హెచ్ఎంఎస్ఐ (HMSI) అనేది హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్, జపాన్ యొక్క సొంత సబ్సిడరీ సంస్థ. 1999లో భారత్‌లో ఈ సంస్థ తొలి ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. వీరి ప్రధాన ఉత్పత్తి కేంద్రం హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా మనేసర్‌లో ఉంది. జపనీస్ సంస్కృతిలాగే పనితీరు, మైలేజీపరంగా అద్భుతంగా ఉంటుంది. ఆ వెంటనే ఈ కంపెనీ రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లా టపుకరాలో రెండో ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించింది.
హీరో మోటోకార్ప్ సహకారంతో భారత మార్కెట్లోకి హోండా ప్రవేశించినప్పటికీ అది 2014 తర్వాత పూర్తి స్వతంత్రంగా మారింది. ప్రస్తుతం ఇది భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ వాహన తయారీ సంస్థగా ప్రఖ్యాతి గాంచింది.
హోండా కంపెనీ అందించే కొన్ని మోడల్స్‌ను కింద పేర్కొన్నాం..
- హోండా యాక్టివా ఐ (Honda Activa i)
- హోండా యాక్టివా 5జీ (Honda Activa 5G)
- హోండా ఎక్స్–బ్లేడ్ (Honda X-Blade)
- హోండా హార్నెట్ 160ఆర్ (Honda Hornet 160R)
- హోండా సీబీఆర్ 250ఆర్ (Honda CBR 250R)
హోండా ఇటీవల కొన్ని హై–ఎండ్ మోడళ్లను కూడా పరిచయం చేసింది.
- హోండా సీబీఆర్ 300 ఆర్ (Honda CBR 300R)
- హోండా సీబీఆర్ 650ఆర్ (Honda CBR 650R)
- హోండా సీబీ 1000ఆర్ (Honda CB 1000R)
- హోండా సీబీఆర్ 1000ఆర్ఆర్ (Honda CBR 1000RR)
- హోండా గోల్డ్ వింగ్ (Honda Gold Wing)
గమనించదగిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే జాబితాలో ఉన్న చివరి మోడల్.. హోండా గోల్డ్ వింగ్.. ఒక రకమైన క్రూజర్ వాహనం. ఈ కొత్త వాహనంలో రివర్స్ గేర్‌తో పాటు ఆప్షనల్‌గా ఎయిర్-బ్యాగ్ కూడా ఉంటుంది. ఇది వారి సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం.
హోండాను ఏది పాపులర్ చేసింది?
అన్ని వర్గాలకు చెందిన కస్టమర్లలో హోండా టూ వీలర్లను ప్రఖ్యాతంగా చేసే కొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకా , హోండా ఇప్పటివరకు సాధించిన విజయాలు కంపెనీ ఏటా విడుదల చేసే అత్యుత్తమ టూవీలర్లకు నిదర్శనం.
వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం:
- గుజరాత్‌లోని విఠలాపురలోని ప్రొడక్షన్ ప్లాంట్ పూర్తిగా స్కూటర్ల తయారీకి అంకితం చేయబడింది.
- హోండా సాంకేతికత ఎంత అత్యున్నతమైనది అంటే ప్రపంచంలోని కొన్ని టూ వీలర్ వాహన తయారీదారులు మాత్రమే ఈ కంపెనీతో సరిపోలుతారు. యమహా, డుకాటి తర్వాత వస్తున్న మోటోజీపీ (MotoGP)లో అన్ని విభాగాల్లోనూ మూడో అత్యంత విజయవంతమైన తయారీదారుగా చెప్పుకోవచ్చు.
- 2004 సంవత్సరం నాటికి, హోండా తమ ఫ్యూయల్ సెల్-పవర్డ్ మోటార్‌బైక్‌ల కోసం ఒక ప్రోటోటైప్ అభివృద్ధిపరిచింది.
- సీబీఆర్ 250ఆర్ (CBR 250R), 249 సీసీ (cc) సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రూపొందించబడింది. ఇది హోండా ప్రారంభించిన చిన్న రేసింగ్ కేటగిరీ మోటార్‌బైక్.
సరిహద్దులను దాటేయడంతో ఒక కంపెనీ జనాదరణ పొందుతుంది. ఇది కంపెనీ విజయం సాధించడానికి ముందడుగు వేయడమే. హోండా స్వచ్ఛమైన ట్రాక్ రికార్డ్, టూవీలర్ వాహనాల తయారీలోనే కాకుండా ఇతర వెంచర్లలో కూడా అత్యంత గుర్తింపు పొందిన తయారీదారుల్లో ఒకటిగా నిలిచింది.
అయితే, టూ వీలర్ వాహనాల తయారీ పరిశ్రమలో ఉన్న అడ్డంకులను ఎదుర్కొని హోండా గొప్ప గొప్ప మోడల్స్‌ను తయారు చేసినప్పటికీ అవి కూడా ఇతర టూ వీలర్ల మాదిరిగానే రోడ్డు ప్రమాదాలకు గురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సొంత వాహనానికి లేదా ప్రమాదంలో మరో థర్డ్ పార్టీ వాహనానికి జరిగే డ్యామేజీల వల్ల భారీగా ఆర్థిక భారం పడుతుంది.
అలాంటి సందర్భాల్లో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి, మీరు హోండా టూ వీలర్ ఇన్పూరెన్స్ పాలసీ పొందడం మంచిది.