US ఆటోమొబైల్ కంపెనీ అయిన జీప్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త SUVని రిలీజ్ చేసింది. జీప్ బ్రాండ్ డీలర్ షిప్ లు 2021 ఫిబ్రవరి 2 నుంచి ఈ వాహన టెస్ట్ డ్రైవ్స్ మరియు డెలివరీలను ప్రారంభించాయి.
ఈ మోడల్ కారు 3 సంవత్సరాల క్రితమే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఈ కారు ఫస్ట్ (మొదటి) మేజర్ ఫేస్ లిఫ్ట్.
2017వ సంవత్సరంలో ఇండియాలో అత్యధిక అవార్డులు పొందిన SUV మోడల్ ఇదే. 2019 బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఇండియా స్టడీ ప్రకారం.. కంపాస్ వెహికిల్ ఇండియా యొక్క అత్యంత విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్ గా నిలిచింది.
మీరు ఇప్పటికే కంపాస్ కారును కలిగి ఉన్నా లేక కంపాస్ కారు అప్ డేటెడ్ వెర్షన్ ను కొనుగోలు చేయాలని భావిస్తున్నా కానీ మీరు కంపాస్ కారు ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవడం ముఖ్యం.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం వ్యక్తులు తప్పనిసరిగా థర్డ్ పార్టీ కారు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఈ పాలసీ మన వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులు, వాహనాలకు అయిన నష్టాన్ని కవర్ చేస్తుంది.
మీరు కనుక పూర్తి కవరేజ్ ను పొందాలని అనుకున్నట్లయితే కాంప్రహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేయడం ఉత్తమం.
ఇండియాలో అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు జీప్ కంపాస్ కోసం పోటీపడుతూ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అందిస్తున్నాయి. అటువంటి ఇన్సూరెన్స్ కంపెనీల్లో డిజిట్ ఒకటి.
జీప్ కంపాస్ కు కార్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, డిజిట్ అందించే ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి గల కారణాలను కింద తెలుసుకుంటారు.