సెప్టెంబర్ 1988లో కియా మోటార్స్ ద్వారా తయారు చేయబడిన కార్నివాల్ అనేది మినీ వ్యాన్. ప్రస్తుతం దీని ఫోర్త్ జెనరేషన్ అందుబాటులో ఉంది. ఆటో ఎక్స్ పో 2020లో భాగంగా ఈ మోడల్ ఫిబ్రవరి 5 2020లో ఇండియాలో లాంచ్ చేయబడింది.
ఇది మాత్రమే కాకుండా కియా ఇండియా కార్నివాల్ సిరీస్కు కొత్త వేరియంట్ను జోడించింది. అదే లిమోసెన్ ప్లస్.. దీనిలో కొత్త కార్పొరేట్ లోగో ఉంది.
దీనిలో అప్గ్రేడ్ చేసిన ఫీచర్లు, అప్టూడేట్ టెక్నాలజీ వల్ల ఇది మరింత గుర్తింపును సొంతం చేసుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ సౌత్ కొరియాకు చెందిన కారుకు విస్తృత గుర్తింపు వచ్చింది. ఈ కారు 2021 CNB MPV అవార్డును కూడా సొంతం చేసుకుంది.
అయితే ఇతర వాహనాల మాదిరిగానే కియా కార్నివాల్ కూడా ప్రమాదాలకు గురవుతుంది. అందుకోసమే కియా కార్నివాల్ కు ఇన్సూరెన్స్ చేసి డ్యామేజ్ ఖర్చులను కవర్ చేసుకోవడం అవసరం.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం.. ఒక కారు ఓనర్ కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కానీ కలిగి ఉండాలి. అతని లేదా ఆమె కార్ వల్ల థర్డ్ పార్టీ వెహికిల్ లేదా ఆస్తులకు నష్టం జరిగినపుడు ఇది పనికి వస్తుంది. పూర్తి కవరేజ్ బెనిఫిట్స్ కోసం కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండాలి.
ఇండియాలో ఉన్న అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు రెండు రకాల పాలసీలను అందిస్తున్నాయి. అటువంటి కంపెనీల్లో డిజిట్ ఒకటి.
ఈ కథనంలో మీరు కియా కార్నివాల్ ఇన్సూరెన్స్ గురించి మొత్తం సమాచారం ఉంది. అంతే కాకుండా డిజిట్ అందించే ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి.