బజాజ్ పల్సర్ 150/160/200/220 బైక్ ఇన్సూరెన్స్ ధర & ఆన్లైన్ రెన్యూవల్
బజాజ్ పల్సర్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? మీరు టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే ముందు మీ బైక్‌ను ఏది పాపులర్ చేస్తుందో.. ఏ ఫీచర్లు అలా చేస్తాయో వాటి గురించి తెలుసుకోండి!
మన్నిక, ఆర్థిక స్థోమత, నాణ్యత అనే మూడు విషయాల్లో బజాజ్ వాహనాన్ని కొనేటప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీలో పల్సర్ రేంజ్ చాాలా పాపులర్. ఇది స్టైల్, స్పోర్టీనెస్, కంఫర్ట్ ను సమతూల్యం చేస్తుంది.
ఇతర స్పోర్ట్ బైక్‌ల కంటే సరసమైన ధరల్లోనే లభించినప్పటికీ, పల్సర్‌ను కొనడం అంటే గణనీమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడమే. కాబట్టి బైక్‌ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి బజాజ్ పల్సర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
పల్సర్ ఇన్సూరెన్స్ కొనడం వల్ల మీ ఆర్థిక పరిస్థితిని ఊహించని ఖర్చుల నుంచి కాపాడుకోవడమే కాకుండా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనడంలో సాయపడుతుంది. మోటార్ వాహనాల చట్టం–1988 ప్రకారం ఇక్కడి రోడ్లపై తిరిగే అన్ని వెహికిల్స్ చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ కవరేజీ కలిగి ఉండాలి. ఒకవేళ విఫలమైతే ట్రాఫిక్ జరిమానా రూ. 2 వేలు మరియు తిరిగి మళ్లీ చేస్తే రూ. 4 వేల వరకు ఉంటుంది.
కానీ, ఒక్కసారి ఆగండి!
మీరు బైక్ ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆందోళన చెందడానికి ముందు బజాజ్ పల్సర్ గురించి కొంచెం తెలుసుకుందాం.