మీరు హోండా యాక్టివా బండిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లైతే ఇక్కడ మీకు అన్ని రకాల మోడల్ వేరియంట్లు మొదలైన అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటపుడు ఈ విషయాలను గమనించాలి.
స్కూటర్ విభాగంలో హోండా యాక్టివా ఎక్కువగా అమ్ముడుపోతోంది. హోండా మోటార్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారతదేశంలో జరుగుతున్న ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో దాదాపు 14 శాతం బైక్లు హోండా యాక్టివాలే ఉంటున్నాయి. ఒక సగటు కస్టమర్ కోరుకునే అన్ని అంశాలు ఈ స్కూటర్లో ఉన్నాయి. అందుకే భారతీయులు దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. (1)
మీరు యాక్టివాలోని ఒక మోడల్ను కొనేందుకు నిర్ణయించుకున్నాక తదుపరి దశలో యాక్టివా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. యాక్టివాలో ఉన్న అన్ని రకాల బైక్లు బీఎస్-VI (BS-VI) వేరియంట్లు కావు. కావున మీరు బండిని కొనే ముందు ఈ విషయం గమనించాలి. ఎక్కువగా బీఎస్-VI (BS-VI) రకం వాహనాలనే తీసుకొచ్చేందుకు హోండా కంపెనీ కూడా ప్రణాళికలు రచిస్తోంది.
హోండా యాక్టివాలో ఎన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ అది కూడా ప్రమాదాలకు గురవుతుంది. కావున ఈ బైక్కు కూడా టూ వీలర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం.
ఇన్సూరెన్స్ తీసుకోవడం చట్టపరంగా కూడా చాలా అవసరం. భారతీయ రోడ్ల మీద బండ్లు నడిపేందుకు కనీసం థర్డ్ పార్టీ పాలసీ అయినా ఉండాలి. లేకపోతే మీరు ట్రాఫిక్ చట్టాల ప్రకారం జరిమానా చెల్లించాల్సి వస్తుంది. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా మొదటి సారి దొరికితే రూ. 2,000, రెండో సారి కూడా పట్టుబడితే రూ. 4,000 వరకు ఫైన్ పడుతుంది.
ద్విచక్ర వాహన పాలసీలను గురించి మరింత తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగండి.
యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ ద్వారా ఎలా గరిష్ట ప్రయోజనాలు పొందొచ్చో, హోండా యాక్టివా పాలసీ గురించి మరింత తెలుసుకోండి.