థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ధర

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కోట్​ను పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

టూ వీలర్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ధరలు

బైక్ మీద మీరు నిర్లక్ష్యంగా డ్రైవిగ్ చేయడం వలన ఎప్పుడైనా థర్డ్ పార్టీ వ్యక్తులకు హాని జరిగిందా? మీకు ఇలాంటిది ఎప్పుడైనా సంభవించిందా? మీ తప్పు లేకపోయినా కానీ ఎవరైనా రోడ్ల మీద గాయపడ్డారా? ఇలా జరిగి ఉంటే మీరు తప్పనిసరిగా థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలి.

చాలా సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు వ్యక్తులకు గాయాలు చేస్తాయి లేదా వ్యక్తులు చనిపోతారు. కానీ ఇందులో భాగమైన రెండు పార్టీలు కూడా ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరిపోరు. అటువంటి సందర్భాల్లో థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కీలక పాత్ర పోషిస్తుంది. నష్టపరిహారాన్ని మోటార్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ నిర్ణయిస్తుంది.

 

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది బైక్ యొక్క ఇంజిన్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. 2019-20కి, 2022కి ఉన్న ప్రీమియం ధరల్లో వ్యత్యాసాలను గమనించండి

 

ఇంజిన్ కెపాసిటీ 2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)
75 ccని మించనివి ₹482 ₹538
75 ccని మించినవి కానీ 150 cc కన్నా తక్కువ ఉన్నవి ₹752 ₹714
150 ccని మించినవి కానీ 350 cc కన్నా తక్కువ ఉన్నవి ₹1193 ₹1366
350 ccని మించినవి ₹2323 ₹2804

కొత్త టూవీలర్లకు థర్డ్ పార్టీ ప్రీమియం (5 సంవత్సరాల సింగిల్ ప్రీమియం పాలసీ)

ఇంజిన్ కెపాసిటీ 2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)
75 ccని మించనివి ₹1,045 ₹2,901
75 ccని మించినవి కానీ 150 cc కన్నా తక్కువ ఉన్న ₹3,285 ₹3,851
150 ccని మించినవి కానీ 350 cc కన్నా తక్కువ ఉన్నవి ₹5,453 ₹7,365
350 ccని మించినవి ₹13,034 ₹15,117

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) టూవీలర్ కి ప్రీమియంలు (1 సంవత్సరం సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ కెపాసిటీ (KW) 2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)
3KWకి మించనివి ₹410 ₹457
3KWకి మించినవి కానీ 7KWకి మించనివి ₹639 ₹609
7KWకి మించివని కానీ 16KWకి మించనివి ₹1,014 ₹1,161
16KW ని మించినవి ₹1,975 ₹2,383

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) టూవీలర్ కి ప్రీమియంలు (5 సంవత్సరాల సింగిల్ ప్రీమియం పాలసీ)

వాహనం కిలోవాట్ కెపాసిటీ (KW) 2019-20కి గాను ప్రీమియం, భారతీయ రూపాయల్లో కొత్త టూవీలర్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్ (జూన్ 1, 2022 నుండి అమలు)
3KWకి మించనివి ₹888 ₹2,466
3KWకి మించినవి కానీ 7KWకి మించనివి ₹2,792 ₹3,273
7KWకి మించివని కానీ 16KWకి మించనివి ₹4,653 ₹6,260
16KW ని మించినవి ₹11,079 ₹12,849

350 CC కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై ఎలాంటి రేట్లు పెంచలేదు. ధరలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి, బైకులు, స్కూటర్లు వంటి కొత్త టూవీలర్లకు ఇన్సూరెన్స్ సంస్థలు దీర్ఘకాలిక థర్డ్ పార్టీ ప్రీమియంను వసూలు చేయడానికి అనుమతించబడతాయి.

 

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ప్రభావితం చేసే అంశాలు?

  • టూ వీలర్స్ సంఖ్య పెరగడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అందుకోసమే థర్డ్ పార్టీ ప్రీమియం ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • బైక్ ఇంజిన్ కెపాసిటీ థర్డ్ పార్టీ బైక్ ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ అవుతాయి?

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్​లో ఏమేం కవర్ కావు?

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్​లో ఏం కవర్ అవుతాయో తెలుసుకోవడంతో పాటుగా కవర్ కాని విషయాలను కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైనా క్లెయిమ్స్ చేసేటపుడు ఎటువంటి గందరగోళం లేకుండా ఉంటుంది.

 

సొంత డ్యామేజీలు

మీరు ఒకవేళ థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న సందర్భంలో సొంత డ్యామేజీలు కవర్ కావు.

 

మద్యం సేవించి వాహనం నడిపినా లేదా లైసెన్స్ లేకుండా నడిపినా

మీరు మద్యం సేవించి వాహనం నడిపినా లేదా సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా ప్రమాదం అయితే బీమా వర్తించదు.

 

సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా వాహనం నడిపితే

మీరు లెర్నర్ లైసెన్స్ కలిగి ఉండి వెనకాల సీటులో సరైన లైసెన్స్ హోల్డర్ లేకుండా మీరు వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే బీమా వర్తించదు.

 

యాడ్–ఆన్స్ కొనుగోలు చేయకపోతే

కొన్ని రకాల సందర్భాలు యాడ్-ఆన్స్​లోనే కవర్ అవుతాయి. మీరు అటువంటి విధమైన టూ వీలర్ యాడ్ ఆన్స్ కొనుగోలు చేయకపోతే ఆ పరిస్థితులు కవర్ కావు.

 

థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యం?

మోటార్ వాహనాల చట్టం ప్రకారం మీరు థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్​ను ఎందుకు కలిగి ఉండాలో ఇక్కడ ఉంది.

  • చట్టపరమైన వర్తింపు : థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ లేకుండా టూ వీలర్ యజమానులు భారతీయ రోడ్ల మీద చట్టబద్ధంగా తిరిగేందుకు అనర్హులు.(అనుమతించబడరు)

  •  అపార లయబులిటీ: ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. చాలా కేసుల్లో వ్యక్తులు థర్డ్ పార్టీ వ్యక్తులకు అయిన డ్యామేజీలకు నష్టపరిహారం చెల్లించలేరు. ఇటువంటి సందర్భంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎటువంటి డబ్బును కోల్పోకుండా ఇది కాపాడుతుంది.

మీరు కాంప్రహెన్సివ్ ప్యాకేజి పాలసీని కూడా కొనుగోలు చేయొచ్చు. అది సొంత డ్యామేజీల​తో పాటుగా థర్డ్ పార్టీ సంబంధిత లయబులిటీలను కూడా కవర్ చేస్తుంది. బైక్ యజమానుల కోసం బీమా సంస్థలు దీర్ఘకాలిక పాలసీలను అందించేందుకు కూడా ఐఆర్​డీఏ (IRDA) అనుమతించింది. మీ బైక్​కు 5 సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్ పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

 

థర్డ్ పార్టీ నష్టాలకు బైక్ యజమాని చెల్లించాల్సిన పరిస్థితులు

  • గాయాలయిన సమయంలో : గాయమైన పార్టీ (థర్డ్ పార్టీ) వైద్య ఖర్చులను కవర్ చేయమని అడగవచ్చు. ఏదైనా శారీరక వైకల్యం సంభవించినపుడు పరిహారం అడగొచ్చు. అంతేకాకుండా మీ బైక్ ప్రమాదంలొ గాయపడిన తర్వాత అతడు/ఆమె పనిచేయలేని పక్షంలో మిమ్మల్ని ఆదాయ నష్టానికి అయ్యే ఖర్చులను కూడా అడగవచ్చు. వేరొకరి తప్పు వలన మీకు గాయాలు అయినపుడు పైన పేర్కొన్న విధంగా కాంపన్సేషన్ అడిగేందుకు మీకు అధికారం ఉంటుంది.

  • మరణం సంభవించిన సందర్భంలో : మరణించిన వారిపై ఆధారపడినవారు వైద్య ఖర్చులను డిమాండ్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు ఆర్థిక నష్టానికి పరిహారం కూడా అడిగే అవకాశం ఉంటుంది.