బహుళజాతి సంస్థ స్టెల్లాంటిస్ యాజమాన్యంలో, జీప్ అనేది యునైటెడ్ స్టేట్స్లో ఉద్భవించిన ఆటోమొబైల్ మోడల్. ప్రస్తుతం, దాని ఉత్పత్తి శ్రేణిలో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలు, క్రాస్ఓవర్ మరియు ఆఫ్-రోడ్ SUV లు ఉన్నాయి.
కంపెనీ 2016లో దాదాపు 1.4 మిలియన్ల SUVలను విక్రయించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి.
రాంగ్లర్ మరియు గ్రాండ్ చెరోకీ మోడళ్లను విడుదల చేయడం ద్వారా, జీప్ నేరుగా 2016లో భారతీయ కమ్యూటర్ మార్కెట్లోకి ప్రవేశించింది. దీనికి ముందు, జీప్ కార్లు 1960ల నుండి మహీంద్రా అండ్ మహీంద్రా లైసెన్స్‌తో ఉత్పత్తి చేయబడ్డాయి.
అలాగే, జీప్ కంపాస్ మరియు రాంగ్లర్ వంటి మోడల్‌లు భారతీయ కొనుగోలుదారులలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. డిమాండ్ కారణంగా, ఈ కంపెనీ 2021లో 11,000 యూనిట్లను విక్రయించింది.
జీప్ కార్ మోడల్‌ను కొనుగోలు చేసే ముందు, ప్రమాదం జరిగినప్పుడు దాని వల్ల కలిగే నష్టాలు మరియు డ్యామేజిల గురించి మీరు తెలుసుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకొని, మీరు జీప్ కారు ఇన్సూరెన్స్ ను పొందాలి మరియు అటువంటి నష్టాలను రిపేర్ చేయడం వల్ల తలెత్తే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలి.
మీ జీప్ కారు కోసం సురక్షితమైన ఇన్సూరెన్స్ పాలసీ రెండు రకాలుగా అందుబాటులో ఉంది- థర్డ్-పార్టీ మరియు కాంప్రహెన్సివ్. మీరు జీప్ కార్ల కోసం ప్రాథమిక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ను పరిగణించడం ద్వారా థర్డ్-పార్టీ ప్రమాదాల నుండి ఉత్పన్నమయ్యే బాధ్యతలను కవర్ చేయవచ్చు.
అదనంగా, మీరు ఆన్లైన్లో కాంప్రహెన్సివ్ జీప్ కారు ఇన్సూరెన్స్ ను కొనడం ద్వారా థర్డ్-పార్టీ మరియు సొంత కారు నష్టాలకు వ్యతిరేకంగా కవరేజ్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం మీ జీప్ కారుకు కనీసం ప్రాథమిక ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేకుంటే, జరిగిన నష్టాన్ని పూరించేందుకు ఖర్చులను మీరు మీ జేబుల నుండి భరించాలి మరియు భారీ ట్రాఫిక్ జరిమానాలను కూడా చెల్లించాలి.
జీప్ కోసం కారు ఇన్సూరెన్స్‌ని ఎంచుకునే సమయంలో, మీరు అనేక ఇన్సూరెన్స్ సంస్థలను మరియు వారి సంబంధిత ప్లాన్లను పరిగణించవచ్చు. మీరు సరైన ఎంపికను చేయడానికి , మీరు ఆయా కంపెనీ పాలసీ ప్రీమియంలు మరియు ఇతర సేవా ప్రయోజనాలకు సంబంధించి ప్లాన్లను పోల్చడాన్ని పరిగణించాలి.
ఈ విషయంలో, మీరు డిజిట్ ఇన్సూరెన్స్ ను, దాని సహేతుకమైన జీప్ కార్ ఇన్సూరెన్స్ ధర, ఆన్లైన్ క్లయిమ్ విధానం, నో క్లయిమ్ ప్రయోజనాలు మరియు అంతులేని ఇతర ఫీచర్ ల కారణంగా పరిగణించవచ్చు. కాబట్టి, మీ జీప్ కార్ ఇన్సూరెన్స్ గురించి సమాచారం తీసుకునే ముందు, మీరు డిజిట్ ఆఫర్లను పరిగణించాలనుకోవచ్చు.