ఇతర పరిశ్రమలతో పోల్చుకుంటే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఉత్పత్తులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అలానే ప్రీమియం కార్ సెల్లార్ మారుతి సుజుకి చేసిన ఒక ఆవిష్కరణ ఇగ్నిస్. ఈ కారు 13వ ఎడిషన్ NDTV కార్ అండ్ బైక్ అవార్డ్ గెలుచుకుంది.
ప్రయాణికుల భద్రత కోసం మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది ఎఫెక్టివ్ కంట్రోల్ టెక్నాలజీ ప్లాట్.ఫామ్ ద్వారా తయారు చేయబడింది. ఇది 1000+ క్యూబిక్ కెపాసిటీతో ఉండే కారు. ఇది ఎంతో అట్రాక్టివ్ ఉంటూ ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తుంది.
20+ మోడల్స్ లో పట్టణ ప్రాంత ప్రజలకు ఉన్న మరో మోడల్ మారుతి సుజుకి ఇగ్నిస్. దీని 4 వేరియంట్లు పెట్రోల్/డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా వీటి ధర కూడా రూ. 4.79 లక్షల నుంచి రూ. 7.14 లక్షల మధ్య ఉంది. ఈ కారులో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఇది లీటర్ ఇంధనానికి 20.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
మీరు మారుతి సుజుకి ఇగ్నిస్ ను ఎందుకు కొనుగోలు చేయాలి?
మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది సిగ్మా, డెల్టా, జెటా, మరియు ఆల్ఫా వేరియంట్లతో కూడిన కాంపాక్ట్ కారు. ఈ అన్ని వేరియంట్లలో అధునాతన ఫీచర్లయిన ఎయిర్ బ్యాగులు, ABS, హెడ్ బీమ్ అడ్జస్టర్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్స్ అయిన ఆల్ఫా మరియు జెటాలలో రియర్ (వెనకాల వైపు) వైపర్స్, హలోజెన్స్, ఫ్రంట్ ఫాగ్ లైట్లు కూడా ఉంటాయి.
కస్టమర్‌కు మెరుగైన సౌలభ్యం అందించడం కోసం ఈ వేరియంట్లలో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, రియర్ పార్కింగ్ సెన్సార్, స్టార్ మరియు స్టాప్ కోసం పుష్ బటన్, హైట్ అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు వంటివి ఉంటాయి. మారుతి సుజుకి ఇగ్నిస్ అనేది అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న కొత్త యుగపు కారు. అంతే కాకుండా ఇంధనం, లైట్లు, డోర్స్, సీట్ బెల్టు వంటి విషయాల్లో మీకు అలారం కూడా వస్తుంది. మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది.
మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. అంతే కాకుండా కీలెస్ ఎంట్రీ కూడా ఇందులో ఉంటుంది. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి.
చెక్: మారుతి కార్ ఇన్సూరెన్స్ గురించి మరింత తెలుసుకోండి.