హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) హోండా అమేజ్ ను ఏప్రిల్ 2013లో విడుదల చేసింది. ఇది 4 ట్రిమ్ స్థాయిలతో లాంచ్ చేయబడింది: E, EX, S మరియు VX, అంతే కాకుండా 2014 జనవరిలో SX అనే అడిషనల్ ట్రిమ్ లెవల్ కూడా లాంచ్ చేశారు. హోండా అమేజ్ అనేది దాని ప్రత్యర్థులైన టాటా టిగోర్, హ్యుండాయ్ ఎక్సెంట్, వోక్స్వ్యాగన్ అమియో, మారుతి బలెనో, హ్యుండాయ్ ఎలైట్ i20 మరియు ఫోర్డ్ ఆస్పైర్ మొదలైన కార్లకు తన స్టన్నింగ్ లుక్స్, కంఫర్టబుల్ రైడ్, షార్ప్ డిజైన్ తో కఠినమైన పోటీ ని ఇస్తుంది.
- 2018: టెక్ మరియు ఆటో అవార్డ్స్: సెడాన్ ఆఫ్ ది ఇయర్ హోండా - అమేజ్
- హోండా అమేజ్ అనేది 2వ జెనరేషన్ ఓవర్ డ్రైవ్ అవార్డులతో లక్ష విక్రయాలను దాటింది.
- 2014: ‘లాంగెస్ట్ డ్రైవ్ త్రూ అమేజింగ్ ఇండియా’ ద్వారా హోండా అమేజ్ అనేది గిన్నిస్ రికార్డు సాధించింది. ఒక దేశంలో కారులో సుదీర్ఘ జర్నీని చేసిన రికార్డు నమోదైంది.
హోండా కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.
హోండా అమేజ్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?
హోండా అమేజ్ కారు ఇండియాలో రూ. 5.59 లక్షలకు ప్రారంభించబడింది. కానీ ఇటీవలే కంపెనీ ధరలు పెంచింది. దీంతో ప్రారంభ ధర రూ. 5.86 లక్షలు (ఎక్స్-షోరూం) అలాగే డీజిల్ వెర్షన్ 9.72 లక్షలకు చేరుకుంది. అంతే కాకుండా ఇది ఐదు రంగులలో అందుబాటులో ఉంటుంది. వైట్ ఆర్చిడ్ పెర్ల్, మాడ్రన్ స్టీల్, రేడియంట్ రెడ్, గోల్డెన్ మెటాలిక్ బ్రౌన్, లునార్ సిల్వర్ (2019లో) ఇది కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో చాలా సరసమైనది.
అమేజ్ కారు టాప్ ఎండ్ లో ఉండే కొన్ని అద్భుతమైన ఫీచర్ల గురించి మాట్లాడుకుందాం. ఇందులో 1.5L పవర్ఫుల్ డీజిల్ మరియు 1.2L పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుంది. మైలేజ్ 19.0 నుంచి 27.4 kmpl వరకు ఇస్తుంది. (ARAI, వేరియంట్ మరియు ఇంధన రకాన్ని బట్టి), ప్రీమియం ఇంటీరియర్ డిజైన్, సూపర్ స్పేస్, విశాలమైన బూట్ స్పేస్ (డిక్కీ స్పేస్) (420 లీటర్స్), 35 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ , ఉత్తమమైన CVT గేర్ బాక్స్ (ఇప్పుడు డీజిల్ వేరియంట్లలో కూడా లభ్యం అవుతోంది), డిజిప్యాడ్ 2.0, ఎంతో ఆలోచించి డిజైన్ చేసిన టెంపరేచర్ కంట్రోల్ యూనిట్, పాడిల్ షిఫ్ట్ (సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్), లాంగ్, రిలాక్సింగ్ డ్రైవింగ్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్ కోసం క్రూయిజ్ కంట్రోల్.
ఇక్కడ ఉన్న ఫీచర్లే కాక మరిన్ని కూడా ఉంటాయి. అత్యద్భుతంగా ఉండే క్యాబిన్ స్పేస్, అద్భుతమైన బూట్ స్పేస్ (డిక్కీ స్పేస్)తో హోండా అమేజ్ అనేది ‘అమేజింగ్లీ ఇండియన్’ అనే క్యాంపెయిన్ ట్యాగ్ కు సరిగ్గా సరిపోతుంది. ఈ క్యాంపెయిన్ ట్యాగ్ లైన్ ఇండియన్స్ అందరికీ సూటబుల్ అయ్యే కార్ ఇన్సూరెన్స్ గురించి నిర్వచిస్తుంది.