టాటా పంచ్ కారు ఇన్సూరెన్స్

2 నిమిషాల్లో టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెక్ చేసుకోండి

Third-party premium has changed from 1st June. Renew now

source

స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ లిమిటెడ్ తన మైక్రో SUV పంచ్ ను 2021 పండుగ సీజన్ లో రిలీజ్ చేసింది. స్వదేశీ వాహన తయారీ సంస్థ పంచ్ కారును అనేక వేరియంట్లలో అందిస్తుంది.

కావున మీరు ఈ మోడల్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే సంభవించే డ్యామేజ్ల నుంచి ఆర్థికంగా గట్టెక్కేందుకు టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి.

మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇండియన్ కారు ఓనర్లందరూ థర్డ్ పార్టీ డ్యామేజ్ కాస్ట్ లను నివారించేందుకు థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం మ్యాండేటరీ. చాలా మంది కారు ఓనర్లు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇష్టపడతారు. ఇది థర్డ్ పార్టీ లయబిలిటీలతో పాటు సొంత డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది.

అతి తక్కువ ధరలో వచ్చే టాటా పంచ్ ఇన్సూరెన్స్ కోసం దేశంలో లీడింగ్ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ అయిన డిజిట్ ను పరిగణలోనికి తీసుకోవచ్చు.

 

టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర

రిజిస్ట్రేషన్ తేదీ ప్రీమియం (కాంప్రహెన్సివ్ పాలసీలకు)
జూలై-2018 5,306
జూలై-2017 5,008
జూలై-2016 4,710

**నిరాకరణ: టాటా టియాగో మోడల్ HTP పెట్రోల్ 1199 కోసం ప్రీమియం లెక్కింపు జరుగుతోంది. జీఎస్టీ మినహాయించబడింది.

సిటీ- బెంగళూరు, పాలసీ గడువు ముగిసే తేదీ - 31 జూలై, NCB - 50%, ఎటువంటి యాడ్ ఆన్స్ లేవు. ప్రీమియం లెక్కింపు అనేది జూలై-2020లో జరిగింది. పైన మీ వెహికిల్ డిటేయిల్స్ నమోదు చేసే ముందు ఫైనల్ ప్రీమియం ను ఒకసారి చెక్ చేయండి.

టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ లో ఏం ఏం కవర్ అవుతాయి

డిజిట్ అందించే టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ని మీరు ఎందుకు కొనుగోలు చేయాలి?

టాటా పంచ్ కొరకు కారు ఇన్సూరెన్స్ ప్లాన్లు

థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్

యాక్సిడెంట్ వల్ల సొంత కారుకు కలిగిన డ్యామేజ్లు/నష్టాలు

×

అగ్ని వల్ల సొంత కారుకు జరిగిన డ్యామేజ్లు/నష్టాలు

×

ప్రకృతి విపత్తుల వల్ల సొంత కారుకు కలిగిన డ్యామేజ్లు/నష్టాలు

×

థర్డ్ పార్టీ వాహనానికి జరిగిన డ్యామేజ్లు

×

థర్డ్ పార్టీ ఆస్తికి కలిగిన డ్యామేజ్లు

×

వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్

×

థర్డ్ పార్టీ పర్సన్ కు అయిన గాయాలు లేదా సంభవించిన మరణం

×

మీ కారు దొంగిలించబడితే

×

డోర్స్టెప్ పికప్ మరియు డ్రాప్

×

మీ వాహన IDVని అనుకూలీకరించుకోండి

×

కస్టమైజ్డ్ యాడ్ ఆన్స్ వల్ల అదనపు రక్షణ

×
Get Quote Get Quote

కాంప్రహెన్సివ్ మరియు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మధ్య తేడాల గురించి మరింత తెలుసుకోండి

క్లయిమ్ ఎలా ఫైల్ చేయాలి?

మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూవల్ చేసిన తర్వాత మేము 3 స్టెప్ ఫుల్లీ డిజిటల్ క్లయిమ్ ప్రాసెస్ కలిగి ఉంటాం. దాని వల్ల మీరు టెన్షన్ ఫ్రీగా జీవించొచ్చు!

స్టెప్ 1

1800-258-5956 నెంబర్ పై కాల్ చేయండి. ఎటువంటి ఫామ్ లు నింపాల్సిన అవసరం లేదు

స్టెప్ 2

స్వీయ పరిశీలన కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు లింక్ పొందండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ వాహనం నుంచి మీ డ్యామేజ్లను షూట్ చేయండి.

స్టెప్ 3

మీరు మా గ్యారేజీ నెట్‌వర్క్ ద్వారా రీయింబర్స్‌మెంట్ లేదా క్యాష్ లెస్ కావాలో ఎంచుకోండి.

డిజిట్ ఇన్సూరెన్స్ క్లయిమ్ లు ఎంత తొందరగా సెటిల్ అవుతాయి? మీ ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటపుడు మీ మనసులో వచ్చే మొదటి ప్రశ్న ఇది. మంచిది మీరదే చేస్తున్నారు! డిజిట్ క్లయిమ్ రిపోర్ట్ కార్డును చదవండి

మీరు డిజిట్ అందించే టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ ను ఎంచుకోవడానికి గల కారణాలు?

డిజిట్ వంటి విశ్వసనీయమైన ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్ ఇన్సూరెన్స్ ను కొనుగోలు చేసేందుకు లేదా రెన్యూవల్ చేసేందుకు ఎటువంటి అవాంతరాలు లేని ప్రక్రియను అందిస్తుంది.

ఈ కింద పేర్కొన్న కారణాలు ఈ ఇన్సూరర్ ను (బీమా సంస్థ) ఇండియాలో ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీగా మారుస్తున్నాయి.

  1. అధిక క్లయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను అందిస్తుంది - ఎక్కువ క్లయిమ్ లు సెటిల్ చేయడం ద్వారా డిజిట్ దాని కస్టమర్లకు హై క్లయిమ్ సెటిల్‌మెంట్ రేషియో పొందేలా చూస్తుంది. (అంటే లేవనెత్తిన క్లయిమ్ ల సంఖ్యకు సెటిల్ చేసిన క్లయిమ్ ల సంఖ్యకు మధ్య నిష్పత్తి). అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఇది క్విక్ సెటిల్‌మెంట్ ను అందిస్తుంది.

  1. డిజిటలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టంను విస్తరిస్తుంది - టాటా పంచ్ కారు ఇన్సూరెన్స్ లో డిజిట్ తీసుకువచ్చిన 100 శాతం డిజిటలైజ్డ్ ప్రాసెసింగ్ వలన వ్యక్తుల సమయం ఆదా అవుతోంది. ఇది ప్రాసెస్ ను మరింత సులభం చేసేందుకు స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ తనిఖీ పద్ధతిని కూడా అందిస్తోంది.

నోట్ : ఈ ప్రాసెసింగ్ ను వేగవంతం చేసేందుకు పాలసీహోల్డర్స్ తప్పనిసరిగా డ్యామేజ్ కు సంబంధించిన చిత్రాలను పంపాల్సి ఉంటుంది.

  1. IDV కస్టమైజేషన్ కు ఎంపికలు - ఇన్సూరెన్స్ పాలసీ నుంచి డిప్రిసియేషన్ కాస్ట్ ను తీసేసిన తర్వాత డిజిట్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) ని సెట్ చేస్తుంది. అయినప్పటికీ తన కస్టమర్ల రిక్వైర్మెంట్స్ కు అనుగుణంగా డిజిట్ తమ IDVని సెట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. పాలసీహోల్డర్స్ కార్లు దొంగిలించబడినా లేక రిపేర్ చేయలేని విధంగా డ్యామేజ్ అయినా కానీ ఈ విధంగా తగిన పరిహారం పొందొచ్చు.

  1. యాడ్ ఆన్ ప్రయోజనాలను అందిస్తుంది - పంచ్ కార్ ఇన్సూరెన్స్ ధరలో కొంత మొత్తంలో పెరుగుదలతో డిజిట్ అనేక యాడ్ ఆన్ ప్రయోజనాలు అందిస్తుంది. వాటిలో కొన్ని -

  • జీరో డిప్రిషియేషన్ కవర్
  • రోడ్ సైడ్ అసిస్టెన్స్
  • ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్షన్
  • రిటర్న్ టూ ఇన్వాయిస్
  • కన్జూమబుల్ కవర్ తో పాటు మరిన్ని
  1. ఎంచుకునేందుకు 5800 నెట్‌వర్క్ గ్యారేజీలు - మీరు దేశంలో ఎక్కడ ఉన్నా ప్రతి చోటా మా డిజిట్ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉంటాయి. మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ నెట్ వర్క్ వర్క్ స్టేషన్లు క్యాష్ లెస్ రిపేర్లను అందిస్తాయి.

  1. డోర్స్టెప్ పికప్, డ్రాప్ రిపేర్ ఫెసిలిటీ - మీ పంచ్ కారు సమీపంలో ఉన్న డిజిట్ నెట్‌వర్క్ గ్యారేజీకి నడపబడే పరిస్థితిలో లేకుంటే డోర్స్టెప్ పికప్ మరియు డ్రాప్ సర్వీసులను ఎంచుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండండి.

  1. కస్టమర్ సపోర్ట్ - యాక్సిడెంట్లు ఊహించని సమయంలోనే జరుగుతాయి. అందువల్ల క్లిష్ట సమయాల్లో కూడా మీకు తోడుగా ఉండేందుకు డిజిట్ 24X7 కస్టమర్ సర్వీసులను అందిస్తోంది. టాటా పంచ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ లేదా కొనుగోలు విధానాలకు సంబంధించిన ప్రశ్నలకు ఎగ్జిక్యూటివ్ లు సంతోషంగా సమాధానం చెబుతారు.

డిజిట్ అందించే కాస్ట్ ఎఫెక్టివ్ టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ అన్ని రకాల ఫీచర్లను కవర్ చేస్తుంది. అలాగే ఈ పాలసీని తీసుకున్న కస్టమర్లకు 100శాతం సంతృప్తిని అందిస్తుంది.

అయినప్పటికీ కొన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసి వాటి ఫీచర్లను కంపేర్ చేయండి. అలా చేసి మనకు కలిగే ప్రయోజనాలు ఎందులో ఎక్కువగా ఉంటే మరియు ఏది మన రిక్వైర్మెంట్స్ ను ఎక్కువగా తీరిస్తే దానిని ఎంచుకోవాలి.

టాటా పంచ్ ఇన్సూరెన్స్ ను కొనడం/రెన్యూవల్ చేయడం ఎందుకు ముఖ్యం?

టాటా పంచ్ ఇన్సూరెన్స్ కాస్ట్ లను భరించడం అనేది భారీ పెనాల్టీలు, డ్యామేజ్ ఎక్స్పెన్స్ భరించడం కంటే చాలా సరసమైనది.

కానీ ఎందుకు? చదువుతూనే ఉండండి.

  1. ఆర్థిక లయబిలిటీలకు వ్యతిరేకంగా రక్షణ - టాటా పంచ్ ఇన్సూరెన్స్ పాలసీ మొదటి లక్ష్యం ఏమిటంటే ఒక వేళ యాక్సిడెంట్ జరిగినపుడు ఉచితంగా రిపేర్లు లేదా రీయింబర్స్‌మెంట్ సమకూర్చడం. టాటా పంచ్ అనేది ఇంకా మార్కెట్లలోకి రానందున రిపేర్ మరియు స్పేర్ పార్ట్స్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం అనేది స్మార్ట్ మూవ్.

  1. థర్డ్ పార్టీ లయబిలిటీల నుంచి రక్షణ - థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది థర్డ్ పార్టీ డ్యామేజ్ లకు కవరేజ్ అందిస్తుందని నిర్దారిస్తుంది. అది వ్యక్తి లేదా ఆస్తి కానీ. మీ కారు వలన థర్డ్ పార్టీ ఆస్తికి లేదా వారికి జరిగిన ఎక్స్పెన్స్ ను ఈ పాలసీ కవర్ చేస్తుంది.

  1. కాంప్రహెన్సివ్ కవర్ తో అదనపు రక్షణ - టాటా పంచ్ కోసం వ్యక్తులు కాంప్రహెన్సివ్ కవర్ ను కూడా ఎంచుకోవచ్చు. సొంత కారు డ్యామేజ్ మరియు థర్డ్ పార్టీ లయబిలిటీ ల నుంచి మాత్రమే కాకుండా ఈ పాలసీ అగ్ని, దొంగతనం, మానవ నిర్మాత విపత్తులు, ప్రకృతి విపత్తులు, విధ్వంసం వల్ల కలిగే నష్టాల నుంచి కవర్ చేస్తుంది.

  1. పెనాల్టీలకు వ్యతిరేకంగా రక్షణ - కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కారు ఓనర్లను భారీ జరిమానాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ జప్తు నుంచి కాపాడుతుంది. మోటారు వాహన చట్టం 2019 ప్రకారం సరైన ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే ప్రతి ఇండియన్ కారు ఓనర్ రూ. 2000 ఫైన్ పే చేయడం లేదా 3 నెలల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ అనేది ఫస్ట్ టైమ్ నేరం చేసిన వారికి మాత్రమే. ఒక వేళ ఇదే నేరం రెండో సారి రిపీట్ అయితే వారికి రూ. 4000 ఫైన్ లేదా 3 నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

  1. నో క్లయిమ్ బోనస్ ప్రయోజనాలు - కార్ ఇన్సూరెన్స్ పాలసీహోల్డర్స్ వారి టాటా పంచ్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూవల్ చేయించుకుంటే నో క్లయిమ్ బోనస్ పొందేందుకు అర్హులు అవుతారు. క్లయిమ్ చేయని ప్రతి సంవత్సరానికి పంచ్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ధర మీద డిస్కౌంట్ పొందొచ్చు.

డిజిట్ వంటి ప్రఖ్యాత ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు డ్యామేజ్ రిపేర్లు, థర్డ్ పార్టీ లాసెస్ మరియు ఇతర కారణాలకు ఆర్థిక కవరేజీని నిర్దారిస్తారు. ఇది మాత్రమే కాకుండా టాటా పంచ్ కోసం డిజిట్ అందించే కార్ ఇన్సూరెన్స్ దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని మరియు ఇతర వాటి వల్ల జరిగే డ్యామేజ్లను కూడా కవర్ చేస్తుంది.

టాటా పంచ్ కారు గురించి మరిన్ని విషయాలు

సరికొత్త టాటా మోడల్ డిజైన్ మరియు టెక్నాలజీని ప్రతిబింబిస్తుంది. నెక్ట్స్ జనరేషన్ కోసం డిజైన్ చేయబడిన టాటా పంచ్ కారు రగ్గ్‌డ్ యుటిలిటీ మరియు స్పోర్టింగ్ డైనమిక్స్ కలిగి ఉంటుంది.

టాటా పంచ్ లో ఉండే ఫీచర్లు :

  • ఈ మినీ SUVలో స్ల్పిట్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్, సింగిల్ స్లాట్ బ్లాక్ గ్రిల్ మరియు బ్లాక్ సరౌండ్స్‌తో కూడిన ఫాగ్ లైట్స్ ఉంటాయి.
  • పంచ్ లో ఉన్న ఇతర డిజైన్ హైలెట్స్ C-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్, కాంట్రాక్టింగ్ షేడ్స్ యొక్క ORVMలు, స్వ్కేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చ్ లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ కవరింగ్.
  • ఇది ఫస్ట్ హిల్ స్టార్ట్ అసిస్ట్ (సహాయం) మరియు హిల్ డీసెంట్ కంట్రోల్ తో వస్తుంది.
  • ఇది 1198 cc పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది కేవలం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • ఈ 5-సీట్ల SUVలో ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ లు, ABS తో కూడిన EBD రియర్ పార్కింగ్ అసిస్టెన్స్ ఉంటుంది.
  • టాటా పంచ్ (HBX) 7 అంగుళాల టచ్ స్క్రీన్, సెమీ డిజిటల్ క్లస్టర్ మరియు ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్ సిస్టంను కూడా కలిగి ఉంటుంది.

ఇటువంటి ఎన్నో రకాల హైటెక్ ఫీచర్లు ఉన్నా, కానీ టాటా పంచ్ కూడా ఇతర మోడల్ కార్ల మాదిరిగానే యాక్సిడెంట్లకు గురవుతుంది. అందువల్ల టాటా పంచ్ ప్రమాదాల వల్ల అయిన ఎక్స్పెన్స్ ల నుంచి కవర్ చేసుకునేందుకు ఇన్సూరెన్స్ తప్పనిసరి.

టాటా పంచ్ వేరియంట్లు మరియు ఎక్స్-షోరూం ధర

వేరియంట్లు ఎక్స్ షో రూమ్ ధర (నగరాన్ని బట్టి ధరల్లో చేంజ్ ఉండొచ్చు)
పంచ్ XE రూ. 5.50 లక్షలు

ఇండియాలో టాటా పంచ్ కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నా టాటా పంచ్ కారు వేరొకరు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురైతే డిజిట్ నష్టాలను కవర్ చేస్తుందా?

అవును. ప్రమాదానికి గురైనపుడు మీ టాటా పంచ్ ను ఎవరు నడుపుతున్నప్పటికీ డిజిట్ నష్టాలకు ఆర్థిక కవరేజ్ అందిస్తుంది. అయితే అటువంటి సమయంలో డ్రైవర్ వ్యాలిడ్ లైసెన్స్ ను కలిగి ఉండకపోతే డిజిట్ ఎటువంటి ఎక్స్పెన్స్ లను భరించదు.

నా టాటా పంచ్ టైర్లకు జరిగిన డ్యామేజ్లకు నేను ఏదైనా నష్టపరిహారం అందుకుంటానా?

ప్రమాదం కారణంగా టైర్లు పాడైపోయినపుడు స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ నష్టపరిహారం అందిస్తుంది. అయితే డిజిట్ టైర్ ప్రొటెక్ట్ కవర్ వంటి యాడ్ ఆన్ పాలసీలను కూడా అందిస్తోంది. వీటిని మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు తీసుకోవచ్చు. ఇది మీ టాటా పంచ్ టైర్లకు ఇతర సందర్భాలలో సంభవించే డ్యామేజ్ల నుంచి కూడా పరిహారం అందిస్తుంది.