డిజిట్ ఇన్సూరెన్స్ చేయండి

ఆమ్ ఆద్మీ బీమా యోజన గురించి అన్నీ తెలుసుకోండి

1.3 బిలియన్లకు పైగా జనాభా ఉన్న దేశంలో, 22% శ్రామిక జనాలు అంతర్జాతీయ రోజువారీ వేతన బెంచ్‌మార్క్ అయిన రూ.143 కంటే తక్కువగా సంపాదిస్తున్నారు. 

శ్రామికులలో ఎక్కువ మంది ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉండిపోయి, వారి కుటుంబానికి ఆదాయ వనరు లేకుండా చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ బీమా యోజనతో ముందుకు వచ్చింది.

ఈ పథకం ఏమిటి మరియు ఇది ఎలా పని చేస్తుంది అని ఆలోచిస్తున్నారా?

దయచేసి మా గైడ్ చదవండి.

ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY) అంటే ఏమిటి?

అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం 2007 అక్టోబర్ 2న ఆమ్ ఆద్మీ బీమా యోజనను ప్రారంభించింది. ఈ సామాజిక భద్రతా పథకం ఆరోగ్య సమస్యలు మరియు మరణానికి వ్యతిరేకంగా తక్కువ-ఆదాయ వర్గాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 

వీధి వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు మొదలైన ఈ కార్మికులు ఏ చట్టం కింద కూడా నమోదు చేయబడలేదు. అందువల్ల, వారు సంఘటిత రంగాలలోని కార్మికులను కవర్ చేసే ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలను పొందలేరు.

ప్రధాన మంత్రి ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద ఏమి కవర్ చేయబడింది?

ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ-సహాయ పథకం నుండి ఎలాంటి కవరేజీని పొందవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు, అవునా?

మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇన్సూరెన్స్ చేసిన మొత్తంతో పాటు వాటిపై చెల్లుబాటు అయ్యే పరిస్థితులను వివరించే పట్టిక ఇక్కడ ఇవ్వబడింది.

అత్యవసర రకం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం
ప్రమాదం కారణంగా మరణం రూ.75000
సహజ మరణం రూ.3000
ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం రూ.37500
ప్రమాదవశాత్తు సంపూర్ణ శాశ్వత వైకల్యం రూ.75000

పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి అతని/ఆమె సంతానం కోసం అదనపు స్కాలర్‌షిప్ ప్రయోజనాన్ని కూడా ఉచితంగా పొందవచ్చు. ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకం కింద ప్రతి చిన్నారికి నెలవారీ రూ.100 కవరేజి ఉంటుంది. ఇది గరిష్టంగా 2 మంది పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని, వారిద్దరూ 9 నుంచి 12వ తరగతి చదువుతూ ఉండాలని గుర్తుంచుకోండి.

AABY కింద మినహాయింపులు

జనంలో ఉండే ఒక సాధారణ అపోహ ఏమిటంటే, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కాబట్టి, ఇది అన్ని రకాల వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది అని. అయితే, అన్ని ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగానే, ఆమ్ ఆద్మీ బీమా యోజన కూడా కొన్ని నిర్దిష్ట మినహాయింపులను కలిగి ఉంది.

ఈ ప్రోగ్రామ్ కింద కవర్ చేయని పరిస్థితులు/పరిస్థితుల జాబితా ఈ క్రింద ఇవ్వబడింది.

  • ఆసుపత్రి ఖర్చు
  • గర్భం మరియు ప్రసవం
  • మాదకద్రవ్య దుర్వినియోగం కారణంగా మరణం లేదా వైకల్యం
  • జీవ, రసాయన లేదా రేడియోధార్మిక ఆయుధాల వల్ల కలిగే గాయం
  • మానసిక అనారోగ్యము
  • విపరీతమైన క్రీడలలో పాల్గొనడం వలన గాయం
  • ఆత్మహత్య లేదా స్వీయ హాని
  • నేర కార్యకలాపాల వల్ల మరణం లేదా వైకల్యం
  • యుద్ధం లేదా యుద్ధం లాంటి పరిస్థితుల్లో గాయం

పై జాబితా ను గమనించడం ద్వారా, ఈ పథకం నుండి మీ కుటుంబం ఎలా ప్రయోజనం పొందవచ్చో మీరు స్పష్టమైన అవగాహన పొందవచ్చు.

ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY) లక్షణాలు

పాలసీలో చేరికలు మరియు మినహాయింపులతో పాటు, ఈ ఇన్సూరెన్స్ పథకం యొక్క కొన్ని ఇతర ముఖ్య లక్షణాల జాబితా ఇక్కడ ఉంది.

  • AABY యొక్క ప్రాథమిక లక్ష్యం పట్టణాల్లో ఆరోగ్య సంరక్షణను అందుకోవడానికి మార్గాలు లేని వ్యక్తులకు సామాజిక భద్రతను అందించడం.
  • ఈ పాలసీ స్థిరమైన ఇన్సూరెన్స్ మొత్తాన్ని కలిగి ఉంటుంది, మరియు ఇది వచ్చే పరిస్థితిని బట్టి మారుతుంది.
  • ఈ కవరేజీ మొత్తం క్లయిమ్ పై ఒకేసారి చెల్లించబడుతుంది.
  • ఆమ్ ఆద్మీ బీమా యోజన కుటుంబానికి ఒక సభ్యునికి మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల, మరొక కుటుంబ సభ్యుడు ఇంతకు ముందు దాని ఫలాలను పొందినట్లయితే మీరు పేర్కొన్న ప్రయోజనాలను పొందలేరు.
  • ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా మాత్రమే కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ప్రస్తుతం ఈ పథకాన్ని అందిస్తున్న ఏకైక ఇన్సూరెన్స్ కంపెనీ LIC మాత్రమే.

ఇప్పుడు మీరు ఈ పథకం యొక్క ముఖ్యమైన లక్షణాలను తెలుసుకున్నారు. ఇక దాని ప్రయోజనాలను తెలుసుకోవడానికి ఇది సమయం.

ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY) ప్రయోజనాలు

ఈ ఇన్సూరెన్స్ పథకం యొక్క కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

  • సబ్సిడీ మరియు సరసమైన ప్రీమియంలు: ఈ పథకం ఇతర ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే అత్యంత సరసమైన ప్రీమియంలతో వస్తుంది, వీటిలో 50% ప్రభుత్వ-ప్రాయోజితమైనది. మనము ప్రీమియంల విభాగం కింద ఈ అంశాన్ని వివరంగా చర్చిస్తాము.
  • తక్షణ సహాయం: స్కీమ్ సభ్యుల డిజిటల్ డేటాబేస్ అవసరమైనప్పుడు సమాచారాన్ని త్వరితగతిన పంచుకోవడానికి సహాయం చేస్తుంది. పరిష్కారం కోసం పాలసీదారులు తమ సమీపంలోని ఎల్‌ఐసీ శాఖను సులభంగా సంప్రదించవచ్చు.
  • అవాంతరాలు లేని నమోదు: అప్లికేషన్ మరియు నమోదులో విస్తృతమైన డాక్యుమెంటేషన్ ఉండదు.
  • సరళమైన క్లయిమ్ ప్రక్రియ: నమోదు ప్రక్రియ లాగానే, క్లయిమ్ ఫైల్ చేసే ప్రక్రియ కూడా ABBY కార్డ్ ద్వారా సులభతరం చేయబడింది.

అయితే, మీరు ఆదాయం, వయస్సు మరియు వృత్తికి సంబంధించిన నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే మీరు ఈ ప్రయోజనాలను పొందగలరని గమనించండి.

ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద ఏ వృత్తులు కవర్ చేయబడ్డాయి?

ఇప్పటికే చెప్పినట్లుగా, ఈ పథకం ప్రాథమికంగా తక్కువ-ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులపై దృష్టి పెడుతుంది. 

అయితే, మీరు స్పష్టమైన సమాచారం కోసం వెదుకుతున్నారని మేము అర్థం చేసుకున్నాము. ఆమ్ ఆద్మీ బీమా యోజన ఎవరికి సామాజిక భద్రత కల్పిస్తుందో తెలుసుకోవాలంటే, ఈ క్రింది జాబితాను చూడండి.

  • రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద అసంఘటిత కార్మికులు
  • మత్స్యకారులు
  • టపాకాయల పరిశ్రమ లో పని చేసే కార్మికులు
  • పేపర్ ఉత్పత్తి తయారీదారులు
  • వ్యవసాయదారులు
  • రవాణా డ్రైవర్ల సంఘం
  • అంగన్‌వాడీ టీచర్లు
  • చెక్క ఉత్పత్తుల తయారీదారు
  • రవాణా కార్మికులు
  • సఫాయి కార్మికులు 
  • ఆటో డ్రైవర్లు లేదా రిక్షా పుల్లర్లు
  • విదేశాల్లో ఉండే భారతీయ కార్మికులు
  • మట్టి బొమ్మల తయారీదారులు 
  • బీడీ కార్మికులు
  • స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలు
  • ఇటుక బట్టీ కార్మికులు
  • అటవీ కార్మికులు
  • హమాలి
  • కొత్వాల్
  • లేడీ టైలర్స్
  • వడ్రంగులు
  • హస్తకళ కళాకారులు
  • స్వయం ఉపాధి పొందిన శారీరక వికలాంగులు 
  • కొండ ప్రాంతాల మహిళలు
  • SEWAతో అనుబంధించబడిన పాపడ్ కార్మికులు
  • కొవ్వొత్తుల తయారీదారులు
  • గొర్రెల పెంపకందారులు
  • చేనేత నేత కార్మికులు
  • ఉప్పు పెంపకందారులు
  • కల్లు తీసేవాళ్ళు 
  • బీడీ ఆకు ఏరుకునేవాళ్ళు
  • చెప్పులు కుట్టేవారు
  • తోలు మరియు చర్మ కార్మికులు
  • రబ్బరు మరియు బొగ్గు ఉత్పత్తులను ముద్రించడంలో ఉపాధి పొందిన వ్యక్తులు 
  • తోటల కార్మికులు
  • సెరికల్చర్ ఉద్యోగులు
  • పవర్లూమ్ కార్మికులు
  • కొబ్బరి ప్రాసెసర్లు
  • ప్రాథమిక పాల ఉత్పత్తిదారులు
  • టెక్స్‌టైల్ ఉద్యోగులు
  • నిర్మాణ కార్మికులు
  • తోలు ఉత్పత్తుల తయారీదారులు

ఈ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు అర్హత సాధించడానికి మీరు పైన పేర్కొన్న ఏదైనా వృత్తికి చెందినవారు మాత్రమే కాకుండా, మీరు నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి.

అర్హత ప్రమాణం

విజయవంతంగా నమోదు చేసుకోవడానికి అవసరమైన పరిస్థితులను గమనించండి.

  • సంభావ్య ఇన్సూరెన్స్ సభ్యుని వయస్సు తప్పనిసరిగా 18-59 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దరఖాస్తుదారు తప్పనిసరిగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబం, గ్రామీణ భూమి లేని కుటుంబం (RLH) లేదా ఏదైనా పేర్కొన్న వృత్తిపరమైన సమూహాలలో ఒకరై ఉండాలి.
  • దరఖాస్తు చేసుకునే వ్యక్తి సంపాదిస్తున్న ఏకైక సభ్యుడు లేదా కాకపోయినా,తప్పనిసరిగా కుటుంబ పెద్ద అయి ఉండాలి. 

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ లో ఎలా నమోదు చేసుకోవాలో తెలియకపోతే, మీ మొదటి సారి దరఖాస్తు కోసం ఇక్కడ గైడ్ ఇవ్వబడింది.

ఆమ్ ఆద్మీ బీమా యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ఆమ్ ఆద్మీ బీమా యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింద ఇచ్చిన స్టెప్ లను అనుసరించండి.

స్టెప్ 1: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. 

స్టెప్ 2: హోమ్‌పేజీలో “LIC ఆమ్ ఆద్మీ బీమా యోజన ఆన్‌లైన్‌లో అప్లై చెయ్యి” ఎంచుకోండి.

స్టెప్ 3: తదుపరి స్క్రీన్‌లో, ఖచ్చితమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 4: అవసరమైన అన్ని పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేసి, “సమర్పించు”పై క్లిక్ చేయండి. 

ఇంటర్నెట్ యాక్సెస్ లేని వ్యక్తులు AABY అప్లికేషన్ విధానాన్ని ఆఫ్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. దాని కోసం క్రింది స్టెప్ లు ఉన్నాయి.

స్టెప్ 1: దరఖాస్తు ఫారమ్‌ను పొందడానికి మీ సమీప NIC నోడల్ ఏజెన్సీని సందర్శించండి.

స్టెప్ 2: ఆన్‌లైన్ ప్రక్రియ వలె, ఇక్కడ కూడా సరైన సమాచారంతో ఈ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 3: దరఖాస్తు ఫారమ్‌తో అవసరమైన అన్ని పత్రాల కాపీలను అటాచ్ చేయండి.

స్టెప్ 4: మీ సమీపంలోని ఎల్‌ఐసి కార్యాలయానికి వెళ్లి, ముందుగా పేర్కొన్న విధంగా వస్తువులను సమర్పించండి. 

అంతే. మీ ప్రక్రియ పూర్తయింది! 

ఇప్పుడు, మీకు ఈ పథకం గురించి మరింత సమాచారం కావాలంటే, కింది SMSని 9222492224 లేదా 56767877కు పంపండి:

 “LICHELP <పాలసీ సంఖ్య>.”

AABY కోసం దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరి పత్రాలు ఏమిటి?

దరఖాస్తు కోసం అవసరమైన అన్ని పత్రాలను గుర్తుపెట్టుకోవడం మొదటిసారి దరఖాస్తుదారుడికి కష్టంగా ఉంటుంది. మీ ఆందోళనను పరిష్కరించడానికి, దరఖాస్తు చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన అన్ని అవసరమైన పత్రాల జాబితా క్రింద ఇవ్వబడి ఉంది. 

  • రేషన్ కార్డు
  • ఆధార్ కార్డ్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • నామినీ దరఖాస్తు ఫారమ్

ఏదైనా అదనపు పత్రం యొక్క ఆవశ్యకతను నిర్ధారించుకొని మీ దరఖాస్తు ఫారమ్‌తో దానిని అందించినట్లు ధృవీకరించుకోండి.

మీరు దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, మీరు చెల్లించాల్సిన ప్రీమియం గురించి మీరు ఆందోళన చెందుతూ ఉంటారు. మేము దానిని కూడా కవర్ చేసాము!

ఆమ్ ఆద్మీ బీమా యోజన ద్వారా వసూలు చేయబడే ప్రీమియం ఎంత?

ఇతర ఇన్సూరెన్స్ ప్లాన్ లాగానే, AABY పథకం కూడా నామమాత్రంగా ఉన్నప్పటికీ, ప్రీమియంలతో వస్తుంది. అవును, ఈ ప్లాన్ తక్కువ సంపాదన కలిగిన కార్మికుల జీవితాలను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నందున, రూ.30,000 ఇన్సూరెన్స్ కవరేజీపై వార్షిక ప్రీమియం కేవలం రూ.200గా నిర్ణయించబడింది. పైగా, ఈ మొత్తంలో 50% ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

అదనంగా, కింది వర్గాలకు చెందిన వ్యక్తులు తదుపరి ప్రయోజనాలను పొందగలరు.

  • గ్రామీణ భూమి లేని కుటుంబాలు (RLH): మిగిలిన 50% ప్రీమియం UT/రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించబడుతుంది.
  • గుర్తింపు పొందిన వృత్తిపరమైన సమూహాలు: మిగిలిన 50% ప్రీమియం నోడల్ ఏజెన్సీ లేదా UT/రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించబడుతుంది.

కాబట్టి, మీరు పైన పేర్కొన్న సమూహాలలో భాగమైతే, మీరు ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద మొత్తం పథకం ప్రయోజనాలను జీరో-ప్రీమియంతో పొందవచ్చు!

AABY పథకం కింద క్లయిమ్ ను ఎలా చెయ్యాలి?

వచ్చిన ఆపద రకాన్ని బట్టి, మీ చెయ్యాల్సిన ఇన్సూరెన్స్ క్లయిమ్ ప్రాసెస్ భిన్నంగా ఉండవచ్చు.

ఇక్కడ, మీరు క్లయిమ్ ని లేవనెత్తడానికి సాధ్యమయ్యే అన్ని పరిస్థితులను మరియు వాటి సంబంధిత విధానాలను మేము ఇక్కడ జాబితాగా ఇస్తున్నాము. 

1) ప్రమాదం లేదా సహజ కారణాల వల్ల మరణం 

ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి మరణించిన తర్వాత, నామినీ కింది స్టెప్ ల్లో డెత్ క్లయిమ్ చేయవచ్చు.

  • స్టెప్ 1: ఆమ్ ఆద్మీ బీమా యోజన డెత్ క్లయిమ్ ఫారమ్‌ను పూరించండి.
  • స్టెప్ 2: పాలసీదారు యొక్క అసలు మరణ ధృవీకరణ పత్రం మరియు ధృవీకరించబడిన కాపీని సంబంధిత నోడల్ ఏజెన్సీ అధికారికి సమర్పించండి.
  • స్టెప్ 3: ధృవీకరణ చేసిన తర్వాత, అధికారి అందించిన పత్రాలు మరియు మరణించిన పాలసీదారు యొక్క అర్హత సర్టిఫికేట్‌తో పాటు క్లయిమ్ ఫారమ్‌ను సమర్పిస్తారు.

ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో, నామినీలు పోస్ట్ మార్టం నివేదిక, ఎఫ్‌ఐఆర్, పోలీసు విచారణ నివేదిక మరియు తుది పోలీసు నివేదిక కాపీలను కూడా సమర్పించాల్సి ఉంటుందని గమనించండి.

2) పాక్షిక లేదా పూర్తి వైకల్యం

వైకల్యం క్లయిమ్ ను ఫైల్ చేయడానికి, ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఆమ్ ఆద్మీ బీమా యోజన క్లయిమ్ ఫారమ్‌తో పాటు కింది పత్రాలను సమర్పించాలి.

  • పోలీసు FIR వంటి ప్రమాద రుజువుతో కూడిన పత్రాలు.
  • వైకల్యం యొక్క వివరాలు మరియు రకాన్ని తెలిపే వైద్య ధృవీకరణ పత్రం. ఇది తప్పనిసరిగా నమోదిత ప్రభుత్వ ఆర్థోపెడిక్ లేదా ప్రభుత్వ సివిల్ సర్జన్ ద్వారా జారీ చేయబడాలి.
  • స్కాలర్‌షిప్ ప్రయోజనం

మీ బిడ్డ AABY కింద స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందేందుకు అర్హత కలిగి ఉంటే, మీరు ఆమ్ ఆద్మీ బీమా యోజన స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించి, దానిని మీ నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి.

నోడల్ ఏజెన్సీ మీ బిడ్డ అర్హత పరిమితులను దాటిందో లేదో క్రాస్-చెక్ చేయడానికి ప్రతి 6 నెలలకోసారి ఈ విధానాన్ని అనుసరించాలి. గుర్తించబడిన విద్యార్థుల జాబితాను ఏజెన్సీ LIC యొక్క పెన్షన్ & గ్రూప్ స్కీమ్ యూనిట్‌కు పంపుతుంది.

ఈ జాబితాలో ప్రతి లబ్దిదారునికి సంబంధించి కింది వివరాలు తప్పనిసరిగా ఉండాలి.

  • విద్యార్థి పేరు
  • తరగతి
  • పాఠశాల పేరు
  • ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి పేరు
  • ఆమ్ ఆద్మీ బీమా యోజన పాలసీ సంఖ్య
  • NEFT సంఖ్య
  • బీమా చేయబడిన సభ్యుని సభ్యత్వ సంఖ్య.

అర్హులైన విద్యార్థుల పూర్తి జాబితాను స్వీకరించిన తర్వాత, LIC స్కాలర్‌షిప్ మొత్తాన్ని NEFT ద్వారా పాలసీదారు యొక్క బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తుంది.

ఈ మొత్తం ప్రక్రియ లో ఉండే అనేక చిక్కుల కారణంగా, ఆసక్తి ఉన్న వ్యక్తులకు గందరగోళాలు మరియు సందేహాలు ఉండే అవకాశం ఉంది.

సరే, దాని కోసం, LIC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఆమ్ ఆద్మీ బీమా యోజన హెల్ప్‌లైన్ నంబర్‌ను మీరు సంప్రదించవచ్చు. మీరు మీ సమీప LIC బ్రాంచ్ యొక్క సంప్రదింపు వివరాల ద్వారా కూడా మీ ప్రశ్నలను పంపించవచ్చు.

తరచుగా అడుగు ప్రశ్నలు

పాక్షిక వైకల్యం మరియు శాశ్వత మొత్తం వైకల్యం కింద నేను ఏ పరిస్థితులలో కవరేజీని పొందగలను?

పాక్షిక వైకల్యం అనేది ఒక వ్యక్తి ఇప్పటికీ జీవనోపాధి కోసం పని చేయగల పరిస్థితిని సూచిస్తుంది మరియు ఒక కన్ను లేదా అవయవాన్ని కోల్పోవడాన్ని కలిగి ఉంటుంది. శాశ్వత మొత్తం వైకల్యం రెండు కళ్ళు, రెండు అవయవాలు లేదా ఒక కన్ను మరియు ఒక అవయవాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. వైకల్యం యొక్క రకాన్ని బట్టి, ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తులు తదనుగుణంగా సమ్ ఇన్సూర్డ్ పొందవచ్చు.

AABY దరఖాస్తు సమయంలో నేను నామినీని నియమించాలా?

అవును, ఈ ఇన్సూరెన్స్ పథకానికి దరఖాస్తు చేసేటప్పుడు తప్పనిసరిగా నామినీని నియమించాలి, తద్వారా ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి మరణించిన తర్వాత నామినీ క్లయిమ్ చేసుకోవచ్చు. దీని కోసం, మీరు సమర్పించే ముందు మీ దరఖాస్తు ఫారమ్‌తో అందించిన నామినేషన్ ఫారమ్‌ను సరిగ్గా పూరించాలి. ఈ ఫారమ్ నోడల్ ఏజెన్సీ డెత్ క్లయిమ్ పై ఎల్‌ఐసికి బదిలీ చేసే వరకు దాని వద్దనే ఉంటుంది.

సామాజిక భద్రతా నిధి పాత్ర ఏమిటి?

ఆర్థికంగా వెనుకబడిన కార్మికులకు AABY ఇన్సూరెన్స్ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యం. అందుకే ప్రీమియం మొత్తంలో సగం రాయితీ కోసం కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేసింది.

నా కుటుంబం యొక్క మునుపటి పాలసీదారు చనిపోయిన తర్వాత నేను ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద మళ్లీ దరఖాస్తు చేయవచ్చా?

లేదు, ఆమ్ ఆద్మీ బీమా యోజన ఒక కుటుంబానికి ఒక అప్లికేషన్ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీ కుటుంబ పాలసీదారు మరణించినట్లైతే, మీరు డెత్ క్లయిమ్ కోసం దాఖలు చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న కవరేజ్ నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే, మీరు ఈ పథకం ప్రయోజనాన్ని రెండవసారి పొందేందుకు దరఖాస్తు చేయలేరు.