బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్

బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ధర రూ. 752 నుంచే ప్రారంభం.
search

I agree to the  Terms & Conditions

It's a brand new bike

ఆన్​లైన్​లో బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు/రెన్యువల్ చేయండి

బజాజ్ టూ వీలర్స్​ గురించి పూర్తిగా తెలుసుకోండి – భారతదేశంలో బజాజ్ అత్యుత్తమ, బాగా ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు సంస్థ. బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు..:  

భారతదేశంలో దాదాపు 22 ద్విచక్ర వాహన తయారీదారు సంస్థలు ఉన్నాయి. ఇందులో ఒకటైన బజాజ్ ఆటో లిమిటెడ్ కస్టమర్లకు విస్తృత శ్రేణి వాహనాలను అందిస్తుంది. అన్ని శ్రేణుల కస్టమర్లను ఇది సంతృప్తి పరుస్తుంది. క్రూయిజర్ నుంచి కమ్యూటర్ వరకు కస్టమర్లకు అనేక ఎంపికలను అందిస్తోది.

బజాజ్ కంపెనీకి భారతదేశ వ్యాప్తంగా 408 పట్టణాల్లో 660కి పైగా డీలర్లు ఉన్నారు. చాలా మంది భారతీయులు వెతికే అన్ని రకాలుగా సౌకర్యవంతమైన వాహనాలను ఈ సంస్థ అందజేస్తోంది.

ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం అందరికీ అత్యవసర వాహనాలుగా మారిపోయాయి. కానీ వీటికి రిస్కుతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కావున మీరు బజాజ్ బైక్​తో రోడ్డు మీద రైడ్ చేసే ముందు బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్​ను తీసుకోండి. ఇది అనేక ఆర్థిక విపత్తుల నుంచి మిమ్మల్ని సంరక్షిస్తుంది.

మోటారు వాహనాల చట్టం–1988 ప్రకారం టూ–వీలర్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.  బీమా ఉంటే మీకు ఆర్థిక భద్రతను అందజేయడంతో పాటు బండి నడిపే సమయంలో మీకు ఎటువంటి చింత లేకుండా చేస్తాయి.

బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకోవాలని చూసినపుడు.. బజాజ్ కంపెనీ అందజేసే వివిధ రకాల ప్రొడక్టులను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Read More

బజాజ్ బైక్​ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమేం కవర్ అవుతాయి

Bike-insurance-damaged

ప్రమాదాలు

ప్రమాదాల వలన కలిగే సాధారణ డ్యామేజీలు

Bike Theft

దొంగతనాలు

ఒకవేళ ఏదైనా సందర్భంలో మీ బండి లేదా స్కూటర్ దొంగతనానికి గురైతే..

Car Got Fire

అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదాల వలన జరిగే సాధారణ డ్యామేజీలు

Natural Disaster

ప్రకృతి విపత్తులు

ప్రకృతి విపత్తుల వలన కలిగే నష్టాలు

Personal Accident

వ్యక్తిగత గాయాలు

ప్రమాదంలో మీరు తీవ్రంగా గాయాలకు గురైనప్పుడు

Third Party Losses

థర్డ్ పార్టీ నష్టాలు

మీ బండికి ప్రమాదం జరిగినపుడు మీ బండి వలన ఎవరైనా లేదా ఏదైనా ఆస్తి డ్యామేజ్ అయితే..

ఏమేం కవర్ కావంటే..

కవర్ అయ్యే విషయాలను తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. కవర్ కాని విషయాలను గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు క్లెయిమ్ చేసే సమయంలో ఇది కవర్ కాదు అని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉంటారు. కింద పేర్కొన్న పరిస్థితుల్లో బీమా వర్తించదు:

థర్డ్ పార్టీ పాలసీదారుడికి సొంత డ్యామేజీలకు..

ఒకవేళ మీరు థర్డ్ పార్టీ లేదా లయబులిటీ ఓన్లీ బైక్ పాలసీని తీసుకుంటే మీ సొంత వాహనానికి అయిన డ్యామేజీలు కవర్ కావు.

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా..

మీరు మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదం చేసినా లేక సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా మీ బీమా వర్తించదు.

సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి పక్కన లేకుండా నడిపితే..

ఒకవేళ మీకు లెర్నర్ లైసెన్స్ ఉంటే, సరైన లైసెన్స్ ఉన్న వ్యక్తి మీ పక్కన లేకుండా మీరు వాహనం నడిపిన సందర్భంలో బీమా వర్తించదు.

పర్యవసాన నష్టాలు

ప్రమాదం వలన నేరుగా సంభవించని డ్యామేజీలు (ఉదా: ప్రమాదం జరిగిన తర్వాత డ్యామేజ్ అయిన టూ వీలర్ ఇంజిన్​ను నడిపించేందుకు ప్రయత్నించినపుడు ఇంజిన్ మరింతగా డ్యామేజ్ అయిన సందర్భంలో బీమా వర్తించదు)

స్వీయ నిర్లక్ష్యం

నిర్లక్ష్యం వలన సంభవించే అన్ని నష్టాలు (ఉదా: వరదల్లో మీరు టూ–వీలర్​ను నడిపినపుడు డ్యామేజ్ అయితే అది కవర్ కాదు. డ్రైవింగ్ మ్యాన్యువల్ ప్రకారం వరదల్లో బండి నడపొద్దని స్పష్టం​గా ఉంటుంది.)

యాడ్​–ఆన్స్ కొనుగోలు చేయకపోతే

కొన్ని నష్టాలను కేవలం యాడ్–ఆన్స్ మాత్రమే కవర్ చేస్తాయి. మీరు అందుకు సంబంధించిన యాడ్–ఆన్లను కొనుగోలు చేయకపోతే.. అటువంటి నష్టాలు కవర్ కావు.

మీరు డిజిట్ అందించే బజాజ్ బైక్​ ఇన్సూరెన్స్​ను ఎందుకు కొనుగోలు చేయాలి?

Cashless Repairs

నగదు రహిత మరమ్మతులు

మాకు భారతదేశ వ్యాప్తంగా 4400+ కంటే ఎక్కువ నగదు రహిత నెట్​వర్క్ గ్యారేజీలు ఉన్నాయి.

Smartphone-enabled Self Inspection

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ

స్మార్ట్​ఫోన్ ఆధారిత స్వీయ తనిఖీ ప్రక్రియ ద్వారా పేపర్​లెస్ క్లెయిమ్స్ (కాగితంతో అవసరం లేకుండానే చేసే క్లెయిములు) చాలా తొందరగా పూర్తవుతాయి.

Super-fast Claims

సూపర్ ఫాస్ట్ క్లెయిమ్స్

కేవలం 11 రోజుల్లోనే మా దగ్గర టూ వీలర్ క్లెయిమ్స్​ సెటిల్ అవుతాయి.

Customize your Vehicle IDV

మీ వాహన ఐడీవీ (IDV)ని కస్టమైజ్ చేసుకోండి.

మాతో కలిసి మీ వాహన ఐడీవీ (IDV) ని మీకు నచ్చిన విధంగా మార్చుకోండి.

24*7 Support

24*7 సపోర్ట్

జాతీయ సెలవు దినాల్లో కూడా 24*7 కాల్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది.

మీ అన్ని అవసరాలకు తగిన బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ

థర్డ్–పార్టీ బైక్ ఇన్సూరెన్స్ అనేది ఒక సాధారణ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇందులో కేవలం థర్డ్-పార్టీ వ్యక్తులు, వాహనాలు, ఆస్తులకు జరిగిన నష్టాలు మాత్రమే కవర్ చేయబడతాయి.

కాంప్రహెన్సివ్

కాంప్రహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ అనేది అత్యంత విలువైన బైక్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కేవలం థర్డ్ పార్టీ నష్టాలు, లయబులిటీలను కవర్ చేయడం మాత్రమే కాకుండా సొంత డ్యామేజీలను కూడా కవర్ చేస్తుంది.

థర్డ్ పార్టీ

కాంప్రహెన్సివ్

×
×
×
×
×
×

క్లెయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు కనుక డిజిట్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినా కానీ, రెన్యువల్ చేసినా కానీ టెన్షన్ ఫ్రీగా ఉండండి. సులభమైన 3 దశల్లో మీ క్లెయిమ్ ప్రక్రియ పూర్తవుతుంది.

స్టెప్ 1

1800-258-5956 నంబర్​కు కాల్ చేయండి. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన పని లేదు.

స్టెప్ 2

మీ నమోదిత మొబైల్ నెంబర్​కు స్వీయ తనిఖీ లింక్ పంపించబడుతుంది. మీ వాహనం డ్యామేజ్ అయిన భాగాన్ని మీ స్మార్ట్​ ఫోన్​తో ఫొటో తీయండి. మేము దశలవారీగా ఏం చేయాలో మీకు తెలియజేస్తాం.

స్టెప్ 3

ఏ పద్ధతిలో మీరు మరమ్మతు చేయించుకోవాలని అనుకుంటున్నారో ఎంచుకోండి. రీయింబర్స్​మెంట్ లేదా నగదు రహిత ప్రక్రియ. ఒకవేళ మీరు నగదు రహిత విధానాన్ని ఎంచుకుంటే మా నెట్​వర్క్​ గ్యారేజీని సందర్శిస్తే సరిపోతుంది.

Report Card

డిజిట్ ఇన్సూరెన్స్ క్లెయిములు ఎంత త్వరగా సెటిల్ చేయబడతాయి?

బీమా సంస్థను మార్చాలని చూసినపుడు ఎవరికైనా సరే మనసు​లో మెదిలే మొదటి ప్రశ్న ఇదే. అలా ప్రశ్నించుకోవడం మంచిదేలెండి.

డిజిట్ క్లెయిమ్ రిపోర్ట్ కార్డ్ చదవండి.

బజాజ్ ఆటో కంపెనీ గురించి క్లుప్తంగా..

బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు 4 కారణాలు

మీ బజాజ్ బైక్​ కోసం డిజిట్ ఇన్సూరెన్స్​నే ఎందుకు ఎంచుకోవాలంటే..

మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎలా తగ్గించుకోవాలి?