హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కలిసి 2008 జూన్-జూలై మధ్య CBF స్టన్నర్ సిరీస్‌ను ప్రారంభించాయి. చివరకు హోండా స్టాండర్డ్ మోటార్‌సైకిళ్ల జాబితాలో ఈ సిరీస్ చేరింది. భారతదేశ 125 cc మోటార్‌సైక్లింగ్ చరిత్రలో బెంచ్‌మార్క్ మోడల్‌లలో హోండా CBF స్టన్నర్ ఒకటి.
హోండా బైక్ యజమాని కావడం వల్ల, అన్ని భద్రతా ఫీచర్లు బైకుకు ఉన్నప్పటికీ రిస్క్‌లు, డ్యామేజీలకు గురికావాల్సి ఉంటుందని మీరు విధిగా తెలుసుకోవాలి. అందువల్ల, హోండా CBF స్టన్నర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం, అటువంటి డ్యామేజులకు ప్రతిగా మీ బైక్‌కు బీమా చేయడం చాలా ముఖ్యం.
భారతదేశంలో పేరున్న బీమా కంపెనీలు అందించే ఆకర్షణీయమైన డీల్స్ కారణంగా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని పొందడం సౌకర్యవంతంగా, తేలికగా ఉంటుంది. భారతదేశంలో అటువంటి బీమా సంస్థల్లో డిజిట్ ఒకటి.
ఈ సెగ్మెంట్లో మీరు CBF స్టన్నర్ ఇన్సూరెన్స్, దాని ప్రయోజనాలు, డిజిట్ ఇన్సూరెన్స్ అందించే పాలసీ ప్రయోజనాల గురించి తెలుసుకుంటారు.