కియా కార్నివాల్ ఇన్సూరెన్స్

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయండి

Third-party premium has changed from 1st June. Renew now

కియా కార్నివాల్ ఇన్సూరెన్స్: ఆన్‌లైన్‌లో కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ ‌ను కొనుగోలు చేయండి

సెప్టెంబర్ 1988లో కియా మోటార్స్ ద్వారా తయారు చేయబడిన కార్నివాల్ అనేది మినీ వ్యాన్. ప్రస్తుతం దీని ఫోర్త్ జెనరేషన్ అందుబాటులో ఉంది. ఆటో ఎక్స్ పో 2020లో భాగంగా ఈ మోడల్ ఫిబ్రవరి 5 2020లో ఇండియాలో లాంచ్ చేయబడింది.

ఇది మాత్రమే కాకుండా కియా ఇండియా కార్నివాల్ సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. అదే లిమోసెన్ ప్లస్.. దీనిలో కొత్త కార్పొరేట్ లోగో ఉంది.

దీనిలో అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, అప్‌టూడేట్ టెక్నాలజీ వల్ల ఇది మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ సౌత్ కొరియాకు చెందిన కారుకు విస్తృత గుర్తింపు వచ్చింది. ఈ కారు 2021 CNB MPV అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అయితే ఇతర వాహనాల మాదిరిగానే కియా కార్నివాల్ కూడా ప్రమాదాలకు గురవుతుంది. అందుకోసమే కియా కార్నివాల్ కు ఇన్సూరెన్స్ చేసి డ్యామేజ్ ఖర్చులను కవర్ చేసుకోవడం అవసరం.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ఒక కారు ఓనర్ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కానీ కలిగి ఉండాలి. అతని లేదా ఆమె కార్ వల్ల థర్డ్ పార్టీ వెహికిల్ లేదా ఆస్తులకు నష్టం జరిగినపుడు ఇది పనికి వస్తుంది. పూర్తి కవరేజ్ బెనిఫిట్స్ కోసం కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలి.

ఇండియాలో ఉన్న అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు రకాల పాలసీలను అందిస్తున్నాయి. అటువంటి కంపెనీల్లో డిజిట్ ఒకటి.

ఈ కథనంలో మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం సమాచారం ఉంది. అంతే కాకుండా డిజిట్ అందించే ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రైజ్

రిజిస్ట్రేషన్ తేదీ ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీ కోసం)
ఆగస్టు-2021 43,937
ఆగస్టు-2020 18,688
ఆగస్టు-2019 24,536

**డిస్‌క్లెయిమర్ (నిరాకరణ) – కియా కార్నివాల్ 2.2 లిమోసోన్ 7 BSVI 2199.0 డీజిల్ వెర్షన్ కు ప్రీమియం లెక్కింపులు చేయబడ్డాయి. GST మినహాయించబడింది.

సిటీ – బెంగళూరు, వెహికిల్ రిజిస్ట్రేషన్ మంత్ (వాహన రిజిస్ట్రేషన్ నెల) - ఆగస్ట్, NCB – 50శాతం, యాడ్ ఆన్స్ లేవు & IDV- అందుబాటులో ఉన్న తక్కువ మొత్తం. ప్రీమియం లెక్కలు అక్టోబర్ 2021లో చేయబడ్డాయి. పైన మీ వాహన వివరాలను ఎంటర్ చేసి ఫైనల్ ప్రీమియం సరి చూసుకోండి.

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్‌లో ఏం కవర్ అవుతాయి

మీరు ఎందుకు డిజిట్ కియా కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి?

కియా కార్నివాల్ కోసం కార్ ఇన్సూరెన్స్ ప్లాన్స్

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

అగ్ని ప్రమాదాల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

ప్రకృతి విపత్తుల వలన సొంత వాహనానికి అయిన డ్యామేజెస్/లాసెస్

×

థర్డ్ పార్టీ వాహనానికి అయిన డ్యామేజెస్

×

థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన డ్యామేజెస్

×

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ వ్యక్తికి ఇంజూరీస్/డెత్ (మరణం)

×

మీ కారు దొంగతనం

×

డోర్ స్టెప్ పికప్ & డ్రాప్

×

మీ IDVని మార్చుకోండి

×

మీకు నచ్చిన యాడ్ ఆన్స్‌తో అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య మరిన్ని తేడాలు తెలుసుకోండి

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు లేదా రెన్యూవల్ చేసిన తర్వాత క్లెయిమ్స్ కోసం మా వద్ద 3 స్టెప్ డిజిటల్ ప్రాసెస్ అందుబాటులో ఉంది. ఈ పద్ధతి మిమ్మల్ని టెన్షన్ ఫ్రీగా ఉంచుతుంది.

స్టెప్ 1

కేవలం 1800-258-5956 నెంబర్ కు కాల్ చేయండి. ఎటువంటి ఫారాలు నింపాల్సిన పని లేదు

స్టెప్ 2

సెల్ఫ్ ఇన్ఫ్సెక్షన్ (స్వీయ తనిఖీ) కోసం మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక లింక్ పంపించబడుతుంది. మీ వెహికిల్ డ్యామేజెస్ ఎలా షూట్ చేయాలో మేము మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వివరిస్తాం. మీరు ఆ లింక్ ద్వారా డ్యామేజెస్ షూట్ చేస్తే సరిపోతుంది.

స్టెప్ 3

మా నెట్వర్క్ గ్యారేజెస్ ద్వారా క్యాష్ లెస్ లేదా రీయింబర్స్ మెంట్ రిపేర్ మోడ్స్ ని ఎంచుకుని మరమ్మతు చేయించుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? ఒక ఇన్సూరెన్స్ కంపెనీని చేంజ్ చేసి వేరే ఇన్సూరెన్స్ తీసుకునేటపుడు మీ మనసులోకి వచ్చే మొదటి ప్రశ్న ఇది. మీరు అలా ఆలోచించడం బాగుంది. డిజిట్ యొక్క క్లెయిమ్స్ రిపోర్ట్ కార్డ్ చదవండి

డిజిట్ కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ ఎంచుకునేందుకు గల కారణాలు

ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకునే ముందు.. కియా కార్ ఇన్సూరెన్స్ ధర, నెట్వర్క్ గ్యారేజెస్, క్లెయిమ్ ప్రాసెస్ వంటి మరిన్ని అంశాలను చెక్ చేయాలి. మీరు డిజిట్ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకున్నపుడు ఉన్న బెనిఫిట్స్ గురించి ఇక్కడ చక్కగా వివరించబడింది.

  1. ఆన్‌లైన్ ప్రాసెస్ – కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ హోల్డర్లు స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ తనిఖీ ద్వారా ఆన్‌లైన్‌లో పాలసీని తీసుకునేందుకు డిజిట్ అనుమతిస్తుంది. ఈ ప్రాసెస్ చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. మరియు వేగవంతమైన క్లెయిమ్స్ పరిష్కారం కోసం చక్కగా ఉపయోగపడుతుంది.
  2. డిజిట్ నెట్వర్క్ గ్యారేజెస్ – మాకు దేశవ్యాప్తంగా 6000 కంటే ఎక్కువ నెట్వర్క్ గ్యారేజెస్ ఉన్నాయి. వీటిల్లో మీ కియా కార్నివాల్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరమ్మతులు చేయించుకోవచ్చు.
  3. క్యాష్‌లెస్ రిపేర్స్ – మీరు కార్ రిపేర్స్ కోసం ఏదైనా డిజిట్ నెట్వర్క్ గ్యారేజీని సంప్రదిస్తే మీకు క్యాష్‌లెస్ రిపేర్స్ ఎంచుకోవచ్చు. అప్పుడు రిపేర్స్ కోసం మీరు మీ జేబు నుంచి పైసా కూడా చెల్లించాల్సిన అవసరం రాదు. బీమాదారు నేరుగా రిపేర్ సెంటర్‌కే అమౌంట్ సెటిల్ చేస్తాడు. క్యాష్‌లెస్ రిపేర్లను ఎంచుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత పొదుపు చేయొచ్చు.
  4. డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ ఫెసిలిటీ – ఒక వేళ మీరు మీ కార్ రిపేర్స్ కోసం బీమా ప్రొవైడర్ నెట్వర్క్ గ్యారేజ్‌ను సందర్శించడం వీలు కాకపోతే.. మీరు సర్వీసులను ఇంటి నుంచే పొందొచ్చు. మీరు కేవలం కార్నివాల్ ఇన్సూరెన్స్ ధరను చెల్లించడం ద్వారా డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సర్వీసులను ఉచితంగా పొందొచ్చు.
  5. యాడ్ ఆన్ పాలసీలు – మీరు డిజిట్ ద్వారా మీ కియా కారు కోసం కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అదనపు ప్రయోజనాల కోసం మీ బేస్ ప్లాన్ మీద యాడ్ ఆన్స్ తీసుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. జీరో డెప్రిసియేషన్ కవర్, కన్య్సూమబుల్స్ కవర్, పాసింజర్ కవర్ వంటి మరిన్ని యాడ్ ఆన్స్ ను మీరు పొందొచ్చు.
  6. విశ్వసనీయమైన కస్టమర్ సర్వీస్ – ఇన్ని ప్రయోజనాలు అందిస్తున్నా కానీ మీకు వీటిపై సందేహాలు ఉండడం సహజం. అందుకోసమే బీమా సంస్థ మీ కోసం 24*7 కస్టమర్ సర్వీసును అందిస్తుంది. జాతీయ సెలవు దినాల్లో కూడా ఈ కస్టమర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

డిజిట్ వంటి ప్రఖ్యాత బీమా సంస్థల నుంచి కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ పొందడం వల్ల అదనపు ప్రయోజనాల లబ్ధి చేకూరుతుంది.

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ అనేది ప్రమాదాల వలన జరిగిన డ్యామేజ్ ఖర్చులను తగ్గించేందుకు మాత్రమే కాకుండా ఇన్సూరెన్స్ అనేది చట్టప్రకారం తప్పనిసరి. ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా కారును నడపడం వలన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా భారీ ఫైన్స్ కూడా భరించాల్సి వస్తుంది. మీరు కియా కార్ కోసం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో ఇక్కడ ఉంది.

  • థర్డ్ పార్టీ డ్యామేజెస్ నుంచి రక్షిస్తుంది – మీ సొంత వాహనం ద్వారా థర్డ్ పార్టీ వ్యక్తులకు, వాహనాలకు, ఆస్తులకు అయిన నష్టాన్ని కవర్ చేసే బేసిక్ ప్లాన్. మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం కారు ఓనర్లు ఈ ప్లాన్ కలిగి ఉండడం తప్పనిసరి. అయితే థర్డ్ పార్టీ కార్నివల్ ఇన్సూరెన్స్ సొంత నష్టాలను కవర్ చేయదు.
  • ఓన్ డ్యామేజ్ కవర్ – కియా కార్నివాల్‌ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ లో ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, సహజ విపత్తుల వలన సొంత వాహనాలకు జరిగే డ్యామేజెస్ కూడా కవర్ అవుతాయి.
  • పర్సనల్ యాక్సిడెంట్ కవర్ – IRDA ప్రకారం.. మీరు థర్డ్ పార్టీ బీమాను ఎంచుకున్నా లేదా కాంప్రహెన్నివ్ బీమాను ఎంచుకున్నా కానీ మీకు యాక్సిడెంట్ ద్వారా పూర్తి అంగవైకల్యం లేదా మరణం సంభవించినపుడు పరిహారం అందుకుంటారు.
  • నో క్లెయిమ్ బోనస్ – ప్రతి నాన్ క్లెయిమ్ సంవత్సరానికి మీ ఇన్సూరెన్స్ సంస్థ మీకు పాలసీ ప్రీమియం మీద నాన్-క్లెయిమ్ బోనస్‌ను అందిస్తుంది. ఈ డిస్కౌంట్ 20 నుంచి 50 శాతం వరకు లభిస్తుంది. దాని వల్ల మీరు మీ ప్రీమియం మీద డిస్కౌంట్ పొందొచ్చు. మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తీసుకునేటపుడు క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఉంటే డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఆర్థిక బాధ్యతలను తగ్గిస్తుంది – కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ లేని వ్యక్తి చట్టప్రకారం జరిమానాలను చెల్లించాల్సి వస్తుంది. మొదటిసారి నేరం చేస్తే రూ. 2000 మరియు రెండోసారి నేరం చేసినట్లయితే రూ. 4000 చెల్లించాల్సి వస్తుంది. మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఈ ఫైన్స్ బాధ్యతల నుంచి తప్పించుకోవచ్చు.

ఇంకా డిజిట్ వంటి అనేక ప్రొవైడర్లు వారి నుంచి ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటే వారికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

కియా కార్నివాల్ గురించి మరింత తెలుసుకోండి

ఈ కారు ఆరు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మూడు ఎక్స్‌టీరియర్ కలర్స్, ఒక ఇంటీరియర్ కలర్‌లో లభిస్తుంది. అంతే కాకుండా అప్‌గ్రేడ్ చేసిన దీని ఫీచర్ల వలన మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ మోడల్ కీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ ఉన్నాయి.

  • కొలతలు – ఈ కారు ఓవరాల్ లెంగ్త్, విడ్త్, హైట్ 5115 ఎంఎం, 1985 ఎంఎం, మరియు 1740 ఎంఎంగా ఉంది. దీని వీల్ బేస్ 3060 ఎంఎంగా ఉంటుంది. దీని బూట్ స్పేస్ (డిక్కీ స్పేస్) 540 లీటర్లుగా ఉంటుంది.
  • ఇంజిన్ – ఇది BS-VI ఉద్గార ప్రమాణాలను కలిగి ఉన్న CRDi డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 200 PS/3800 RPM పవర్ మరియు 440 Nm/1500~2750 RPM టార్క్‌ను కలిగి ఉంటుంది. మోడల్ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ 2.2 లీటర్లుగా ఉంటుంది.
  • ట్రాన్స్‌మిషన్ మరియు డ్రైవ్ – కియా కార్నివాల్ 8AT ట్రాన్స్‌మిషన్ మరియు 2WD డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.
  • ఇన్ఫోటైన్‌మెంట్ టెక్నాలజీ – ఈ కారు అనేది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లేతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంటుంది.
  • సేఫ్టీ ఫీచర్స్ – ఇది డ్రైవర్ మరియు ప్యాసింజర్ సేఫ్టీ బ్యాగ్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది ప్రొజెక్టర్ బల్బ్ టైప్ ఫాగ్ ల్యాంప్స్, ఆటో హెడ్ ల్యాంప్స్, ప్రీ టెన్షనర్‌తో కూడిన ఫ్రంట్ సీట్ బెల్ట్స్ మరియు లోడ్ లిమిటర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఆర్థిక భద్రత కోసం మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఎంచుకోవాలి. మీ కారు కనుక ప్రమాదానికి గురైతే ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

కియా కార్నివాల్ వేరియంట్స్ మరియు ఎక్స్ షోరూం ధరలు

వేరియంట్స్ ఎక్స్-షోరూం ధరలు (నగరాన్ని బట్టి ధరలు మారొచ్చు)
ప్రీమియం (డీజిల్) ₹30.18 లక్షలు ప్రీమియం 8 STR(డీజిల్) ₹30.42 లక్షలు ప్రెస్టీజ్ (డీజిల్) ₹34.97 లక్షలు ప్రెస్టీజ్9 STR (డీజిల్) ₹36.17 లక్షలు లిమోసైన్ (డీజిల్) ₹40.97 లక్షలు లిమోసైన్ ప్లస్ (డీజిల్) ₹40.34 లక్షలు

ఇండియాలో కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు

థర్డ్ పార్టీ కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నపుడు డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సౌకర్యం లభిస్తుందా?

లేదు. డోర్ స్టెప్ పికప్ మరియు డ్రాప్ సౌకర్యం కేవలం కాంప్రహెన్సివ్ ప్లాన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

నేను బీమా తీసుకున్నపుడే నా కియా కార్నివాల్ IDVని మార్చుకోవచ్చా?

మీరు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంచుకుంటే డిజిట్ వంటి కంపెనీలు మీ IDVని మార్చుకునే సదుపాయాన్ని కలిగిస్తాయి. మీ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువను పెంచుకోవడం ద్వారా మీ పొందే క్లెయిమ్ మొత్తాన్ని పెంచుకోవచ్చు.

కియా కార్నివాల్ కార్ ఇన్సూరెన్స్‌లో ఇంజిన్ కవర్ చేర్చబడిందా?

లేదు. ఇంజిన్ కవర్ బేసిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ కిందకు రాదు. అయితే మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ లో ఇంజిన్ మరియు గేర్ బాక్స్ కవర్ కొనుక్కునే అవకాశం ఉంటుంది.