కార్‌ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌

2 నిమిషాల్లో కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం పొందండి.

Third-party premium has changed from 1st June. Renew now

కార్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌

మీ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కోట్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్‌ టూల్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్‌. దీనికి మీరు చేయాల్సిందల్లా కార్ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయడమే. ఆ వెంటనే కార్‌ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్ ప్రీమియం కోట్‌ జనరేట్‌ చేస్తుంది. దీనికి మీరు మీకు నచ్చిన యాడ్‌-ఆన్‌ కవర్స్‌, మీ NCB ని చేర్చి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

కార్‌ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించడం ఎలా?

Digit కార్‌ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించి మీ కారుకు తగిన ఇన్సూరెన్స్‌ పొందడం ఎలాగో స్టెప్​ల వారీగా వివరించాం!

స్టెప్ 1

మీ కార్ మేక్​, మోడల్‌, వేరియంట్‌, రిజిస్ట్రేషన్‌ తేదీ, మీ నగరం పేరు ఎంటర్ చేయండి.

స్టెప్ 2

‘Get Quote’ పై క్లిక్‌ చేయండి & మీ ప్లాన్‌ ఎంచుకోండి.

స్టెప్ 3

థర్డ్‌ పార్టీ లయబిలిటీ లేదా కాంప్రహెన్సివ్‌ ప్యాకేజీ నుంచి మీకు కావాల్సింది ఎంచుకోండి.

స్టెప్ 4

మీ గత ఇన్సూరెన్స్‌ పాలసీ గురించి మాకు చెప్పండి – ఎక్స్‌పైరీ తేదీ, చేసిన క్లెయిమ్స్‌, పొందిన నో క్లెయిమ్​ బోనస్‌.

స్టెప్ 5

లోడ్‌ అయిన పేజీలో దిగువ భాగంలో కుడి వైపున మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను చూడవచ్చు.

స్టెప్ 6

మీరు స్టాండర్డ్‌/కాంప్రహెన్సివ్‌ ప్లాన్‌ ఎంచుకున్నట్టు అయితే, మీరు మీ IDV ని సెట్‌ చేసుకొని, జీరో డిప్రిషియేషన్‌, రిటర్న్‌ టు ఇన్వాయిస్‌, గేర్‌ & ఇంజన్‌ ప్రొటెక్షన్‌, ఇంకా చాలా యాడ్​–ఆన్స్​ నుంచి మీకు నచ్చిన వాటిని ఎంచుకొని మీ ప్లాన్​ను మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు.

స్టెప్ 7

ఇప్పుడు మీరు మీ కారు యొక్క తుది ఇన్సూరెన్స్‌ ప్రీమియం అమౌంట్​ను పేజీ కుడి వైపున చూడవచ్చు.

కార్‌ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌తో ప్రయోజనాలు

సరైన IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) -  మీ కార్ మేక్​, మోడల్‌, వయస్సుకు తగినట్టుగా మీరు మీ IDVని అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. సరైన IDV ఉన్నప్పుడు, ఒకవేళ మీ కారుకు పూర్తి నష్టం వాటిల్లినా లేదా దొంగతనానికి గురైనా మీరు మీ కారుకు సరైన మార్కెట్‌ విలువ పొందగలుగుతారు. నష్టాలబారిన పడకుండా కాపాడుకోగలుగుతారు.

సరైన యాడ్‌-ఆన్స్‌-  సరైన యాడ్‌–ఆన్స్‌తో కూడిన కార్ ఇన్సూరెన్స్‌ పాలసీ కలిగి ఉండటం అంటే వర్షంలో తడవకుండా సంపూర్ణమైన రక్షణ ఇచ్చే గొడుగు కలిగి ఉండటం లాంటిది. కానీ, చాలా మంది ప్రీమియం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో యాడ్‌–ఆన్‌ కవర్స్‌ తీసుకోరు. కార్ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించి మీరు వేర్వేరు కార్‌ ఇన్సూరెన్స్‌ యాడ్‌ ఆన్స్‌ చేర్చి ప్రీమియంలో పెరుగుదలను చూసుకొని మీకు నచ్చిన సరైన మిక్స్‌తో కూడిన యాడ్‌-ఆన్స్ ఎంచుకోవచ్చు.

సరైన ప్రీమియం – మీరు క్యాలుక్యులేటర్‌ను ఉపయోగిస్తున్నది ప్రీమియం ఎంతవుతుందని తెలుసుకునేందుకే అనుకోండి. క్యాలుక్యులేటర్ ద్వారా మీరు వేర్వేరు కార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కోట్స్‌ను పోల్చవచ్చు. ఇది మీకు సరైన ధరతో కూడిన బెస్ట్ ప్లాన్​ను ఎంచుకునేందుకు సాయపడుతుంది.

కార్‌ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్​ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యం?

ఏదో ఒక కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అని గుడ్డిగా వెళ్లాలా లేదా  సొంతంగా మీరే కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం లెక్కించి తగిన నిర్ణయం తీసుకోవాలా అనే విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? మీరు రెండోదే ఎంచుకోవాలి. ఎందుకు అలా ఎంచుకోవాలి?  కార్ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్ ఎందుకు ఉపయోగించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ధర తక్కువ, మీ డబ్బు ఆదా చేస్తుంది

వేర్వేరు కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను పోల్చేందుకు కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం క్యాలుక్యులేటర్ మీకు సాయపడుతుంది. తద్వారా మీరు మీ కారుకు తక్కువ ధరతో కూడిన ప్లాన్​ ఎంచుకునేందుకు వీలు కలుగుతుంది.

కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించుకోండి

కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఉపయోగించడం ద్వారా కొన్ని మార్పులు చేసుకుంటే మీ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో పెరుగుదల, తగ్గుదల ఎలా చోటుచేసుకుంటుందో మీరు గమనించవచ్చు. తదనుగుణంగా మీరు రకరకాల ఆప్షన్స్​ను ప్రయత్నించి మీకు ఏది తగినదో ఎంచుకోవచ్చు.

సరైన సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడంలో మీకు సాయం చేస్తుంది

కారు మీది కాబట్టి దాని సంరక్షణ కోసం తగిన నిర్ణయం మీరే తీసుకోవాల్సి ఉంటుంది. మీ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ఎలా నిర్ధారిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు కార్ ఇన్సూరెన్స్‌ క్యాలుక్యులేటర్ మీకు సాయపడుతుంది.

కొత్త & పాత కార్లకు ఇన్సూరెన్స్‌ ప్రీమియం లెక్కింపు

కొత్త కార్లకు కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌

మీ కార్ ఇన్సూరెన్స్‌ పాలసీలో ప్రీమియం అనేది మీ కారు వయస్సుపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాత కారుతో పోల్చితే  కొత్త కారుకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉండవచ్చు. మీది సరికొత్త కారు కాబట్టి దాని IDV,  ఇన్సూర్‌ చేసే మొత్తం కూడా ఎక్కువుంటుందని గుర్తుంచుకోవాలి.

మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్​ను ఉపయోగించి మీరు ఎంచుకునే రకరకాల కాంబినేషన్లను బట్టి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత మొత్తం మారుతుందో చూసుకోవచ్చు.

పాత కార్లకు కార్ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌

మీ దగ్గర పాత కార్ ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రీమియం  కొత్త కారుతో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం అనేది చాలా మటుకు కారు వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

అంతే కాదు, 5 ఏళ్లకు పైబడిన పాత కారుకు కొన్ని యాడ్‌–ఆన్స్‌ అంటే జీరో డిప్రిషియేషన్‌ కవర్, రిటర్న్‌ టు ఇన్వాయిస్‌ కవర్‌ వంటివి చేర్చడం కుదరదు. ఈ కారణంగా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.

భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ రకాలు

కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్

కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ మీ కారుకు 360–డిగ్రీల కవరేజ్‌ అందించే ఒక ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. మీ కారణంగా థర్డ్‌ పార్టీలకు అయ్యే డ్యామేజీలతో పాటు థర్డ్‌ పార్టీల కారణంగా సంభవించే నష్టాల నుంచి కూడా ఇది రక్షిస్తుంది. ఇందులో అనేక యాడ్‌–ఆన్‌ కవర్స్‌ కూడా ఉంటాయి. కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే మీ కారుకు మీకు నచ్చినచ్చుగా ఉండే ఇన్సూరెన్స్ ప్లాన్​ను ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ విషయంలో మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం క్యాలుక్యులేటర్‌. దీని ద్వారా మీరు కారుకు కావాల్సిన వేర్వేరు యాడ్‌–ఆన్స్​ను ప్రయత్నించవచ్చు. దీని ద్వారా సరైన నిర్ణయాన్ని సులభంగా తీసుకోవచ్చు.

కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంకు సంబంధించిన ముఖ్యమైన మరిన్ని అంశాలు చదవండి.

సొంత డ్యామేజ్​లు

ఈ కవరేజ్‌ అన్ని కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ పాలసీల్లో ఉంటుంది. మీ సొంత కారుకు కలిగిన డ్యామేజ్​లు, నష్టాలను ఇది కవర్‌ చేస్తుంది. ప్రమాదం లేదా ఏదైనా ప్రకృతి విపత్తు వంటి వాటి వలన కలిగే నష్టాలను ఇది కవర్ చేస్తుంది. ఈ కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధర అనేది కారు మేక్​, మోడల్‌, వయస్సుతో పాటు మీరు డ్రైవ్‌ చేసే నగరాన్ని బట్టి ఉంటుంది.

థర్డ్‌ పార్టీలకయ్యే డ్యామేజ్​లు

ఇది చట్టపరంగా తప్పనిసరిగా ఉండాలి. ఇది కాంప్రహెన్సివ్‌ కార్‌ ఇన్సూరెన్స్ పాలసీ, థర్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ రెండింట్లోనూ ఉంటుంది. థర్డ్‌ పార్టీ వ్యక్తి, వాహనం లేదా ప్రాపర్టీకి మీ కారు ద్వారా కలిగే డ్యామేజ్​లు, నష్టాలను ఇది కవర్‌ చేస్తుంది. దానికి సంబంధించిన పరిహారాన్ని IRDAI ముందుగానే నిర్ణయిస్తుంది. ఇది అన్నీ పాలసీల్లో ఒకే రకంగా ఉంటుంది.

ఇన్సూర్డ్‌ డిక్లేర్డ్ వ్యాల్యూ (IDV)

IDV అనేది మీ కారు యొక్క మార్కెట్‌ విలువ, ఇందులో డిప్రిషియేషన్‌ కూడా కలిసి ఉంటుంది. మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ధారించడంలో మీ IDV కీలక పాత్ర పోషిస్తుంది. Digitతో మీరు మీకు నచ్చిన రీతిలో మీ IDVని కస్టమైజ్ చేసుకోవచ్చు.  అలా చేయడం వలన మీ ప్రీమియం, ఇన్సూరెన్స్ మొత్తం ఎలా ప్రభావితం అవుతుందో చూసుకోవచ్చు.

యాడ్‌-ఆన్‌ కవర్లు

మెరుగైన రక్షణ కోసం మీరు అదనపు కవర్లు పొందే వెసులుబాటును కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ పాలసీ కల్పిస్తుంది. అయితే మీరు ఎంచుకునే రకం, యాడ్‌–ఆన్స్‌ సంఖ్య మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది.

డిడక్టబుల్స్

డిడక్టబుల్స్ అనేవి క్లైయిమ్స్ సందర్భంగా మీరు చెల్లించే మొత్తం. కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ పాలసీలో మీరు భరించగలిగే స్థాయిలో దీన్ని ఎంచుకోవచ్చు. మీరు ఇది ఎక్కువ శాతాన్ని ఎంచుకుంటే, మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంటుంది.  ఒకవేళ దీన్ని తక్కువ ఎంచుకుంటే ప్రీమియం మొత్తం పెరుగుతుంది.

నో క్లెయిమ్​ బోనస్‌

మీ నో క్లెయిమ్​ బోనస్‌ అనేది మీరు ఎన్ని సంవత్సరాలు క్లెయిమ్​ చేయకుండా ఉన్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇది మొదటి క్లెయిమ్​ ఫ్రీ సంవత్సరంలో 20% ఉంటుంది. నో క్లెయిమ్​ బోనస్‌ ఎంత ఎక్కువగా ఉంటే మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంత తక్కువ ఉంటుంది.  ఒకవేళ దీన్ని తక్కువగా ఎంచుకుంటే మీ ప్రీమియం అమౌంట్​ పెరుగుతుంది.

మీ కార్ మేక్​, మోడల్‌

మీరు కట్టాల్సిన ప్రీమియం అనేది మీరు కలిగి ఉన్న కారుపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ కార్ ఇంజన్‌, సీసీ, ఫీచర్స్‌ వంటి వాటిపరంగా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు, ప్రతీ కారుకు కొన్ని స్వీయ రిస్కులు కూడా ఉంటాయి. కాబట్టి, ప్రీమియం అనేది ఆయా అంశాలను బట్టి మారుతూ ఉంటుంది.

ఓనర్‌- డ్రైవర్‌కు పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌

చట్టప్రకారం ఇది తప్పనిసరి, పర్సనల్‌ యాక్సిడెంట్ కవర్‌ (PA కవర్‌) అనేది మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్‌ పాలసీలో (ఇప్పటి వరకు లేనట్లు అయితే) భాగంగా ఉంటుంది.

మీ కారు వయస్సు

సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కారు ఎంత పాతదైతే మీ కాంప్రహెన్సివ్‌ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంత తక్కువగా ఉంటుంది. మీ కారు ఎంత కొత్తది అయితే అంత ఎక్కువగా ఉంటుంది.

థర్డ్‌–పార్టీ కార్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలుక్యులేటర్‌

చట్టప్రకారం థర్డ్‌–పార్టీ కార్ ఇన్సూరెన్స్ అన్నది అత్యంత ప్రాథమికమైన ఇన్సూరెన్స్. ఇది థర్డ్‌ పార్టీలకు అయ్యే డ్యామేజ్​లు, నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. అంటే మీ కార్ ఎవరినైనా ఢీకొట్టినా లేదా ఎవరి ప్రాపర్టీకైనా లేదా ఏదైనా వాహనానికి డ్యామేజ్​ కలిగిస్తే దానికి మాత్రమే వర్తిస్తుంది.

థర్డ్‌–పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంకు సంబంధించి ముఖ్యమైన విషయాలు మరిన్ని తెలుసుకోండి.

మీ కారు సీసీ

సీసీ అంటే మీ కారు యొక్క ఇంజన్‌ సామర్ధ్యం. ఇది మీ కారు వేగాన్ని, దానితో ముడిపడి ఉండే రిస్కును నిర్ధారిస్తుంది. థర్డ్‌–పార్టీ ఇన్సూరెన్స్‌లో మీ కారు సీసీ ఎంత ఎక్కువగా ఉంది, ఎంత తక్కువగా ఉంది అనేది కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై నేరుగా ప్రభావితం చేస్తుంది.

ఓనర్‌-డ్రైవర్‌కు పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌

మీకు ఇప్పటికే గనక పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ లేనట్లు అయితే, మీ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీలో దీన్ని చేర్చుకోవడం తప్పనిసరి. ఈ కారణంగా మీ థర్డ్‌–పార్టీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్​ స్వల్పంగా  పెరుగుతుంది.

థర్డ్‌–పార్టీ డ్యామేజ్​లు

థర్డ్‌–పార్టీ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్‌ పార్టీ డ్యామేజ్​లను మాత్రమే కవర్‌ చేస్తుంది కాబట్టి, మీ కారు యొక్క ప్రీమియం ధర లెక్కించేటప్పుడు థర్డ్–పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలో ఇది మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

భారతదేశంలో థర్డ్‌ పార్టీ కార్‌ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు

ప్రైవేట్‌ కార్ల ఇంజన్‌ సామర్థ్యం ప్రీమియం రేటు
1000 సీసీ కంటే తక్కువ ₹2,094
1000 సీసీ కంటే ఎక్కువ కానీ 1500 సీసీ కంటే తక్కువ ₹3,416
1500 సీసీ కంటే ఎక్కువ ₹7,897

కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియంను తగ్గించుకునేందుకు చిట్కాలు

కింది వీటి ఆధారంగా మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్​ను తగ్గించుకోవచ్చు:

మీ వాలంటరీ డిడక్టబుల్​ను పెంచుకోండి

మీరు 4-5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఎటువంటి క్లెయిమ్​ చేయనట్లైతే, మీ వాలంటరీ డిడక్టబుల్‌ను మీరు పెంచుకోండి. అలా చేయడం వల్ల మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.

అవసరమైన యాడ్‌–ఆన్స్​ను ఎంచుకోండి

మీ కారుకు అదనపు రక్షణ కవచాన్ని అందించడంలో యాడ్‌–ఆన్స్‌ కీలక పాత్ర  పోషిస్తాయి. కానీ, అదే సమయంలో వాటి కారణంగా ప్రీమియం అమౌంట్​ కూడా పెరుగుతుంది. కాబట్టి మీకు, మీ కారుకు ఏవి అవసరమో ఆ యాడ్‌–ఆన్స్​ను మాత్రమే ఎంచుకోవాలని సూచిస్తున్నాం.

మీ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడండి

మీ కార్ ఇన్సూరెన్స్ కోట్‌ తక్కువగా ఉండటం లేదని మీరు భావించినప్పుడు, తుది నిర్ణయం తీసుకోవడం కంటే ముందే మీకు ఆసక్తి ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడటం తప్పేమీ కాదు.

మీ పాలసీని సకాలంలో రెన్యూ చేయించండి

ఎక్స్‌పైరీ తేదీకి ముందే మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయించండి. దీని వలన మీ కార్ ప్రీ-ఇన్‌స్పెక్షన్‌ ప్రాసెస్‌ సమయాన్ని తొలగించడమే కాదు మీరు నో క్లెయిమ్​ బోనస్‌ కూడా చేర్చుకొని డిస్కౌంట్‌ పొందేలా చూస్తుంది.

మంచి డ్రైవింగ్‌ రికార్డు కలిగి ఉండటం

ఇది తప్పనిసరి మాత్రమే కాదు ముఖ్యం కూడా. రోడ్డుపై జాగ్రత్తగా ఉండటమే మాత్రమే కాదు, స్పీడ్‌ లిమిట్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా ప్రమాదాలను దూరం పెట్టవచ్చు. అంతేకాదు, ప్రతీ సంవత్సరం మీరు నో క్లెయిమ్​ బోనస్‌ పొందేలా అది చూస్తుంది.

మీరు Digit కార్ ఇన్సూరెన్స్​నే ఎందుకు కొనుగోలు చేయాలి?

Digit అందించే కార్ ఇన్సూరెన్స్‌లోని ముఖ్యమైన ఫీచర్లు

ముఖ్యమైన ఫీచర్లు Digit ప్రయోజనం
ప్రీమియం ₹2,094 నుంచి ప్రారంభం
నో క్లెయిమ్​ బోనస్‌ 50% వరకు డిస్కౌంట్‌
నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోగలిగే యాడ్‌-ఆన్స్ 10 యాడ్‌-ఆన్స్ అందుబాటులో ఉన్నాయి
క్యాష్‌లెస్‌ రిపేర్లు 6000+ గ్యారేజీల వద్ద అందుబాటులో ఉంది
క్లెయిమ్​ ప్రాసెస్‌ స్మార్ట్‌ఫోన్‌–ఎనేబుల్డ్​ క్లెయిమ్​ ప్రాసెస్‌. దీన్ని ఆన్‌లైన్‌లో కేవలం 7 నిమిషాల్లో ముగించవచ్చు!
స్వంత డ్యామేజ్‌ కవర్‌ లభ్యం
థర్డ్‌–పార్టీలకు డ్యామేజ్​లు వ్యక్తిగత డ్యామేజ్​లకు అన్​లిమిటెడ్‌ లయబిలిటీ, ప్రాపర్టీ/వెహికిల్‌ డ్యామేజ్​లకు రూ. 7.5 లక్షల వరకు

కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ను ఫైల్‌ చేయడం ఎలా?

మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ కొనుగోలు చేసిన తర్వాత లేదా రెన్యూ చేసిన తర్వాత, ఎటువంటి టెన్షన్‌ లేకుండా ఉండవచ్చు. మా దగ్గర 3 స్టెప్స్​లో పూర్తయ్యే డిజిటల్‌ క్లెయియ్​ ప్రాసెస్‌ ఉంది.

స్టెప్ 1

1800 -258-5956 నంబర్​పై మాకు కాల్‌ చేయండి చాలు. ఎటువంటి ఫామ్స్ నింపాల్సిన అవసరం లేదు.

స్టెప్ 2

మీ రిజిస్టర్డ్​ మొబైల్‌ నెంబర్‌కు సెల్ఫ్‌ ఇన్‌స్పెక్షన్‌ లింక్‌ పొందండి. మీకు వివరించిన స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ద్వారా మీ స్మార్ట్​ఫోన్‌తో మీ వాహనం యొక్క డ్యామేజ్​కు సంబంధించిన ఫొటోలను షూట్‌ చేయండి.

స్టెప్ 3

రిపేర్‌కు మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోండి. అంటే రీయింబర్స్‌మెంట్‌ లేదా మా నెట్‌వర్క్ గ్యారేజీల ద్వారా క్యాష్‌లెస్‌.

ఎంత వేగంగా Digit ఇన్సూరెన్స్‌ క్లెయిమ్​లు సెటిల్‌ చేయబడతాయి మీరు ఇన్సూరెన్స్ కంపెనీని మార్చేటప్పుడు మీ మెదడులోకి ముందుగా రావాల్సిన ప్రశ్న ఇది. అది మీరు చేస్తున్నారు చాలా మంచిది! డిజిట్‌ క్లెయిమ్స్‌ రిపోర్టు కార్డు చదవండి.

కార్‌ ఇన్సూరెన్స్ క్యాలుక్యులేటర్‌కు సంబంధించి తరచూ అడిగే ప్రశ్నలు

కార్ ఇన్సూరెన్స్‌లో వాలంటరీ డిడక్టబుల్‌ అంటే ఏంటి? దాని వలన ప్రయోజనమేంటి?

మొదటి విషయం, మీరు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ చేసి అది క్లియర్‌ అయినప్పుడు మొత్తం క్లెయిమ్​ చెల్లింపుల్లో రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒక భాగాన్ని మేము చెల్లిస్తాం, మరో భాగాన్ని మీరు చెల్లిస్తారు. మీరు చెల్లించే భాగాన్ని ఎక్సెస్‌ లేదా డిడక్టబుల్‌ అంటారు. ఇది కంపల్సరీ (అంటే తప్పనిసరి అనుకోండి), వాలంటరీ అనే రెండింటితో కూడుకొని ఉంటుంది. వాలంటరీ అనేది కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్​ సందర్బంలో మేము చెల్లించాలని నిర్ణయించిన (తప్పనిసరి మొత్తం)  దానిపై  మీరు ఎంచుకున్న చెల్లించదలిచే అదనపు అమౌంట్​ అన్నమాట. జనం ఎందుకు వాలంటరీ డిడక్టబుల్‌ ఎంచుకుంటారు? ఎందుకు ఎంచుకుంటారు అంటే దీని వలన కార్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గుతుంది కాబట్టి.

టిప్: మరీ అత్యాశకు పోయి మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకునేందుకు ఈ ఫీచర్​ను ఉపయోగించకండి. మీరు 50% నో క్లెయిమ్​ బోనస్‌ (అంటే గడిచిన 5 ఏళ్లుగా ఎటువంటి క్లెయిమ్​ లేకపోవడం) వంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తే మంచిది.  అంటే మీరు క్లెయిమ్​ చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అది మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్‌లో కంపల్సరీ ఎక్సెస్‌ అంటే ఏంటి?

మినహాయింపునకు మరో పేరే కంపల్సరీ ఎక్సెస్‌ – ఇది క్లెయిమ్​లో భాగంగా మీరు చెల్లించాల్సిన అమౌంట్​.మినహాయింపునకు మరో పేరే కంపల్సరీ ఎక్సెస్‌ – ఇది క్లెయిమ్​లో భాగంగా మీరు చెల్లించాల్సిన అమౌంట్​.

నా ఇన్సూరెన్స్‌ కంపెనీని నేను ఆన్‌లైన్‌లో మార్చాలని అనుకున్నప్పుడు నేను పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయాలేంటి?

ఏదైనా పాలసీ కొనుగోలు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:

  • క్లెయిమ్​ సెటిల్‌మెంట్ వేగం – మీ డబ్బు కోసం మీరు వేచి ఉండేందుకు ఇష్టపడరు కదా?
  • సంప్రదింపుల సౌలభ్యం – కస్టమర్‌ కేర్‌తో మాట్లాడేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం!
  • కారు రిపేర్లకు క్యాష్‌లెస్‌ ఆప్షన్స్
  • నెట్‌వర్క్‌ కనెక్టివిటీ – మీ ఫోన్‌ నెట్‌వర్క్‌ కాదు, సర్వీస్‌ సెంటర్‌ నెట్‌వర్క్‌
  • కంపెనీ క్లెయిమ్​ సెటిల్‌మెంట్‌ హిస్టరీ

ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో నేను ఏమైనా హార్డ్‌కాపీలు సబ్మిట్‌ చేయాల్సి ఉంటుందా?

మీలాగే మాకు కూడా డాక్యుమెంట్లు అంటే అంత ఇష్టం ఉండదు. అందుకే కొత్త పాలసీ కోసం మీరు ఎటువంంటి డాక్యుమెంట్లను సబ్మిట్​ చేయాల్సిన అవసరం లేదు.

నేను ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేస్తే అది నాకు చేరడానికి ఎంత సమయం పడుతుంది?

మీరు పేమెంట్‌ చేయగానే పాలసీ సాఫ్ట్ కాపీ మీ మెయిల్‌ బాక్సుకు చేరిపోతుంది. జిప్‌, జ్యాప్‌, జూమ్‌. మేము పర్యావరణ ప్రేమికులం. మేము హార్డ్‌ కాపీ పంపించం. కానీ, ఒకవేళ మీరు కావాలనుకుంటే మాకు తెలియజేయండి, మీకు పంపిస్తాం.

నేను ఒకవేళ నా ఇన్సూరెన్స్‌ కంపెనీని మార్చినట్లైతే నా నో క్లెయిమ్​ బోనస్‌ ఏమవుతుంది?

మీ NCB (నో క్లెయిమ్​ బోనస్‌) అనేది మీ చక్కని డ్రైవింగ్‌ రికార్డును తెలియజేస్తుంది. మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ కంపెనీని మార్చినా, అది మీతోనే ఉంటుంది.

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వలన నష్టాలు ఏమైనా ఉంటాయా?

ఉండవు. ఇందులో ఎటువంటి నష్టాలు లేవు. అంతేకాదు, మీ కారుకు తగిన ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేసేందుకు రకరకాల ధరలు పోల్చి చూసుకునేందుకు ఇదొక తెలివైన విధానం.