హ్యుండాయ్ వెన్యూ అనేది 2019లో లాంచ్ అయింది. ఈ ఇంజిన్ డీజిల్ మరియు పెట్రోల్ రెండు వెర్షన్లను ఆఫర్ చేస్తోంది. ఇందులో డ్రైవర్ తో పాటు 5గురు కూర్చునేలా ఉండే సబ్-4 SUV. మహీంద్రా XUV300, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకీ విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ వంటి ఎన్నో రకాల కాంపాక్ట్ SUVలకు ఈ కారు పోటీనిస్తుంది.
వెన్యూ అనేది మూడు సిలిండర్ ఇంజిన్లను కలిగి ఉంటుంది. 118.35bhp@6000rpm గరిష్ట శక్తిని మరియు 171.6Nm@1500-4000rpm గరిష్ట టార్క్ ను అందిస్తుంది.
హ్యుండాయ్ వెన్యూ అనేది ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. ఇంధన రకం మరియు వేరియంట్ ఆధారంగా ఇది లీటరుకు సగటున 17.52 కిలోమీటర్ల నుంచి 23.7 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.
ఈ కారు కు బయటి భాగంలో టాప్ డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ అండ్ కార్నరింగ్ హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ ఫాగ్ లైట్స్, LED టెయిల్ లైట్స్ మొదలయినవి ఉంటాయి. హ్యుండాయ్ వెన్యూ లోపలి భాగంలో మెటల్ ఫినిషింగ్, లెదర్ ప్యాక్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, స్పోర్టీ మెటల్ పెడల్స్ వంటివి ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా వెన్యూలో రేర్ కెమెరా విత్ డైనమిక్ గైడ్ లైన్స్, హెడ్ ల్యాంప్, ఎస్కార్ట్ ఫంక్షన్, మరియు బర్గ్లర్ అలారం (దొంగతనం జరిగితే) వంటి అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇలా ఎన్నో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నప్పటికీ హ్యుండాయ్ వెన్యూ అనేక రోడ్ యాక్సిడెంట్లకు గురయ్యే చాన్స్ ఉంది. అందువల్ల ప్రొఫెషనల్ మరియు నమ్మకంగా ఉండే కార్ ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవడం చాలా అవసరం. హ్యుండాయ్ వెన్యూ కోసం డిజిట్ కార్ ఇన్సూరెన్స్ సరైన ఎంపిక.