నిస్సాన్ మోటార్ కార్పొరేషన్ అనేది డిసెంబరు 1933 లో స్థాపించబడిన జపనీస్ బహుళజాతి ఆటోమొబైల్ తయారీ సంస్థ. 2013లో ప్రపంచంలోని ఆరవ-అతిపెద్ద వాహన తయారీదారుగా అవతరించింది, ఇది ఏప్రిల్ 2018 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) యొక్క అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 3,20,000 యూనిట్ల కంటే ఎక్కువ ఆల్-ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది.
ఈ తయారీ సంస్థ యొక్క భారతీయ అనుబంధ సంస్థ, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2005 లో స్థాపించబడింది. ఇది హ్యాచ్‌బ్యాక్, MUV, SUVలు మరియు సెడాన్ల శ్రేణి కారణంగా భారతీయ కొనుగోలుదారులలో శాశ్వతంగా ప్రియమైన కార్ల తయారీ కంపెనీగా మారింది.
అంతే కాకుండా, ఈ కంపెనీకి నిస్సాన్ మరియు డాట్సన్ అనే రెండు బ్రాండ్ల పోర్ట్‌ఫోలియో ఉంది. నిస్సాన్ కిక్స్, నిస్సాన్ మాగ్నైట్, డాట్సన్ గో, డాట్సన్ గో+ మరియు డాట్సన్ రెడి-గో వంటి కొన్ని ఇటీవలి మోడల్‌లు భారతీయ కమ్యూటర్ మార్కెట్లో ప్రారంభించబడ్డాయి.
నిస్సాన్ యొక్క ఇటీవలి నివేదికల ప్రకారం, ఇది భారతదేశం అంతటా ఏప్రిల్-డిసెంబర్ 2021లో దాదాపు 27,000 యూనిట్లను విక్రయించింది. మీరు నిస్సాన్ కారు యజమాని అయితే లేదా రాబోయే సంవత్సరంలో కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, ప్రమాద సమయంలో దీనివల్ల సంభవించే డ్యామేజిలు మరియు నష్టాల గురించి మీరు తెలుసుకోవాలి. అటువంటి నష్టాలను రిపేర్ చేయడం కోసం మీకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మరియు మీ ఆర్థిక భారం పెరుగుతుంది.
అయితే, మీరు ఒక ప్రసిద్ధ ఇన్సూరెన్స్ సంస్థ నుండి నిస్సాన్ కారు ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవచ్చు మరియు అటువంటి ఖర్చులకు కవరేజీని పొందవచ్చు.
భారతదేశంలోని బీమా కంపెనీలు మీ నిస్సాన్ కారు కోసం థర్డ్-పార్టీ మరియు సమగ్ర బీమా పాలసీలను అందిస్తాయి.
మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం, థర్డ్-పార్టీ బాధ్యతలతో పాటు ట్రాఫిక్ పెనాల్టీలను నివారించడానికి నిస్సాన్ కార్లకు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ను పొందడం తప్పనిసరి. అయినప్పటికీ, సొంత కారు మరియు థర్డ్-పార్టీ నష్టాలను కవర్ చేసే ఒక సంపూర్ణమైన, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం ఆచరణాత్మకమైనది.
ఈ విషయంలో, మీరు నిస్సాన్ కార్ ఇన్సూరెన్స్ ను ఆన్లైన్లో పొందేందుకు డిజిట్ వంటి ఇన్సూరెన్స్ సంస్థలను ఎంచుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ సులభమైన క్లయిమ్ ప్రాసెస్, నెట్వర్క్ గ్యారేజీల శ్రేణి, నగదు రహిత మరమ్మతులు మరియు మరిన్ని వంటి అనేక ప్రయోజనాలను అందిస్తారు. అదనంగా, వీరు ఆర్థిక బాధ్యతను తగ్గించడంలో సహాయపడే నిస్సాన్ కారు ఇన్సూరెన్స్ ను సరసమైన ధరలో అందిస్తుంది.
కాబట్టి, నిస్సాన్ కోసం కారు ఇన్సూరెన్స్ ను పొందే ముందు, మీరు డిజిట్‌ని పరిగణించి, మీ ప్రయోజనాలను పెంచుకోవచ్చు.