Select Number of Travellers
మోటార్
హెల్త్
మోటార్
హెల్త్
More Products
మోటార్
హెల్త్
సపోర్ట్
closeమా వాట్సాప్ నంబర్ కాల్స్ కోసం ఉపయోగించబడదు. ఇది చాట్ మాత్రమే నంబర్.
24x7
Missed Call Facility
Affordable
Premium
1-Day Adventure
Activities Covered
Terms and conditions apply*
ఆసియాలో ఉన్న తక్కువగా అంచనా వేయబడిన ప్రదేశాలలో మలేషియా ఒకటి. కానీ ఇక్కడికి అనేక మంది ట్రావెల్ చేస్తారు. విలక్షణంగా ఉండే ద్వీపాల నుంచి కనిపించనంత ఎత్తులో ఉండే ఆకాశహర్మ్యాల వరకు ఇక్కడ ఉంటాయి. (ప్రపంచంలోనే అత్యధిక ఎత్తయిన బిల్డింగ్స్ ఉన్న నగరం కౌలాలంపూర్!) అంతేకాకుండా వైవిధ్యమైన అడవులు కూడా ఇక్కడ ఉంటాయి. కావున ప్రయాణం చేసే ప్రతి వారికి కూడా ఈ దేశాన్ని సందర్శించడం గొప్ప అనుభూతిని ఇస్తుంది.
అవును, ఇండియన్లు మలేషియా వెళ్లేందుకు వీసా కావాలి. కానీ చింతించకండి. వేరే దేశస్తుల వారితో పోల్చుకుంటే ఇండియన్ పాస్ పోర్ట్ హోల్డర్లు మలేషియా వీసా పొందే ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది.
అవును. ఈ వీసా కేవలం థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా వంటి దేశాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇండియన్ టూరిస్ట్ లు నేరుగా మలేషియా గడ్డ మీద అడుగుపెట్టి టూరిస్ట్ వీసా కోసం అడగలేరు. థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా వంటి మూడు దేశాల నుంచి ప్రవేశించినపుడు మాత్రమే ఇండియన్ సిటిజన్స్ మలేషియాలో వీసా ఆన్ అరైవల్ కు అర్హులు. మీరు ఈ దేశాలకు కూడా ప్రయాణం చేయాలని అనుకుంటూ ఉంటే మీరు నేరుగా మలేషియన్ టూరిస్ట్ వీసా ను తీసుకోవడం ఉత్తమం.
థాయిలాండ్, సింగపూర్ లేదా ఇండోనేషియా దేశాల వ్యాలీడ్ టూరిస్ట్ వీసా (మీరు ఆ దేశాలకు కూడా ట్రావెల్ చేస్తుంటే)
ఇండియాకు చెల్లుబాటయ్యే రిటర్న్ టికెట్
3 రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
మీరు మలేషియాలో ఉన్న సమయంలో జీవనోపాధి కోసం కనీసం $1000 (అమెరికన్ డాలర్లు)ను రుజువుగా చూపెట్టాలి
మీరు బిజినెస్ కోసం ప్రయాణం చేస్తున్నట్లయితే కవర్ లెటర్.
మైనర్ దరఖాస్తు చేసుకుంటే తల్లిదండ్రులు ఎన్ఓసీతో పాటు పాస్ పోర్ట్ కాపీలను కూడా అందించాలి
ఈవీసా అనేది ఆన్ లైన్ అప్లికేషన్ ఫ్లాట్ ఫారమ్. మీరు ఎటువంటి చింత, టెన్షన్ లేకుండా మలేషియాలో ప్రవేశించేందుకు మీకు ఎలక్ట్రానిక్ వీసాను మంజూరు చేస్తుంది. మలేషియా ఈవీసా అనేది టూరిజం, సాధారణంగా స్నేహితులు లేదా బంధువులను కలిసేందుకు వెళ్లడం, తక్కువ వ్యవధిలో పూర్తయ్యే మెడికల్ చికిత్స, లేదా క్యాజువల్ బిజినెస్ పనుల మీద వెళ్లే వారికి మంజూరు చేయబడుతుంది. టూరిస్ట్ ల కోసం మూడు రకాల మలేషియా ఈవీసాలు అందుబాటులో ఉన్నాయి. (మలేషియా ఈవీసా) అవి: మలేషియా eNTRI వీసా, 30 రోజుల ఎంట్రీ టూరిస్ట్ వీసా మరియు 30 రోజుల మల్టీపుల్ ఎంట్రీ ఈవీసా.
ఆన్లైన్ లో సబ్మిట్ చేసిన అప్లికేషన్ కు మీరు ఏ దేశం వారు అనే దాని ప్రకారం USD 24.80 (ఆర్ఎం 105) వీసా ఫీజు ఉంటుంది. ఒక వేళ మీరు కనుక ఈకామ్ నుంచి లేదా మాస్టర్ కార్డ్ నుంచి చెల్లించినట్లయితే మీరు చెల్లించిన మొత్తంలో 0.8% కన్వీనియన్స్ ఫీజు ఉంటుంది. ఈ వాలెట్ల ద్వారా చెల్లిస్తే 1.7 శాతం కన్వీనియన్స్ ఫీజు ఉంటుంది.
మలేషియా ప్రభుత్వం మార్చి 2016లో మలేషియాలో పర్యటించి, అన్వేషించాలనుకునే ట్రావెలర్ల కోసం ఈ-వీసా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అందుకోసం ప్రయాణం చేయాలని అనుకునేవారు ఆన్లైన్ అప్లికేషన్ ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. ఫారాన్ని సరిగ్గా నింపి, అవసరమైన ఫీజును చెల్లించిన తర్వాత ట్రావెలర్లు ఎలక్ట్రానిక్ వీసాను ఈమెయిల్ ద్వారా పొందుతారు. ఈ-వీసా సదుపాయం అనేది చైనా, ఇండియా, శ్రీలంక, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, సెర్బియా, మాంటెనెగ్రో దేశాల పౌరులకు అందుబాటులో ఉంది.
ఈవీసా దరఖాస్తు కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి:
వీఎఫ్ఎస్ వెబ్సైట్ నుంచి వీసా దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
మీ వీసా అప్లికేషన్ ఫారాన్ని పూర్తిగా పూరించండి. ఫొటో స్పెసిఫికేషన్లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసిన తర్వాత అక్కడ ఫొటోను అంటించండి.
చెక్ లిస్ట్ సపోర్ట్ అవసరం అయిన అన్ని పత్రాలు అటాచ్ చేయండి.
మీ దరఖాస్తు పూర్తయిందని నిర్దారించుకోండి. అసంపూర్తిగా ఉన్న అప్లికేషన్లు ఆమోదం పొందవు.
కోల్కతా, చండీగఢ్, బెంగళూరు, హైదరాబాద్, పూనే, అహ్మదాబాద్లలో ఉన్న వీఎఫ్ఎస్ మలేషియా వీసా అప్లికేషన్ సెంటర్లకు వెళ్లి అక్కడ వర్తించే ఫీజులను నగదు లేదా డిమాండ్ డ్రాఫ్ట్లో చెల్లించండి.
మీ అప్లికేషన్ ను ఆన్లైన్ లో ట్రాక్ చేయండి
వ్యక్తిగతంగా మీరు వీఎఫ్ఎస్ కేంద్రం నుంచి పాస్ పోర్ట్ కలెక్ట్ చేసుకోండి. లేదా డెలివరీ కోసం వేచి చూడండి.
మలేషియా ఈవీసా/eNTRI కోసం దాదాపు 2 పనిదినాల సమయం పడుతుంది. 2 రోజుల ప్రక్రియ సమయం పడుతుంది. మీరు వీసా కోసం దరఖాస్తు చేసిన రోజు నుంచి ఇది లెక్కించబడుతుంది.
మీరు విదేశాలకు వెళ్లినపుడు చాలా విషయాలు తప్పుగా జరుగుతాయి. ఫ్లైట్ ఆలస్యాలు మరియు లగేజ్ లాస్ నుంచి మెడికల్ ఎమర్జెన్సీలు మరియు నగదు నష్టం వరకు; మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వలన అటువంటి పరిస్థితులు ఏర్పడినపుడు మీకు నష్టం కలగకుండా ఉండడం మాత్రమే కాకుండా మొత్తం పరిస్థితిని సులభతరం చేస్తుంది. మలేషియాకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఊహించని అన్ని పరిస్థితుల నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది. మీరు హోమ్ కు దూరంగా ఉండడం వల్ల మీరు అధికంగా బాధపడే పరిస్థితుల నుంచి కూడా మీకు రక్షణను అందిస్తుంది.
మలేషియా కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు అటువంటి పరిస్థితుల్లో భద్రతను అందిస్తుంది:
ట్రిప్ క్యాన్సలేషన్స్
మిస్స్డ్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్
ఇంజూరీ లేదా సిక్ నెస్
బ్యాగేజీ నష్టం లేదా బ్యాగేజీలో ఆలస్యం
సాహస క్రీడలు
ఎమర్జెన్సీ మెడికల్ తరలింపు
మరింత తెలుసుకోండి:
మీరు ఇంకా దేని కోసం వేచి చూస్తున్నారు? మీ వీసా మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆన్లైన్ లో పొందండి. మలేషియాలో ఎంజాయ్ చేసేందుకు అన్ని ప్రణాళికలు వేసుకోండి.
అవును. అయితే మీరు ఇండోనేషియా, థాయిలాండ్ లేదా సింగపూర్ నుంచి ప్రయాణం చేస్తున్నట్లైతే. అయితే మీరు 15 రోజుల కంటే తక్కువ సమయానికి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు వీసా మినహాయింపు కార్యక్రమం కింద eNTRI నోట్ పొందొచ్చు. eNTRI అనేది మీరు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించే ఒక సాధారణ నమోదు ప్రక్రియ.
అవును. అయితే మీరు ఇండోనేషియా, థాయిలాండ్ లేదా సింగపూర్ నుంచి ప్రయాణం చేస్తున్నట్లైతే. అయితే మీరు 15 రోజుల కంటే తక్కువ సమయానికి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు వీసా మినహాయింపు కార్యక్రమం కింద eNTRI నోట్ పొందొచ్చు. eNTRI అనేది మీరు దేశంలోకి ప్రవేశించేందుకు అనుమతించే ఒక సాధారణ నమోదు ప్రక్రియ.
అప్లికేషన్ ప్రక్రియలో మీరు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించాలి. మీరు వీసాకు అర్హులా? కాదా? అని నిర్ణయించేందుకు అధికారులకు అవి సహాయపడతాయి.
అప్లికేషన్ ప్రక్రియలో మీరు గత 3 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించాలి. మీరు వీసాకు అర్హులా? కాదా? అని నిర్ణయించేందుకు అధికారులకు అవి సహాయపడతాయి.
పరిగణలోకి తీసుకునే అంశాలు (థ్రెషోల్డ్) అనేవి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. మనం రాసినప్పుడు ఈ అమౌంట్ మొత్తం అనేది 1000 అమెరికన్ డాలర్లు.
పరిగణలోకి తీసుకునే అంశాలు (థ్రెషోల్డ్) అనేవి అప్పుడప్పుడూ మారుతూ ఉంటాయి. మనం రాసినప్పుడు ఈ అమౌంట్ మొత్తం అనేది 1000 అమెరికన్ డాలర్లు.
అవును. మీరు ఈవీసా కోసం దరఖాస్తు చేసుకునేటపుడు మీరు 30 రోజుల మల్టీపుల్ లీవ్స్ మరియు మల్టీపుల్ ఎంట్రీ వీసాకు అర్హులు.
అవును. మీరు ఈవీసా కోసం దరఖాస్తు చేసుకునేటపుడు మీరు 30 రోజుల మల్టీపుల్ లీవ్స్ మరియు మల్టీపుల్ ఎంట్రీ వీసాకు అర్హులు.
అవును. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ సమర్పించినపుడు మీరు వీసా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అవును. మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ సమర్పించినపుడు మీరు వీసా పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Please try one more time!
Travel Insurance for Popular Destinations from India
Get Visa for Popular Countries from India
నిరాకరణ -
మీ పాలసీ మీ పాలసీ షెడ్యూల్ మరియు పాలసీ పదాలలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. దయచేసి పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి.
దేశాలు, వీసా ఫీజులు మరియు ఇతర వాటి గురించి ఇక్కడ పేర్కొన్న సమాచారం వివిధ మూలాల నుండి తీసుకోబడింది. డిజిట్ ఇన్సూరెన్స్ ఇక్కడ దేనినీ ప్రచారం చేయడం లేదా సిఫార్సు చేయడం లేదు. దయచేసి మీరు మీ టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు, వీసా కోసం దరఖాస్తు చేసుకునే ముందు, ట్రావెల్ పాలసీని కొనుగోలు చేసే ముందు లేదా మరేదైనా నిర్ణయం తీసుకునే ముందు దాన్ని ధృవీకరించండి.
ఇతర ముఖ్యమైన కథనాలు
Get 10+ Exclusive Features only on Digit App
closeAuthor: Team Digit
Last updated: 28-08-2024
CIN: U66010PN2016PLC167410, IRDAI Reg. No. 158.
గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో ఒబెన్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అని పిలుస్తారు) - రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ - 1 నుండి 6 అంతస్తులు, అనంత వన్ (ఎఆర్ (AR) వన్), ప్రైడ్ హోటల్ లేన్, నర్వీర్ తానాజీ వాడి, సిటీ సర్వే నెం.1579, శివాజీ నగర్, పూణే -411005, మహారాష్ట్ర | కార్పొరేట్ ఆఫీస్ చిరునామా - అట్లాంటిస్, 95, 4వ బి క్రాస్ రోడ్, కోరమంగళ ఇండస్ట్రియల్ లేఅవుట్, 5వ బ్లాక్, బెంగుళూరు-560095, కర్ణాటక | పైన ప్రదర్శించబడిన, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ యొక్క ట్రేడ్ లోగో, గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినది మరియు లైసెన్స్ క్రింద, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ అందించింది మరియు ఉపయోగించబడుతుంది.