడగం. కేవలం సాఫ్ట్​ కాపీలతోనే మేము క్లెయిములను సెటిల్​ చేస్తాం.
  • ఉత్తమ విలువ – ఇన్సూరెన్స్​ కంపెనీ అందించే సర్వీసు, ఐడీవీతో మీరు సంతృప్తిగా ఉంటే అనంతరం ప్రీమియం విలువను చెక్​ చేయండి. మీకు అందే డిస్కౌంట్లను సరిపోల్చుకోండి.

కార్​ ఇన్సూరెన్స్​​ను పోల్చుకోవడం  ఎలాగో మరింత తెలుసుకోండి.

కార్ ఇన్సూరెన్స్ కోట్స్ను పోల్చేటప్పుడు విస్మరించాల్సిన సాధారణ తప్పులు

మీరు కార్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసే ముందు వివిధ రకాల పాలసీలను పోల్చి చూడటం చాలా ముఖ్యం. కానీ మీరు కార్​ ఇన్సూరెన్స్​ను పోల్చేటపుడు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి. ప్రజలు సాధారణంగా వారి కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యువల్​ చేసేటపుడు చూసే విషయాలు..

  • తక్కువ ప్రీమియం

మీ కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యువల్​ చేసేటపుడు మీరు ఏమి గమనించాలంటే?

  • సరైన ఐడీవీ
  • మంచి సర్వీసులు

అతి తక్కువ ధరలు

కార్ ఇన్సూరెన్స్ పాలసీని డిజిట్తో ఎందుకు రెన్యువల్ చేసుకోవాలి?

కార్ ఇన్సూరెన్స్ రెన్యువల్ కోసం డిజిట్ను ఎందుకు ఎంచుకోవాలి?

ఇంతకుముందు మీ పాత కార్​ ఇన్సూరెన్స్​ను డిజిట్​తో చేశారా? లేదా అనేది పట్టించుకోకుండా కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ సమయంలో మీరు డిజిట్​ను ఎంచుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయి. డిజిట్​లో కార్​ ఇన్సూరెన్స్​ రెన్యువల్​ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రతీదీ ఆన్​లైన్​లో ఉంటుంది.

మీరు మాతో కలిసి మొదటి సారి కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యువల్​ చేస్తుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో కింద ఉంది.

  • క్విక్ క్లెయిమ్స్ ​– ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసేటపుడు ఆలోచించేది క్లెయిమ్స్​ గురించే. మనకు అవసరమైన సమయం​లో క్లెయిములు​ ఈజీగా పూర్తవుతాయా? లేదా? అని చూస్తారు. మా వద్ద మీరు క్లెయిమ్​ చేసే దగ్గరి నుంచి అది ప్రాసెస్​ చేయడం, ఆమోదించడం వరకు అన్నీ ఆన్​లైన్​లోనే జరుగుతాయి.
  • క్యాష్​లెస్​ కార్​ రిపేర్లు​  – మీ కారుకు మరమ్మతులు చేయించేటపుడు మీరు మీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మేము క్యాష్​లెస్​ ఇన్సూరెన్స్​ ను ప్రవేశపెట్టాం. ఈ పద్ధతిలో మీరు మీ వాహనాన్ని కేవలం మా నెట్​వర్క్​ గ్యారేజీలో వదిలిపెడితే సరిపోతుంది. మిగతాదంతా అక్కడున్న వాళ్లే చూసుకుంటారు.
  • పెద్ద సంఖ్యలో గ్యారేజీల నెట్​వర్క్  – క్యాష్​లెస్​ క్లెయిములు అనేవి కేవలం మా నెట్​వర్క్​ గ్యారేజీలలో మాత్రమే లభిస్తాయి. కానీ మాకు భారతదేశ వ్యాప్తంగా 6000+ కంటే ఎక్కువ నెట్​వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి. వీటిల్లో నుంచి క్యాష్​లెస్​ క్లెయిముల కొరకు మీరు దేనినైనా సరే ఎంచుకోవచ్చు.
  • 24x7 సపోర్ట్  – మీరు ఏ రోజు లేదా ఏ సమయంలో కాల్​ చేశారనే విషయం గురించి పట్టించుకోకుండా మీకు సర్వీస్​ అందించేందుకు మేము 24 గంటలు అందుబాటులోనే ఉంటాం.
  • మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్​ చేసుకోండి – మీ ఐడీవీని తక్కువ చేసి తక్కువ ప్రీమియం అని చెబితే మీరు నమ్మకండి. ఎందుకంటే మీరు ఏదైనా సందర్భంలో క్లెయిమ్​ చేసినా కానీ మీకు తక్కువ మొత్తంలోనే పరిహారం వస్తుంది. కావున డిజిట్​ మీ నమ్మకాన్ని వమ్ము చేయదు. ఇక్కడ మీ ఐడీవీని మీరే ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. మీకు నచ్చిన విధంగా వాహన ఐడీవీని ఎంచుకోండి.

డిజిట్ ద్వారా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు/ రెన్యువల్ చేయాలి?

  • స్టెప్​ 1:  మీ వాహన మోడల్​, తయారీ, వేరియంట్​, రిజిస్ట్రేషన్ తేదీ, మీరు వాహనాన్ని వాడుతున్న నగరం పేరును నింపి ‘గెట్​ కోట్​’ ఆప్షన్​ మీద క్లిక్​ చేసి మీకు నచ్చిన ప్లాన్​ను ఎంచుకుంటే సరిపోతుంది.
  • స్టెప్​ 2: థర్డ్​ పార్టీ లయబిలిటీ ప్లాన్​ కానీ, స్టాండర్డ్​ ప్లాన్​ కానీ (కాంప్రహెన్సివ్​ ఇన్సూరెన్స్​) ఎంచుకోండి. 
  • స్టెప్ 3: మీ పాత ఇన్సూరెన్స్​ పాలసీని గురించిన వివరాలను మాకు ఇవ్వండి. గడువు ముగిసిన తేదీ, చివరి సంవత్సరంలో చేసిన క్లెయిముల​ వివరాలు, మీరు పొందిన నో క్లెయిమ్​ బోనస్​ గురించిన వివరాలు సమర్పించాలి.
  • స్టెప్​ 4: మీరు ప్లాన్​ను ఎంచుకుని ఐడీవీ ఎంచుకున్న తర్వాత మీకు నచ్చిన యాడ్​-ఆన్స్​ను ఎంచుకోవడం, మీ కారు సీఎన్​జీ (CNG) కారా అనే వివరాలు పూర్తి చేసిన తర్వాత తదుపరి పేజీలో మీకు ప్రీమియం వివరాలు కనిపిస్తాయి.
  • స్టెప్​ 5: మీరు పేమెంట్​ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీ పాలసీ వివరాలు మీ ఈమెయిల్​కు పంపబడతాయి.

కార్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు

భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి?

కార్​ ఇన్సూరెన్స్​ వంటి విషయాలను ప్రజలు అప్పుడప్పుడు మరిచిపోతారు. కానీ అది చాలా అవసరం. కార్​ ఇన్సూరెన్స్​ లేకుండా బయటకి వెళ్లడం చట్టబద్ధంగా మంచిది కాదు.

మనలాంటి వారి సంరక్షణ కోసమే కార్​ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఉదాహరణకు: చట్టప్రకారం కనీసం థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ తప్పనిసరి కాకపోతే ఎవరు కూడా ఇన్సూరెన్స్​ అనేది తీసుకోరు. అనుకోని సందర్భంలో ప్రమాదం జరిగి ఇరుపక్షాలు వాదులాడుకోవడానికే సమయం సరిపోతుంది. ఖర్చులు తడిసి మోపెడవుతాయి.

అందుకోసమే కార్​ ఇన్సూరెన్స్​ ప్రధాన లక్ష్యం గాయపడిన థర్డ్​ పార్టీ వ్యక్తులను కాపాడటం. భారతదేశంలో కార్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు తప్పనిసరి చేశారో ఇక్కడ ఉంది.

  • పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు: మోటార్​ వాహన చట్టంలో ఇన్సూరెన్స్​ అనేది తప్పనిసరి చేయడానికి గల ప్రధాన కారణం... రోడ్డు ప్రమాదాలు. 2017 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి రోజు 1,200 మందికి పైగా గాయాలపాలయ్యారు. కార్​ ఇన్సూరెన్స్​ ఉంటే ఎవరూ కూడా వైద్య ఖర్చులను ఆర్థిక భారాన్ని భరించాల్సిన అవసరం ఉండదు.
  • థర్డ్​ పార్టీ వ్యక్తులను కాపాడేందుకు: మీ వాహనం ఎవరి వాహనాన్నైనా ఢీ కొట్టినా లేదా వేరే వాహనం వచ్చి మీ కారును ఢీ కొట్టినా కనీసం థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ ఉండటం వలన మీకు ఆర్థికంగా నష్టం కలగకుండా ఉంటుంది. థర్డ్​ పార్టీ వ్యక్తులు, లేదా ఆస్తులకు జరిగిన నష్టాన్ని థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ కవర్ చేస్తుంది.
  • న్యాయపరమైన చిక్కులు తొలగించేందుకు: మీరు ఒకసారి ప్రమాదం చేస్తే అందులో అయ్యే గాయాలను మినహాయిస్తే... లీగల్​ విషయాలకు మీ విలువైన సమయం చాలా వృథా అవుతుంది. ఇటువంటి లీగల్​ విషయాల నుంచి మిమ్మల్ని సంరక్షించేందుకు ఇన్సూరెన్స్​ తప్పనిసరి.

భారతదేశంలో కార్​ ఇన్సూరెన్స్​ ఎందుకు తప్పనిసరి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనడం ఎందుకు మంచిది?

మీరు మీ కరెంటు బిల్లును కట్టేందుకు చివరిసారిగా ఎప్పుడు కరెంట్​ ఆఫీసుకి వెళ్లారు? మీ మొబైల్​ రీచార్జి చేసుకునేందుకు ఎప్పుడు చివరిసారిగా కిరాణా షాప్​కు వెళ్లారు? చాలా రోజులయింది కదా? అలాగే ఇన్సూరెన్స్​ కూడా ఆన్​లైన్​లోనే మీకు అందుబాటులో ఉంది.

ఇక్కడ మనం ఇంటర్నెట్​కు ధన్యవాదాలు తెలపాలి. ప్రస్తుత రోజుల్లో మనం అనేక పనులను ఇంటర్నెట్​ ఉపయోగించే చేస్తున్నాం. బిల్​ పే, రీచార్జ్​, కిరాణా సామాను ఆర్డర్ చేయడం మొదలగునవి. టెక్నాలజీ అనేది రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్రస్తుత రోజుల్లో మీరు ఇన్సూరెన్స్​ పొందేందుకు మా ఏజెంట్​ను సంప్రదించాల్సిన అవసరం లేదు. ఇన్సూరెన్స్ డీలర్ల​ను సంప్రదించాల్సిన అవసరం లేదు.

ప్రస్తుత రోజుల్లో మీ కార్​ ఇన్సూరెన్స్​ను చాలా సులభంగా ఆన్​లైన్​లో కొనుగోలు చేయొచ్చు. 😊 ఇందుకోసం మీకు ఎటువంటి పత్రాలు కూడా అవసరం ఉండదు. మీ కార్​ వివరాలు, డెబిట్​ లేదా క్రెడిట్​ కార్డ్​ వివరాలు ఉంటే మీ ప్రీమియాన్ని కట్టేయచ్చు. తర్వాత కొద్ది నిమిషాల్లోపే మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ వివరాలు మీకు ఈమెయిల్​ చేయబడతాయి.

  • కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని ఆన్​లైన్​లో కొనుగోలు చేయడం వలన మీ సమయం ఎంతో ఆదా అవుతుంది. పాలసీ చేయడం కోసం ఇతరులను కలిసేందుకు మీరు సమయం వృథా చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఐదంటే ఐదే నిమిషాల సమయంలో మీరు ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేయొచ్చు.
  • డిజిట్​లో ఆన్​లైన్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని కొనుగోలు చేయడం వలన మీ వాహన ఐడీవీని మీకు నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దీని వలన చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.
  • మూడో వ్యక్తి సాయంతో కార్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసే బదులు ఆన్​లైన్​లో మీరు ఎవరి సాయం లేకుండా ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన ఇన్సూరెన్స్​ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది.
  • ఆన్​లైన్​లో కార్​ ఇన్సూరెన్స్​ కొనుగోలు చేయడంలో మంచి విషయం ఏమిటంటే.. ఇక్కడ ఎటువంటి పేపర్ వర్క్​ అవసరం ఉండదు.

ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కార్ ఇన్సూరెన్స్ను కొనుగోలు/ రిన్యూ చేయండి

మీరు సరికొత్త కారు​ తీసుకున్నా లేక సెకండ్​ హ్యాండ్​ కారు తీసుకున్నా కానీ దేనికైనా సరే ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయొచ్చు.

మీరు సెకండ్​ హ్యాండ్​ కారును కొనుగోలు చేస్తే ఆ కారు యజమాని అప్పటికే ఇన్సూరెన్స్​ను కలిగి ఉన్నాడో లేదో నిర్ధారించుకోండి. అతడు ఇన్సూరెన్స్​ను కలిగి ఉంటే కారు కొన్న 14 రోజుల్లోపు ఆ ఇన్సూరెన్స్​ను మీ పేరు మీదకు మార్చుకుంటే సరిపోతుంది. సెకండ్​ హ్యాండ్​ కార్​ ఇన్సూరెన్స్​ విషయంలో కింది విషయాలను గమనించండి.

  • కారును కొన్న 14 రోజుల్లోపు కారు, ఇన్సూరెన్స్​ రెండూ మీ పేరు మీదకు బదిలీ అయ్యాయో లేదో సరిచూసుకోవాలి.
  • ఆ కారు క్లెయిమ్​ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ కారు ఇన్సూరెన్స్​ కంపెనీలో పాలసీ నెంబర్​ను ఇస్తే ఆ కారు క్లెయిమ్​ హిస్టరీ మొత్తం చెప్పేస్తారు.
  • మీ కారుకు అంతకు మునుపే కార్​ ఇన్సూరెన్స్​ ఉంటే మీ నో క్లెయిమ్​ బోనస్​ను కొత్త కార్​ ఇన్సూరెన్స్​ పాలసీకి మార్చుకోవడం మర్చిపోవద్దు.
  • ఒకవేళ పాత యజమాని కారుకు ఇన్సూరెన్స్​ చేయించకున్నా లేదా ఇన్సూరెన్స్​ గడువు ముగిసిపోయినా కానీ మీరు చిటికెలో మా కంపెనీ వెబ్​సైట్​లో ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయొచ్చు. ఇన్సూరెన్స్​ కొనుగోలు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మీరు మీ సెకండ్​ హ్యాండ్​ కార్​ ఇన్సూరెన్స్​ను విజయవంతంగా మీ పేరు మీదికి బదిలీ చేసుకుంటే దాని గడువు తేదీని చూసుకోవడం చాలా అవసరం. గడువు తీరకముందే ఇన్సూరెన్స్​ను రెన్యువల్​ చేయించడం వలన ఎన్నో ప్రయోజనాలుంటాయి.

సెకండ్​ హ్యాండ్​ కార్​ ఇన్సూరెన్స్​ గురించి మరింత తెలుసుకోండి.

మీ పాత కారు కోసం కార్ ఇన్సూరెన్స్ను కొనుగోలు/ రెన్యువల్ చేయండి

మీరు పాత లేదా సెకండ్​ హ్యాండ్​ కారును కొనుగోలు చేసినా లేదా ఇప్పటి వరకు మీ కారు కోసం ఇన్సూరెన్స్ తీసుకోకున్నా మీరు మా వెబ్​సైట్​ను సందర్శించి ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు.

మీ పాత కారుకు ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్​ కొనుగోలు చేసేటపుడు ఈ కింది మూడు విషయాలను జాగ్రత్తగా గమనించండి.

  • కార్​ యూజ్​, ఇన్సూరెన్స్​ రకం – మనకు రెండు రకాల కార్​ ఇన్సూరెన్స్​లు అందుబాటులో ఉన్నాయి. 1) థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​, 2) కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​. ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు మీరు కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ను ఎంచుకోవడమే మంచిది. మీరు కారు​ను ఎక్కువగా వాడకపోయినా లేదా త్వరలోనే కారును అమ్మేయాలని చూస్తున్నా కానీ, థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ చేయించుకోవచ్చు. పై సందర్భాల్లో మీరు థర్డ్​ పార్టీ ఇన్సూరెన్స్​ తీసుకోవడం వలన అది మిమ్మల్ని చట్టబద్ధంగా రక్షిస్తుంది.
  • ఐడీవీ (IDV) – ఐడీవీ ఇన్సూర్డ్​ డిక్లేర్డ్​ వాల్యూ (మీ వాహనం ప్రస్తుత మార్కెట్​ విలువ) మీ కారు పాతదైతే ఐడీవీ తక్కువగా ఉంటుంది. (మీరు మా వెబ్​సైట్​లో కార్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేసేటపుడు ఐడీవీని మీకు నచ్చిన విధంగా ఎంచుకోవచ్చు.) కాలక్రమేణా తరుగుదల (డిప్రిషియేషన్​) వలన మీ కారు విలువ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఐడీవీ అనేది మీ ప్రీమియం ధరను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ ఐడీవీ ఎంచుకుంటే మీరు ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుంది. తక్కువ ఐడీవీ ఎంచుకుంటే మీరు క్లెయిమ్​ చేసినపుడు తక్కువ మొత్తాన్ని పొందుతారు.
  • యాడ్​–ఆన్స్​ – మీ పాత కారు కోసం ఆన్​లైన్​లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నపుడు మీరు ఎంచుకోగలిగిన యాడ్​–ఆన్స్​ కొన్ని మాత్రమే. యాడ్​–ఆన్స్​ అనేవి మీకు కేవలం కాంప్రహెన్సివ్​ పాలసీ లేదా స్టాండర్డ్​ కార్​ ఇన్సూరెన్స్ పాలసీలోనే అందుబాటులో ఉంటాయి. ఈ యాడ్​–ఆన్స్​ వలన మీ కారును అధికంగా రక్షించేందుకు సాధ్యపడుతుంది. టైర్​ ప్రొటెక్షన్​, గేర్​ బాక్స్​, ఇంజన్​ ప్రొటెక్షన్​, రిటర్న్​ టు ఇన్​వాయిస్​ కవర్ మొదలైన యాడ్​–ఆన్స్​ మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మీ పాత కారు కోసం ఇన్సూరెన్స్​ తీసుకోవాలని చూస్తే ఏ యాడ్​–ఆన్స్​ మీ కారుకు అందుబాటులో ఉన్నాయో చూసుకోవాలి. ఉదాహరణకు మీ కారు 5 సంవత్సరాల కంటే పాతది అయితే జీరో డిప్రిషియేషన్ కవర్​ లేదా బంపర్​ టు బంపర్ కవర్​ పని చేయవు.

ఆన్​లైన్​లో ఓల్డ్​ కార్​ ఇన్సూరెన్స్​ గురించి మరింత తెలుసుకోండి.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/ రెన్యువల్ చేయండి

కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని సరైన సమయంలో రెన్యువల్​ చేయడం ఎందుకు అవసరం?

  • మీరు మీ ఎన్​సీబీ (NCB ) కోల్పోతారు – మీరు క్లెయిమ్​ చేయని ప్రతీ సంవత్సరానికి మీకు ఇన్సూరెన్స్​ కంపెనీ నో క్లెయిమ్​ బోనస్​ను అందిస్తుంది. దీనినే ఎన్​సీబీ (NCB) అంటారు. ఈ ఎన్​సీబీ మీకు ఎంత ఎక్కువగా ఉంటే పాలసీ రెన్యువల్​ సమయంలో మీరు అంత ఎక్కువ రాయితీని పొందుతారు. అలాగే, మీరు మీ పాలసీని గడువు ముగియక ముందే పునరుద్ధరించడం చాలా అవసరం. లేకపోతే మీరు మీ ఎన్​సీబీని కోల్పోతారు. తద్వారా రాయితీని కూడా మిస్​ అవుతారు.
  • జరిమానా కట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది – మీరు సరైన సమయంలో కార్​ ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యువల్​ చేయకపోతే మీరు అధిక మొత్తంలో ట్రాఫిక్​ జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. మీ పాత పాలసీ చెల్లదు కాబట్టి మీ వాహనానికి ప్రమాదం జరిగినా పాత కంపెనీ ఎటువంటి సాయం చేయదు.
  • ఆర్థిక భారం అధికంగా ఉంటుంది – ట్రాఫిక్​ జరిమానాలు, నో క్లెయిమ్​ బోనస్ (NCB) కోల్పోవడం మాత్రమే కాకుండా మీరు అనేక రకాలుగా ఆర్థికంగా నష్టపోతారు. ప్రమాదం జరిగినా కూడా ఎటువంటి క్లెయిమ్​ చేసేందుకు మీకు వీలుండదు. కావున గడువు లోపే మీ కారు ఇన్సూరెన్స్​ పాలసీని రెన్యువల్​ చేసుకోవడం చాలా మంచిది.

ఆన్​లైన్​లో గడువు ముగిసిన కార్​ ఇన్సూరెన్స్​ తీసుకోవడం గురించి మరింత తెలుసుకోండి.

ఆన్లైన్లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

నేను నా కారు కోసం స్టాండలోన్ ఓన్ డ్యామేజ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయొచ్చా?

మీకు ఇప్పటికే మాతో లేదా మరో బీమా కంపెనీతో థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​ ఉన్నా మీరు ఓన్​ డ్యామేజ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ తీసుకొని మీ సొంత కారును కూడా డ్యామేజీల నుంచి సంరక్షించుకోవచ్చు.

డిజిట్తో కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయడం ఎలా?

మీ ప్రస్తుత కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ త్వరలో ఎక్స్​పైరీ కాబోతున్నట్లైతే లేదా ఇప్పటికే ఎక్స్​పైరీ అయితే (మేము అలా కోరుకోవడం లేదండి) ఈ కింది స్టెప్స్​ను అనుసరించి సలుభంగా మీరు రిన్యూ చేసుకోవచ్చు. 

స్టెప్​ 1: www.godigit.com ను సందర్శించండి

స్టెప్​ 2: మీ కారు బ్రాండ్​, కారు వేరియంట్​, రిజిస్ట్రేషన్​ తేదీ తదితర వివరాలను నమోదు చేసి, కోట్​ పొందుపై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3: ఆ తర్వాత మీరు మీ ప్రస్తుత లేదీ పాత పాలసీ ఎక్స్​పైరీ తేదీ, మీ నో క్లెయిమ్​ బోనస్​ని నమోదు చేయమని అడగబడుతారు (ఏమైనా ఉంటే)

స్టెప్​ 4: మీకు ఇష్టమైన కార్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ (థర్డ్​ పార్టీ కార్​ ఇన్సూరెన్స్​/కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​)ను ఎంచుకోండి, దానిని యాడ్​–ఆన్లతో మరింత కస్టమైజ్​ చేసుకోండి (మీరు కావాలని అనుకుంటే) 

స్టెప్​ 5: మీ పేమెంట్​ను పూర్తి చేయండి, మీ పాలసీ మీకు ఆన్​లైన్​లో పంపబడుతుంది!

కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్లలో మంచి కార్ ఇన్సూరెన్స్ ఏది?

కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ కవర్​నే తీసుకోవాలని సూచించబడుతుంది. ఎందుకంటే ఇది ఎవరిదో కారుకే కాకుండా మీ కారుకు అయ్యే సొంత డ్యామేజీలు, యజమాని, డ్రైవర్​కు అయ్యే గాయాలకు సమగ్ర సంరక్షణను అందిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్లో ప్రయాణికులు కవర్ అవుతారా?

ఒక కాంప్రహెన్సివ్​ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీలో, సాధారణంగా వ్యక్తిగత ప్రమాద సమయంలో యజమాని, డ్రైవర్​ కవర్​ చేయబడుతారు. అయితే, అన్ని బీమా కంపెనీలు ప్యాసింజర్​ కవర్​ యాడ్​–ఆన్​ను కూడా అందిస్తున్నాయి. మీ కారులోని ప్యాసింజర్ల కోసం మీరు దానిని కాస్త ఎక్కువ ప్రీమియం చెల్లించి కొనుగోలు చేయమచ్చు.

నేను మీతో కలిసి ఇన్సూరెన్స్ను రెన్యువల్ చేయాలనుకుంటే నా నో క్లెయిమ్ బోనస్ కూడా మైగ్రేట్ అవుతుందా?

కచ్చితంగా, మరొక బీమా కంపెనీతో మీ గత చరిత్ర ఆధారంగా డిజిట్​ మీకు ఎన్​సీబీ (NCB) డిస్కౌంట్లను అందిస్తుంది. ఇంకేం, వచ్చేయండి!

రిపేర్ల కోసం నేను నాకు ఇష్టం వచ్చిన గ్యారేజీని ఎంచుకోవచ్చా?

అవును, మీరు చేయగలరు! మీరు నెట్​వర్క్​ గ్యారేజీకి దగ్గర్లో లేని పరిస్థితులు ఎదురు కాగలవని లేదా మీ కార్​ లేదా బైకును మరో గ్యారేజీలో రిపేర్​ చేయించాలని అనుకుంటారని మేము అర్థం చేసుకున్నాం. ఈ సందర్భంలో, మీ రిపేర్లకు అయిన ఖర్చులను మేము ఇన్​వాయిస్​ల పొందిన వెంటనే రీఎంబర్స్​ చేస్తాం.

అదనంగా, మా కస్టమర్​ కేర్​ టీమ్​ను సంప్రదించి మా నెట్​వర్క్​ గ్యారేజీల వివరాలు తెలుసుకోవచ్చు. కావాలంటే మేము పికప్​ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాము. 

నా పాలసీని రెన్యువల్ చేసేటపుడు నేను ఏమేం పరిగణనలోకి తీసుకోవాలి?

ఏదైనా పాలసీ కొనుగోలు చేసేముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: 

  • క్లెయిమ్​ సెటిల్​మెంట్​ వేగం- మీ డబ్బు కోసం మీరు ఎదురు చూడాలని అనుకోరు కదా?
  • సంప్రదించగలగడం- మరలా, కస్టమర్​ కేర్​తో మాట్లాడాలంటే గంటల కొద్దీ ఎదురు చూడాలల్సిన పని లేదు!
  • మీ కార్​ రిపేర్ల కోసం క్యాష్​లెస్​ ఆప్షన్​ నెట్​వర్క్​ కనెక్టివిటీ- మీ ఫోన్​ కాదు, సర్వీస్​ సెంటర్​ నెట్​వర్క్​.
  • కంపెనీ యొక్క క్లెయిమ్​ సెటిల్​మెంట్​ చరిత్ర.

నా కారుకు ప్రమాదం జరిగినపుడు నేను ఏం చేయాలి?

వెంటనే మీరు 1800–103–4448 నెంబర్​పై మాకు కాల్​ చేయాలి! అక్కడినుంచి మేము మీకు సాయం చేస్తాం.

డిజిట్ కంపెనీకి ఎన్ని నెట్వర్క్ గ్యారేజీలు ఉన్నాయి?

మాకు దేశవ్యాప్తంగా 6000+ కు పైగా నెట్​వర్క్​ గ్యారేజీలు ఉన్నాయి!

నేను కార్ ఇన్సూరెన్స్ను వేరే కంపెనీకి బదిలీ చేసుకుంటే నా ఎన్సీబీ (NCB) బదిలీ అవుతుందా?

కచ్చితంగా, మీ ఎన్​సీబీ (NCB)ని మీరు మీ పాత బీమా కంపెనీ నుంచి బదిలీ చేసుకోవచ్చు. మేము ఎప్పుడూ మీకు అదనపు డిస్కౌంట్లను ఇస్తాం. ఎందుకంటే బాగా డ్రైవింగ్​ చేసేవాళ్లకు రివార్డు ఇవ్వాల్సిందేగా!

నేను పాలసీ కొనుగోలు చేయాలన్నా లేదా పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి పాలసీని మార్చుకోవాలన్నా ఏమైనా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందా?

లేదు, మేము జీరో పేపర్​వర్క్​ పాలసీని నమ్ముతాం. కాబట్టి మీరు మాతో పాలసీని రెన్యువల్​ చేసుకొనే సమయంలో, మేము ఎలాంటి పేపర్​వర్క్​ కోసం అడగము!

కార్ ఇన్సూరెన్స్లో ఇంజన్ కవర్ అవుతుందా?

సాధారణంగా స్టాండర్డ్​ ప్యాకేజీ పాలసీలో ఇంజిన్​ కవర్​ కాదు. అయితే, చాలా కంపెనీలు కొంత మొత్తం ప్రీమియం అదనంగా చెల్లిస్తే ఇంజిన్​ను కవర్​ చేసేలా ఒక యాడ్​–ఆన్​ను అందిస్తున్నాయి.

ఇంజిన్​, గేర్​ ప్రొటెక్షన్​ యాడ్​–ఆన్​ ఏదైనా అనుకోని దురదృష్టకర సంఘటనల్లో ఇంజిన్​, గేర్​ బాక్స్​ వంటి వాటికి అయ్యే డ్యామేజీలను కవర్​ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ కింద టైర్ కవర్ అవుతుందా?

సాధారణంగా స్టాండర్డ్​ ప్యాకేజీ పాలసీలో టైర్​ కవర్​ అవ్వదు. అయితే, చాలా కంపెనీలు కొంత మొత్తం ప్రీమియం అదనంగా చెల్లిస్తే టైర్​ను కవర్​ చేసేలా టైర్​ ప్రొటెక్ట్​ యాడ్​–ఆన్​ను అందిస్తున్నాయి.

విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

ప్రమాదం వలన అగ్నిప్రమాదం సంభవిస్తే, అది మీ కాంప్రహెన్సివ్​ కార్​ పాలసీ కింద కవర్​ అవుతుంది.

క్యాష్లెస్ కార్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ ఇన్సూరెన్స్ అందించే ప్రయోజనం, ఇక్కడ ఇన్సూరెన్స్​ కంపెనీ అధీకృత గ్యారేజీల్లో రిపేర్లు జరిగితే మీ కారును రిపేర్ చేయడానికి మీరు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు.

డిజిట్​ వద్ద, మాకు దేశవ్యాప్తంగా 6000+ గ్యారేజీలు ఉన్నాయి. అంతేగాకుండా మేము 6 నెలల రిపేర్​ వారంటీతో కూడిన పికప్, రిపేర్, డ్రాప్ సేవలను కూడా అందిస్తాము.

కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి ఎటువంటి అర్హత ఉండాలి?

మీరు సరైన డ్రైవింగ్ లైసెన్స్‌తో కూడిన కారుని కలిగి ఉన్నంత కాలం, మీ కారుకు కార్​ ఇన్సూరెన్స్​ను పొందడానికి అర్హులు (నిజానికి, ఇది చట్టం ప్రకారం తప్పనిసరి కూడా).

భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ తప్పనిసరా?

అవును, మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం కనీసం థర్డ్-పార్టీ నష్టాలను కవర్ చేసే కార్​ ఇన్సూరెన్స్​ అయినా కలిగి ఉండటం తప్పనిసరి.

నేను నా కారులో ఎటువంటి పత్రాలను ఉంచుకోవాలి?

మీరు ఎల్లప్పుడూ మీ డ్రైవింగ్​ లైసెన్స్​తో పాటు మీ కారు యొక్క రిజిస్ట్రేషన్​ సర్టిఫికెట్​ (RC)ని కలిగి ఉండటం తప్పనిసరి.

భారతదేశంలో ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ను నేను ఎలా ఎంచుకోవాలి?

  • మీరు మొదటిసారిగా కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేస్తుంటే, వారు మీకు ఎంత ఐడీవీ (IDV) ఇస్తున్నారు, వారు అందిస్తున్న యాడ్-ఆన్‌లు ఏమిటి, క్లెయిమ్‌ల సమయంలో వారి సర్వీస్ ఎలా ఉంది మొదలైన వాటి ఆధారంగా వివిధ కార్ ఇన్సూరెన్స్‌ల గురించి పరిశోధించండి.
  • మీరు మీ కారు ఇన్సూరెన్స్​ను రెన్యువల్​ చేస్తూంటే, మీరు బెస్ట్​ డీల్​ను పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి ఇతర కంపెనీల నుండి ధరలను తనిఖీ చేయండి.
  • మీ కారు కోసం మీకు ఎంత ఐడీవీ (IDV) అందిస్తున్నారో చూడండి, మీ కవరేజీని తెలుసుకోండి.
  • సరైన డిడక్టిబుల్​ను సెట్ చేయండి. తప్పనిసరి, స్వచ్ఛంద మినహాయింపు కోసం తనిఖీ చేయండి. స్వచ్ఛంద మినహాయింపు మీ ప్రీమియంను తగ్గిస్తుంది, కానీ ప్రమాదం జరిగినప్పుడు మీరు జేబులో నుంచి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. మీకు మంచి డ్రైవింగ్ రికార్డ్ ఉంటే, మీ తప్పిదం వల్ల ప్రమాదం జరగకపోతే, మీరు హాయిగా ఆడవచ్చు, అధిక ప్రీమియంను ఎంచుకోవచ్చు.
  • మీరు మీ కార్​ ఇన్సూరెన్స్​ను రెన్యువల్​ చేస్తూంటే, మీ ఎన్​సీబీ (NCB)ని క్లెయిమ్ చేయడం మర్చిపోవద్దు, అది తక్కువ ప్రీమియం ఉండేలా చూస్తుంది.

ప్రమాదం జరిగినప్పుడు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఫైల్ చేసేటపుడు ఎటువంటి పత్రాలు అవసరం?

  • పూర్తిగా నింపి సంతకం చేసిన క్లెయిమ్​ ఫామ్​
  • మీ వాహనం ఆర్​సీ (RC) యొక్క కాపీ.
  • మీ డ్రైవింగ్​ లైసెన్స్​ యొక్క కాపీ.
  • మీ పాలసీ డాక్యుమెంట్​ యొక్క మొదటి 2 పేజీల కాపీ.
  • ఎఫ్​ఐఆర్​ (FIR) కాపీ.
  • ఒరిజినల్​ ఎస్టిమేట్​, ఇన్​వాయిస్​, క్యాష్​ లేదా క్యాష్​లెస్​ గ్యారేజీ పేమెంట్​ రిసిప్ట్​.

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిముల కోసం ఎటువంటి పత్రాలు కావాలి?

  • పూర్తిగా నింపి సంతకం చేసిన క్లెయిమ్​ ఫామ్​
  • ఎఫ్​ఐఆర్​ (FIR) కాపీ.
  • మీ డ్రైవింగ్​ లైసెన్స్​ యొక్క కాపీ.
  • మీ పాలసీ డాక్యుమెంట్​ యొక్క మొదటి 2 పేజీల కాపీ.
  • మీ వాహనం ఆర్​సీ (RC) యొక్క కాపీ.

దొంగతనం జరిగినపుడు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు ప్రాసెస్ ఏమిటి?

దురదృష్టవశాత్తూ, మీ కారు దొంగిలించబడినట్లయితే, క్లెయిమ్​ చేయడానికి మీరు ఈ కింది స్టెప్స్​ను అనుసరించాలి:

a) పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయండి.

b) దొంగతనం గురించి మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయండి. ఇక్కడ కింద పేర్కొన్న పత్రాలను సమర్పించవలసి ఉంటుంది:

  • మీ కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ.
  • మీ డ్రైవింగ్ లైసెన్స్ కాపీ.
  • ఎఫ్​ఐఆర్​ (FIR) కాపీ.
  • మీ కార్​ ఇన్సూరెన్స్​ పాలసీ డాక్యుమెంట్‌లోని మొదటి రెండు పేజీలు.
  • ఆర్​టీవో (RTO) కి ఒక లేఖ రాయాలి. ఇది పూర్తయిన తర్వాత పోలీసులు మీ వాహనాన్ని దొరకబట్టడానికి ప్రయత్నిస్తారు. 6 నెలల తర్వాత కూడా వాహనం దొరకకపోతే, మీరు పోగొట్టుకున్న కారు యొక్క ఆర్​సీ (RC) ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ చేయడాన్ని పూర్తి చేస్తూ, పోలీసులు ‘నాన్-ట్రేసబుల్ రిపోర్ట్’ని జారీ చేస్తారు. ఉపసంహరణ లేఖ కూడా సమర్పించబడుతుంది. అన్ని సంబంధిత డాక్యుమెంట్‌లను ఇన్సూరెన్స్​ కంపెనీ స్వీకరించిన తర్వాత, క్లెయిమ్ పరిష్కరించబడుతుంది.

మీరు పాత కార్ ఇన్సూరెన్స్ను కొత్త కారుకు బదిలీ చేస్తారా? బదిలీ చేస్తే ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది?

మీరు కొత్త కారును కొనుగోలు చేసినప్పుడు, మీ పాత కారు యొక్క ఇన్సూరెన్స్​ పాలసీని మీ కొత్త కారుకు బదిలీ చేయవచ్చు. మీరు బదిలీ గురించి మీ ఇన్సూరెన్స్​ కంపెనీకి తెలియజేయాలి. మీరు మీ ఎన్​సీబీ (NCB)ని కూడా ఉంచుకోవచ్చు.

మీరు సెకండ్​ హ్యాండ్​ కారును కొనుగోలు చేసినప్పుడు, మొదటి దశ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) యొక్క బదిలీ, అదే సమయంలో ఇన్సూరెన్స్​ పాలసీని కూడా బదిలీ చేయడం. కొత్త యజమాని కారును కొనుగోలు చేసిన తర్వాత, మునుపటి యజమాని పాలసీ చెల్లుబాటు కాదు.

ఐఆర్​డీఏఐ (IRDAI) మార్గదర్శకాల ప్రకారం, కారు యొక్క ఇన్సూరెన్స్​ పత్రాలపై పేరు, చిరునామా, ఆర్​సీ (RC) సరిపోలాలి. కాబట్టి, అత్యవసర పరిస్థితిలో, కొత్త కారు యజమాని ఎక్కువ అవాంతరాలు లేకుండా చేసిన ఖర్చులను తిరిగి పొందవచ్చు.

కార్​ ఇన్సూరెన్స్​ను బదిలీ చేయడానికి కింద పేర్కొన్న పత్రాలు అవసరం:

  • రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కాపీ (ఫారం 29).
  • పాత ఇన్సూరెన్స్​ పాలసీ పత్రం.
  • మునుపటి కారు యజమాని నుండి ఎన్​వోసీ (NOC).
  • సరిగా నింపిన కొత్త దరఖాస్తు ఫారం
  • తనిఖీ నివేదిక - ఇది వాహన సర్వే తర్వాత ఇన్సూరెన్స్​ కంపెనీచే జారీ చేయబడుతుంది.