ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్జీతో లభించే ఏకైక MPV (మల్టీ పర్పస్ వెహికిల్) పవర్ఫుల్ లుక్, బోల్డ్గా ఉండే ఎర్టిగా వినియోగదారుల మనసుల్ని దోచుకుంది. అంతే కాకుండా నెం.1 MPV (మల్టీ పర్పస్ వెహికిల్)గా నిలిచింది. CNG ఇంజిన్ తో పని చేసే ఎర్టిగాలో ఫ్యూయల్ ఎకానమీ, అధునాతన టెక్నాలజీ ఉన్నాయి. ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇది అన్ని వర్గాల వినియోగదారుల మనసులను గెలుచుకుంది. 2019 ఆటోకార్ అవార్డ్స్ లో మారుతి సుజుకి ఎర్టిగా ‘కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకుంది.
మీరు ఎందుకు మారుతి సుజుకి ఎర్టిగా కొనుగోలు చేయాలి?
నెక్ట్స్ జెనరేషన్ ఎర్టిగా మూడు ఇంజిన్ ఆప్షన్ లతో వస్తుంది: ద ఆల్ న్యూ DDis 225, K15 స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ మరియు కొత్తగా ఫిట్ చేయబడిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ S-CNG ఇంజిన్ తో ఉంటాయి. కేవలం ఇది మాత్రమే కాదు.. ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, థర్డ్ రో రిక్లైనర్ సీట్స్, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్, మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, 3డీ టెయిల్ ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఎర్టిగా 4 వేరియంట్లలో మీకు లభిస్తుంది: L, V, Z మరియు Z+.ఈ 4 వేరియంట్లలో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది కేవలం V మరియు Z వేరియంట్స్ లోని పెట్రోల్ ఇంజిన్ లోనే అందుబాటులో ఉంటుంది.
మీ భద్రత కోసం ఎర్టిగాలో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, బజ్జర్ తో కూడిన సీట్ బెల్ట్ రిమైండర్ ల్యాంప్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మొదలైనవి ఉంటాయి.
దీని భద్రత, డిజైన్, స్టైల్, స్పేస్, పర్ఫామెన్స్ అనేవి వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఇది ఎక్కువగా ఉండే ఇంటీరియర్ స్పేస్తో డిజైన్ చేయబడింది. అంతే కాకుండా ఇందులో వెల్ పర్ఫామింగ్ ఇంజిన్ ఉంటుంది.
ఎర్టిగా అనేది పట్టణాల్లో నివసించే కుటుంబాల కోసం తయారు చేయబడింది. ఎవరైతే మల్టీపర్పస్ వెహికిల్ కొనుగోలు చేద్దామని చూస్తున్నారో మారుతి సుజుకి ఎర్టిగా ద్వారా వారిని కంపెనీ సాటిస్ఫై చేసింది.
తనిఖీ: మారుతి కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.