మారుతి సుజుకి కంపెనీ సరసమైన ధరల్లో వాహనాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో సెడాన్స్, హ్యాచ్ బ్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి. మారుతి సుజుకి అందించే విటారా బ్రెజ్జా SUV కూడా.. బడ్జెట్ మీద ఆధారపడే ఇండియన్ మార్కెట్లో ఉంది.
1462 సీసీతో ఉండే ఈ SUV రోడ్డు మీద ఇంప్రెసివ్ పనితీరును అందిస్తుంది. చూసేందుకు ఇది స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇందులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఆ కారణంతో బ్రెజ్జా అనేక అవార్డులను గెలుచుకుంది. ఇది 2018లో టెక్ అండ్ ఆటో అవార్డ్స్ లో ‘SUV/MPV ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెల్చుకుంది. అందువల్ల ఈ SUV నాణ్యతలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు . ఈ వాహనం ప్రయాణాలకు ఎంతో అనువైనది.
ఏదేమైనా కానీ మీ విటారా బ్రెజ్జా కారును ప్రమాదాలు, డ్యామేజెస్ నుంచి రక్షించుకునేందుకు మీరు తప్పనిసరిగా విటారా బ్రెజ్జా కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీకు కావాల్సిన ఆర్థిక అవసరాలను బట్టి మీరు థర్డ్ పార్టీ పాలసీ లేదా కాంప్రహెన్సివ్ పాలసీని ఎంచుకోవచ్చు.
థర్డ్ పార్టీ లయబులిటీ పాలసీ అనేది దాని పేరు ఉన్న విధంగానే వర్క్ చేస్తుంది. ఏదైనా ప్రమాదంలో మీ వల్ల థర్డ్ పార్టీ వ్యక్తులకు కలిగిన నష్టాలను మాత్రమే ఇది కవర్ చేస్తుంది.
కానీ మీ సొంత కారుకు జరిగిన ఎటువంటి నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేయలేరు. అలా మీరు చేసేందుకు మీరు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవాలి. ఈ పాలసీ కింద ఇన్సూరెన్స్ సంస్థలు ఓన్ డ్యామేజ్ కవర్ తో పాటు థర్డ్ పార్టీ లయబులిటీలను కూడా అందిస్తాయి.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం ఇండియన్ రోడ్ల మీద తిరిగే ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ లయబులిటీ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరిగా ఉండాలి. మీరు కనుక ఇందులో విఫలం అయితే రూ. 2,000 జరిమానా (రూ. 4,000 రిపీట్ చేస్తే) చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల మీ కార్ ఇన్సూరెన్స్ కొనాలా వద్దా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు. మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీని కొనుగోలు చేయాలనేది ఆలోచించాలి.
ఇండియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఇన్సూరెన్స్ ప్రొవైడర్లలో డిజిట్ ఒకటి. ఆ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకునేందుకు చదవండి.