స్కెంజెన్ వీసా ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయండి

Instant Policy, No Medical Check-ups

విదేశాలకు ట్రావెల్ చేయడం అనేది మనలో చాలా మంది ఎన్నో అనుభూతులను కలుగజేస్తుంది. అనుభవాలు మిగులుస్తుంది. ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి ఎవరికీ పెద్దగా అనుభవం ఉండదు. మనకు ఇష్టమైన ప్రదేశాల జాబితాలో కనీసం ఒక్కటైనా స్కెంజెన్ వీసా లిస్ట్ లో ఉన్న దేశం ఉంటుంది. 

మీ ట్రిప్ ఎంత ఖర్చుతో కూడుకున్న దానిలా కనిపించినా మీ ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు డిజిట్ యొక్క ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది. మీ స్కెంజెన్ వీసాను ప్రాసెస్ చేసేందుకు మీరు సులభంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందొచ్చు.

స్కెంజెన్ వీసా ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఆ జోన్ లో ఉన్న మొత్తం 26 దేశాలను కవర్ చేసే ఒక పాలసీ. మీరు స్కెంజెన్ వీసా కోసం అప్లై చేస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరి. ఇది జోన్ లో ఉన్న మొత్తం 26 స్కెంజెన్ దేశాలకు ఒకే వీసా మీద ట్రావెల్ చేసే సౌకర్యాన్ని కలిగిస్తుంది. బహుళ వీసాల అవసరం ఉండదు.

 

స్కెంజెన్ వీసా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరా?

అవును. స్కెంజెన్ వీసా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం మ్యాండేటరి. ఎందుకోసమంటే స్కెంజెన్ వీసా రిక్వైర్‌మెంట్స్‌లో భాగంగా ప్రతి ప్రయాణికుడు €30,000 (యూరోలు) వరకు మెడికల్ కవర్ కలిగి ఉండాలి. ఈ 26 దేశాల వీసా అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. కావున ఒకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం వలన మీ స్కెంజెన్ వీసా సులభంగా ప్రాసెస్ చేయబడుతుంది. 

 

స్కెంజెన్ వీసా ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందేందుకు కావాల్సినవి ఏమిటి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ప్రతి స్కెంజెన్ దేశం నిర్దిష్ట షరతులను కలిగి ఉంటుంది. మీరు ట్రావెల్ చేసే ముందు ఏం అవసరాలు ఉంటాయో తెలుసుకునేందుకు సంబంధిత దేశ రాయబార కార్యాలయం (ఎంబసీ) లేదా కాన్సులేట్ ను సంప్రదించండి. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ హైలెట్ చెయ్యాల్సిన (తప్పకుండా నెరవేర్చాల్సిన) కొన్ని షరతులు:

  • కనీస మెడికల్ కవరేజ్ €30,000. (ముప్పై వేల యూరోలు).

  • దరఖాస్తు చేసిన దాని ప్రకారం స్కెంజెన్ జోన్ యొక్క పూర్తి కవరేజ్.

  • మెడికల్ కారణాల కోసం స్వదేశానికి వెళ్లడం, ఎమర్జెన్సీ హాస్పిటల్ చికిత్స లేదా ఊహించని విధంగా మరణం సంభవించడం వంటి ఖర్చులను పాలసీ తప్పనిసరిగా కవర్ చేయాలి. 

  • పాలసీ యొక్క వ్యాలిడిటీ బస వ్యవధిని కవర్ చేయాలి.

మీరు సిద్ధంగా ఉన్నారు! స్కెంజెన్ దేశాల్లో ఏదైనా ఒక దేశానికి లేదా అన్ని దేశాలకైనా ట్రావెల్ చేయడం ఒక వరం వంటిది. ఆ అనుభవాన్ని అద్భుతంగా మార్చేందుకు మేము ఇక్కడ ఉన్నాం. మీరు హాలీడే లేదా పనికోసం ట్రావెల్ చేసినా లేక సోలో ట్రిప్ వేసినా లేక కుటుంబ సమేతంగా వెళ్లినా మీ ట్రిప్ ను ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగేలా చేసేందుకు డిజిట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది.

నా స్కెంజెన్ వీసా కోసం నేను ఎందుకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి?

2022లో పారిస్, ఇటలీ, స్కాండివేనియా, బ్రస్సెల్స్ దేశాల్లో 200కు పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. (1)

దొంగతనం వంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. బెల్జియం మరియు స్వీడన్ దేశాలు రెండో స్థానంలో ఉన్నాయి. (2)

ఒక్క ఐరోపాలోనే 7.3 మిలియన్ల బ్యాగేజ్ పోయినట్లు రిపోర్ట్ చేయబడింది. ఇవి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల, ఆలస్యం కావడం వల్ల లేదా మర్చిపోవడం వల్ల పోయాయి. (3)

కోవిడ్ కొంత శాంతించిన తర్వాత తిరిగి మరలా అంతర్జాతీయ సరిహద్దులు తెరుచుకున్నపుడు జనాలు తక్కువగా ఉండడం వలన ఫ్లైట్ ల ఆలస్యం కావడం మరియు విమానాలు రద్దవడం పెరిగాయి. (4)

స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు మీతో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి.

స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కు కనీసం €30,000 (యూరోలు) మెడికల్ కవరేజ్ అవసరం.

డిజిట్ అందించే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ లో గొప్పతనం ఏమిటి?

జీరో మినహాయింపు - మీరు క్లెయిమ్ చేసే సమయంలో అదనంగా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు- మొత్తం మేము చూసుకుంటాం.

అడ్వెంచర్ స్పోర్ట్స్ కవర్ అవుతుంది - మా కవరేజ్ లో స్కూబా డైవింగ్, బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటి సాహస క్రీడలు ఉంటాయి (వీటి వ్యవధి ఒక్కరోజు మాత్రమే ఉంటే).

ఫ్లైట్ల ఆలస్యం కోసం తక్షణ ఆర్థిక సహాయం - మేము ఇక మీ సమయాన్ని వృథా చేయాలని అనుకోవడం లేదు. మీ ఫ్లైట్ కనుక 6 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయినప్పుడు మేము వెంటనే మీకు రూ. 500-రూ. 1000 పరిహారం అందిస్తాం.

స్మార్ట్ ఫోన్ ఎనేబుల్డ్ ప్రాసెసెస్ - ఎటువంటి పేపర్ వర్క్ ఉండదు. మీరు గాబరాగా పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీరు క్లెయిమ్ చేసే సమయంలో కేవలం పత్రాలు అప్ లోడ్ చేస్తే సరిపోతుంది.

మిస్డ్ కాల్ ఫెసిలిటీ - +91-7303470000 నెంబర్ పై మాకు మిస్డ్ కాల్ ఇవ్వండి. 10 నిమిషాల్లోపు మేము మీకు తిరిగి కాల్ చేస్తాం. ఎటువంటి ఇంటర్నేషనల్ కాలింగ్ చార్జీలు ఉండవు!

ప్రపంచవ్యాప్త సపోర్ట్ - మేము ప్రపంచంలో పెద్దదైన ట్రావెల్ & హెల్త్ ఇన్సూరెన్స్ నెట్‌వర్క్ అయిన అలియాంజ్ తో భాగస్వామ్యం కలిగి ఉన్నాం. కావున మీకు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. T&C (షరతులు) వర్తిస్తాయి*

మీ అవసరాలకు సరిగ్గా సరిపోయే స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు

బేసిక్ ఆప్షన్ కంఫర్ట్ ఆప్షన్

మెడికల్ కవర్

×

ఎమర్జెన్సీ ప్రమాద చికిత్స& తరలింపు

ప్రమాదాలు అనేవి మనం ఊహించని సమయాల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు మేము మిమ్మల్ని అక్కడ సేవ్ చేయలేకపోవచ్చు కానీ మీకు ఉత్తమమైన చికిత్సను మాత్రం అందిస్తాం. తక్షణ వైద్య చికిత్స కోసం ఆసుపత్రిలో చేరేందుకు కారణం అయ్యే వాటిని మేము కవర్ చేస్తాం.

×

ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్‌మెంట్ & తరలింపు

మీరు తెలియని దేశంలో అనారోగ్యానికి గురైతే దేవుడు కూడా సాయం చేయడని మీరు ఏం మాత్రం భయపడొద్దు! మీ చికిత్స ఖర్చులను మేము చూసుకుంటాం. ఆసుపత్రి గది అద్దె, ఆపరేషన్ థియేటర్ చార్జీలు మొదలైన వాటి ఖర్చులను మేము కవర్ చేస్తాం.

×

పర్సనల్ యాక్సిడెంట్

ఈ కవర్ మీకు ఎన్నటికీ అవసరం రాకూడదని మేము కోరుకుంటున్నాం. ట్రిప్ సమయంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి అది మరణం లేదా వైకల్యానికి దారి తీసినపుడు ఈ ప్రయోజనం మీకు సపోర్ట్ చేస్తుంది.

×

డైలీ క్యాష్ అలోవెన్స్ (రోజుకోసారి / గరిష్టంగా 5 రోజుల వరకు)

మీరు ట్రిప్ లో ఉన్నపుడు మీరు సమర్థవంతంగా డబ్బులను మేనేజ్ చేసుకోగల్గుతారు. మీరు ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం అదనంగా చెల్లించాలని మేము కోరుకోవడం లేదు. మీరు ఆసుపత్రిలో చేరినపుడు మీ రోజూవారీ ఖర్చులను మేనేజ్ చేసేందుకు నిర్దిష్ట మొత్తం డెయిలీ క్యాష్ పొందుతారు.

×

యాక్సిడెంటల్ డెత్ & వైకల్యం

ఈ కవర్ లో ఎమర్జెన్సీ యాక్సిడెంటల్ ట్రీట్‌మెంట్ కవర్ వంటివి అన్నీ ఉన్నప్పటికీ, దీనికి ఒక అదనపు రక్షణ పొర ఉంది. మీరు విమానంలో ఎక్కేటపుడు అయినా, దిగేటపుడు అయినా లేక ఫ్లైట్ లోపల ఉన్నపుడు అయినా మరణం లేదా వైకల్యం సంభవిస్తే ఇది కవర్ చేస్తుంది. (టచ్‌వుడ్!).

×

ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్‌మెంట్

మీ ట్రిప్ లో మీకు గాయం లేదా యాక్సిడెంట్ వల్ల ఎమర్జెన్సీ దంత చికిత్సను మెడికల్ ప్రాక్టీషనర్ చేసినట్లయితే చికిత్స కోసం అయిన ఖర్చులను మేము మీకు చెల్లిస్తాం.

×

స్మూత్ ట్రాన్సిట్ (రవాణా) కవర్స్

×

ట్రిప్ క్యాన్సిలేషన్

దురదృష్టవశాత్తు మీ ట్రిప్ రద్దు చేయబడితే మీ ప్రయాణం కోసం మీరు ముందుగా బుక్ చేసుకున్న రీఫండ్ కాని ఖర్చులను మేము చెల్లిస్తాం.

×

కామన్ క్యారియర్ డిలే

మీ ఫ్లైట్ కనుక నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ ఆలస్యం అయితే మీరు ప్రయోజనం మొత్తం పొందుతారు. ఎటువంటి ప్రశ్నలు అడగం!

×

బ్యాగేజ్ చెకింగ్ లో ఆలస్యం

కన్వేయర్ బెల్ట్ వద్ద వెయిట్ చేయడం బాధిస్తుందని మాకు తెలుసు! ఒక వేళ మీ చెక్ బ్యాగేజ్ 6 గంటల కంటే ఆలస్యం అయితే మీరు మొత్తం ప్రయోజనం పొందుతారు. ఎటువంటి ప్రశ్నలు అడగం!

×

చెక్ ఇన్ (తనిఖీ) బ్యాగేజ్ కు మొత్తం నష్టం

ట్రిప్ లో జరిగే చివరి బాధాకరమైన విషయం ఏమిటంటే మీ బ్యాగేజ్ పోగొట్టుకోవడం. కానీ ఇలాంటివి ఏవైనా జరిగినపుడు మీరు మొత్తం బ్యాగేజ్ ను శాశ్వతంగా కోల్పోయిన ప్రయోజనం పొందుతారు. రెండు, మూడు బ్యాగులను పోగొట్టుకున్నపుడు మీరు దామాషా ప్రకారం ప్రయోజనం పొందుతారు. ప్రయోజన మొత్తంలో మీకు 2/3వ వంతు చెల్లిస్తారు.

×

మిస్డ్ కనెక్షన్

ఫ్లైట్ మిస్ అయ్యారా? ఏం చింతించకండి! ఒక వేళ మీరు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ మీరు చేసిన ఆలస్యం వలన మిస్ అయితే మీ టికెట్ మీద చూపించిన తదుపరి గమ్యాన్ని చేరుకునేందుకు మేము మీకు అవసరం అయిన అదనపు వసతి మరియు ట్రావెల్ ఖర్చులను చెల్లిస్తాం.

×

ఫ్లెక్సిబుల్ ట్రిప్

×

పాస్ పోర్ట్ నష్టం

ముక్కూ మొహం తెలియని దేశంలో జరిగే బాధాకరమైన సంఘటన ఏమిటంటే మీ పాస్ పోర్ట్ లేదా వీసాను పోగొట్టుకోవడం. మీరు ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నపుడు దొంగతనం, లేదా పోగొట్టుకోవడం వలన మీకు జరిగిన డ్యామేజ్ ను మేము మీకు తిరిగి చెల్లిస్తాం.

×

ఎమర్జెన్సీ క్యాష్

అనుకోకుండా ఒక రోజు మీ డబ్బు మొత్తం దొంగిలించబడి మీకు ఎమర్జెన్సీగా డబ్బు అవసరం అయితే ఈ కవర్ మిమ్మల్ని కాపాడుతుంది.

×

ఎమర్జెన్సీ ట్రిప్ పొడిగింపు

మనం సెలవులను త్వరగా ముగించేందుకు మొగ్గు చూపడం లేదు. కానీ మనం ఆసుపత్రిలో ఉండేందుకు కూడా ఇష్టపడం! మీ ట్రిప్ లో ఎమర్జెన్సీ అవసరం వలన మీరు మీ బసను పొడగించాల్సి వస్తే హోటల్ పొడగింపు అయిన ఖర్చులను మరియు రిటర్న్ ఫ్లైట్ రీషెడ్యూలింగ్ కు అయ్యే ఖర్చులను కూడా చెల్లిస్తాం. ఎమర్జెన్సీ అనేది మీరు ట్రావెల్ చేస్తున్న ప్రాంతంలో ప్రకృతి విపత్తు సంభవించడం లేదా అత్యవసరంగా ఆసుపత్రిలో చేరడం అయినా కావొచ్చు.

×

ట్రిప్ రద్దు

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మీరు ట్రిప్ నుంచి త్వరగా ఇంటికి తిరిగి రావాల్సి వస్తే అది చాలా బాధాకరం. దాని గురించి మేము ఏమి చేయలేము కానీ ప్రత్యామ్నాయ ట్రావెల్ ఏర్పాట్లు, మీకు తిరిగి చెల్లించని ఖర్చులైన వసతి ఖర్చులు, ముందుగా ప్రణాళిక వేసుకున్న ఈవెంట్ల ఖర్చులు మరియు విహారయాత్ర ఖర్చులను మేము భరిస్తాం.

×

పర్సనల్ లయబులిటీ & బెయిల్ బాండ్

మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా దురదృష్టకర సంఘటన జరిగి మీపై ఏవైనా చట్టపరమైన చార్జీలు వస్తే దానికి అయ్యే ఖర్చులను మేము చెల్లిస్తాం.

×
Get Quote Get Quote

పైన పేర్కొన్న కవరేజ్ ఆప్షన్ అనేది కేవలం సూచిక మాత్రమే. ఇది మార్కెట్ అధ్యయనం మరియు అనుభవంపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ అవసరానికి అనుగుణంగా ఏవైనా అదనపు కవరేజీలను ఎంచుకోవచ్చు. మీరు ఏదైనా ఇతర కవరేజీలను ఎంచుకోవాలనుకున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నా దయచేసి 1800-258-5956 నెంబర్‌కు కాల్ చేయండి.

పాలసీ గురించి వివరంగా చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

మేము పారదర్శకంగా ఉండాలని కోరుకుంటాం. అందుకోసమే మేము ఏం కవర్ చేయమో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేస్తుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దేనిని కవర్ చేయదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. కింద పేర్కొన్న కొన్ని విషయాలను మా ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేయదు:
 

  • ఇప్పటికే నిర్దారణ అయిన వ్యాధులు (ముందుగా ఉన్న వ్యాధులు) లేదా మీ వైద్యుడు ట్రావెల్ చేయొద్దని ఇప్పడికే రికమెండ్ చేసి ఉంటే కవర్ కాదు.

  • మీరు ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరినపుడు 5 రోజుల వరకు మాత్రమే డెయిలీ క్యాష్ అలోవెన్స్ వస్తుంది.

  • ప్రమాదం జరిగిన 365 రోజుల తర్వాత మరణం లేదా వైకల్యం సంభవిస్తే కవర్ చేయబడదు.

  • కేవలం ఒక్కరోజుకి మాత్రమే సాహస క్రీడలు కవర్ చేయబడతాయి. ఇందులో వారం రోజుల పాటు సాగే ట్రెక్కింగ్స్, హైక్స్ లేదా ఒకరోజు పాటు సాగే ప్రొఫెషనల్ అడ్వెంచర్ గేమ్స్ ఉండవు. 

  • మీ విమానయాన సంస్థ కనీసం 6 గంటల ముందుగానే మీకు తెలియజేసిన ఫ్లైట్ ఆలస్యాలు కవర్ చేయబడవు.

  • తనిఖీ చేసిన సామాను కస్టమ్స్ కారణంగా ఆలస్యం అయితే కవర్ చేయబడదు.

  • మీరు దిగాల్సిన ఫ్లైట్ యొక్క షెడ్యూల్ అరైవల్ (రాక) సమయం మరియు కనెక్టింగ్ ఫ్లైట్ యొక్క షెడ్యూల్ డిపార్చర్ (నిష్క్రమణ) సమయం అనుకున్న దాని కంటే తక్కువ సమయంలో ఉంటే.

  • యుద్ధం వల్ల నష్టం జరిగితే కవర్ చేయబడదు.

  • దొంగతనం జరిగిన తర్వాత 24 గంటల్లోపు సంబంధిత పోలీసులకు తెలియజేయకపోతే దొంగతనాలు కవర్ చేయబడవు.

  • ప్రసవం లేదా దానికి సంబంధించిన విషయాల వలన ట్రిప్ పొడిగించబడితే దానికి కవర్ చేయబడవు.

  • ముందుగా ఉన్న అనారోగ్యాలు లేదా హెల్త్ కండీషన్స్ వలన ట్రిప్ రద్దు అయితే కవర్ చేయబడదు.

  • వీసా తిరస్కరణ కారణంగా ట్రిప్ రద్దయితే కవర్ చేయబడదు.

మాతో కలిసి వీఐపీ క్లెయిమ్స్‌కి యాక్సెస్ పొందండి

మీరు స్కెంజెన్ కోసం మా వద్ద ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసిన తర్వాత మా వద్ద 3 స్టెప్ డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియ ఉంటుంది. దీని వల్ల మీరు నిశ్చింతగా ఉండొచ్చు!

స్టెప్ 1

1800-258-5956 (ఒక వేళ ఇండియాలో ఉంటే) లేదా +91-7303470000 నెంబర్లకు మిస్డ్ కాల్ ఇవ్వండి & మేము 10 నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తాం.

స్టెప్ 2

పంపిన లింక్ లో బ్యాంక్ ఖాతా వివరాలు మరియు అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయండి.

స్టెప్ 3

మంచిది. ఇక మిగిలింది మేం చూసుకుంటాం!

కేంబ్రిడ్జి ఇంగ్లిష్ డిక్షనరీ ప్రకారం స్కెంజెన్ అనే పదం యురోపియన్ యూనియన్ లోని అనేక దేశాల మధ్య ఇది ఒక ఒప్పందం అని నిర్వచించబడింది. ఈ దేశాల సరిహద్దుల ద్వారా పాస్ పోర్ట్ లేకుండా వెళ్లేందుకు వీలుంటుంది. సరకు రవాణా చేసేందుకు కూడా అనుమతిస్తారు.

స్కెంజెన్ ప్రాంతంలో 26 దేశాలు ఉన్నాయి. ఇవి ఐరోపా ప్రధాన భూభాగాన్ని చాలా మట్టుకు కవర్ చేస్తాయి. స్కెంజెన్ అనేది లక్సెంబర్గ్ లోని ఒక చిన్న పట్టణం పేరు. 1985లో అక్కడ ఈ ఒప్పందం జరగడంతో ఈ పేరు పెట్టారు.

అంతర్గత సరిహద్దులను చెరిపేయడం ద్వారా స్కెంజెన్ ప్రాంతం ప్రజలకు స్వేచ్ఛనిచ్చింది. స్కెంజెన్ జోన్ లోని వివిధ దేశాలకు ట్రావెల్ చేసేటప్పుడు సరిహద్దు నియంత్రణ తనిఖీలు లేకుండా ఇది ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది.

స్కెంజెన్ ప్రాంతం అనేది ఐరోపాలోని అన్ని దేశాలను కాకుండా ప్రధాన భూభాగాలను కవర్ చేస్తుంది. అండోరా, వాటికన్ సిటీ, మరియు మొనాకో దేశాలు ఎటువంటి సరిహద్దు తనిఖీలు చేయవు. కావున వాటిని కూడా స్కెంజెన్ ప్రాంతంలోని దేశాలుగానే పరిగణిస్తారు.

స్కెంజెన్ జోన్ లో ఉన్న మొత్తం 26 దేశాల్లో ఎటువంటి చింత లేకుండా ట్రావెల్ చేసేందుకు స్కెంజెన్ వీసా మిమ్మల్ని అనుమతిస్తుంది. స్కెంజెన్ జోన్ లో ఉన్న దేశాల్లోకి ఎంటర్ అయ్యేందుకు భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్స్ స్కెంజెన్ వీసాను పొందాలి. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్ల కోసం స్కెంజెన్ వీసా దరఖాస్తు ప్రక్రియ కింది విధంగా ఉంటుంది:

  • వీసా అప్లికేషన్ ఫారం పూరించండి: వీసా అప్లికేషన్ ఫారం కొరకు స్కెంజెన్ ఎంబసీ వెబ్‌సైట్ ను బ్రౌజ్ చేయండి. ఆ ఫారాన్ని డౌన్ లోడ్ చేసి సబ్మిట్ చేసే ముందు పూర్తి వివరాలను పూరించండి.
  • స్కెంజెన్ వీసా రకం ఎంచుకోండి: మీకు అవసరం అయిన స్కెంజెన్ వీసా రకం ఎంచుకోండి. ఇది మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారనే దానిపై మరియు ఎంతకాలం ఉంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల వీసాలకు వివిధ రకాల పరిమితులు ఉంటాయి. కాబట్టి ట్రావెల్ చేసే ముందు మీకు అవసరం ఉన్న దాన్ని ఎంచుకోండి.

  • అవసరం అయిన పత్రాలతో మీ స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోండి: మీ వీసా కోసం ఎక్కడ ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలో కనుక్కోండి. భారతీయులు స్కెంజెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారు అక్కడ 90 రోజుల వరకు ఉండేందుకు ఇది అనుమతిస్తుంది. అంతే కాకుండా ఆరు నెలల వ్యాలిడిటీని కూడా కలిగి ఉంటుంది. మీ దేశంలో ఉన్న ఎంబసీ/కాన్సులేట్ నుంచి మీ వీసా అప్లికేషన్ కు అవసరం అయిన పత్రాలు తీసుకుని వీసా అపాయింట్‌మెంట్ తీసుకోండి.
  • ఇంటర్వ్యూలను పూర్తి చేసి వీసా రుసుములను చెల్లించండి: వీసా రుసుములు అనేవి ప్రస్తుత మారకపు విలువలకు లోబడి ఉంటాయి (యూరోల్లో: యుక్తవయస్సు వారికి- 80, 6-12 సంవత్సరాల వయసు ఉండే పిల్లలకు- 60). వీసా ఫీజులను మినహాయించే ప్రమాణాలు, పద్ధతులు ఏంటనే విషయాలను కూడా మీరు తనిఖీ చేయొచ్చు.
  • మీ వీసా కోసం వేచి ఉండండి: మీ వీసా ప్రాసెస్ కోసం సుమారు 15 రోజుల సమయం పడుతుంది.

భారతీయులు స్కెంజెన్ వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన పత్రాలు

ఒక వేళ ఆహ్వానం అందితే వసతి కోసం ఒకటి లేదా ఎక్కువ సపోర్టింగ్ పత్రాలతో పాటు సదరు దేశ ఆహ్వానం.
వీసా అప్లికేషన్ ఫారం వీసా అప్లికేషన్ ఫారాన్ని తప్పనిసరిగా నింపి... ట్రావెల్ చేసే దరఖాస్తుదారులంతా అందులో సంతకాలు చేయాలి.
ఫొటోలు మరియు పాస్ పోర్ట్ ఇటీవలే దిగిన 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు. ఫొటో దిగేటప్పుడు అది ఎలా ఉండాలో గుర్తుంచుకోండి. 10 సంవత్సరాల కంటే పాతది కాని పాస్ పోర్ట్ మరియు దానికి కనీసం మూడు నెలల వ్యాలిడిటీ ఉండాలి.
ఫ్లైట్ టికెట్స్ మరియు ట్రావెల్ గురించి ఉండే రూట్ మ్యాప్ మీరు బస చేయాలని అనుకుంటున్న హోటల్స్ ప్రూఫ్స్, మీరు ఎక్కడ ఉండాలని ప్రణాళిక వేసుకున్నారో వివరాలు, మీ కంప్లీట్ ట్రావెల్ సమాచారం, మీరు అనుకున్న ప్రతి దేశానికి వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్స్.
ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు €30,000 వరకు మెడికల్ కవరేజీను అందించే ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.
ఆర్థిక వ్యవహారాల ధృవీకరణ గడిచిన మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి ఆర్థిక ప్రూఫ్స్ అవసరం. మీకు కనుక స్పాన్సర్ ఉంటే ఆ స్పాన్సర్ ఆర్థికంగా మీకు సహాయం చేస్తాడని ఉన్న లేఖ.
ఉద్యోగి/విద్యార్థి/సెల్ఫ్-ఎంప్లాయీ అయితే దానికి సంబంధించిన రుజువు. a. ఉద్యోగులు ఉద్యోగ కాంట్రాక్ట్, లీవ్ పర్మిషన్స్, మరియు ఆదాయపు పన్ను వివరాలు సమర్పించాలి. b. స్వయం ఉపాధిని పొందుతున్న వ్యక్తులు తమ వ్యాపార లైసెన్స్ కాపీని మరియు గడిచిన ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లను మరియు ఆదాయపు పన్ను వివరాలను సమర్పించాలి.

స్కెంజెన్ దేశాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

నా ట్రిప్ రద్దు చేయబడితే కవర్ చేయబడుతుందా?

మేము ముందుగా బుక్ చేసిన, తిరిగి చెల్లించలేని ఖర్చులు మరియు మీరు మీ పర్యటనను అత్యవసరమైన పరిస్థితుల్లో విడిచి వస్తే కవర్ చేస్తాము. కవర్ చేయబడని అంశాలు ఏంటంటే ముందుగా ఉన్న అనారోగ్యాలు లేదా ఆరోగ్య పరిస్థితుల కారణంగా ట్రిప్ రద్దు, వీసా తిరస్కరణకు గురి కావడం వల్ల ట్రిప్ రద్దు.

స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ధరను ఏ కారకాలు ప్రభావితం చేస్తాయి?

స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది మీ వయసు, మీ ట్రిప్ వ్యవధి, హెల్త్ రిస్క్ వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అవాంతరాలు లేకుండా ట్రిప్ కొనసాగేందుకు మీరు పొందే యాడ్ ఆన్ కవర్స్ కూడా మీ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి.

వివిధ రకాల స్కెంజెన్ వీసాలు ఏమిటి?

  • మీ ట్రావెల్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీరు దరఖాస్తు చేసుకోవచ్చు:
    • యూనిఫాం స్కెంజెన్ వీసా- టైప్ A లేదా టైప్ C. టైప్ C కింద మీకు సింగిల్-ఎంట్రీ వీసా, డబుల్ ఎంట్రీ వీసా, మరియు మల్టీపుల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉన్నాయి.
    • నేషనల్ స్కెంజెన్ వీసా
    • పరిమితంగా ఉండే ప్రాదేశిక చెల్లుబాటు వీసాలు

స్కెంజెన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వలన ప్రయోజనాలు ఏమిటి?

ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు విదేశాలకు వెళ్లినప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇది మెడికల్ సహాయం అందించడం మాత్రమే కాకుండా ఫ్లైట్ క్యాన్సిలేషన్ ఖర్చులు, ఆలస్యం అయినప్పుడు నష్ట పరిహారం, బ్యాగేజ్/పాస్ పోర్ట్ మొదలయినవి పోయినప్పుడు కవరేజ్ అందిస్తుంది.